iDreamPost

మున్సిపల్ ఎన్నికల వల్ల పేమెంట్స్ ఆప్స్ కు పెరిగిన డిమాండ్

మున్సిపల్ ఎన్నికల వల్ల పేమెంట్స్ ఆప్స్ కు పెరిగిన డిమాండ్

మోడీ ప్రభుత్వం నోట్ల రద్దు నిర్ణయం తర్వాత దేశంలో డిజిటల్ లావాదేవీలు పెరిగాయి. అందులో భాగంగా గూగుల్ పే,ఫోన్ పే,పేటీఎం లాంటి పేమెంట్స్ అప్లికేషన్లకి డిమాండ్ ఏర్పడింది.

నగరాల్లోనే కాకుండా చిన్న చిన్న గ్రామాల్లో కూడా పేమెంట్ యాప్స్ వాడకం బాగా ఎక్కువైంది. కానీ ఇప్పుడు తాజాగా తెలంగాణాలో జరగబోయే మునిసిపల్ ఎన్నికల్లో ఈ అప్లికేషన్ల సాయంతో డబ్బును పంపిణీ చేస్తున్నారు కొందరు టెక్నాలజీ తెలిసిన నాయకులు.

గతంలో అయితే ఎన్నికల సమయంలో ఓటర్లను ప్రభావితం చేయడానికి నగదు రూపేణా ప్రతీ కుటుంబానికి పంపిణీ చేసేవారు. కానీ ప్రస్తుతం నగదు పంచిపెడితే అధికారులు దాడి చేసి ఆ నగదును పట్టుకుని కేసులు పెడతారేమో అన్న భయంతో మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న కొందరు నాయకుల్లో కలగడం వలన గూగుల్ పే, ఫోన్ పే,పేటీఎం లాంటి పేమెంట్స్ అప్లికేషన్ల సాయంతో ఓటర్ల బ్యాంకు అకౌంట్ కి నగదును పంపిణి చేస్తూ ఓటర్లను ప్రభావితం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు.

ఏదేమైనా పేమెంట్ అప్లికేషన్లు తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో ఓటర్లకు నగదు పంపిణీ చేయడానికి బాగా ఉపయోగపడుతున్నాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి