iDreamPost

మార్కెట్ లోకి వచ్చేసిన బడ్జెట్ ఫ్లాగ్ షిప్ ఫోన్.. ఇన్ని ఫీచర్స్ ఇంత తక్కువ ధరకా?

Poco F6 5G SmartPhone- Full Specifications And Price: మార్కెట్లోకి ఒక గేమ్ ఛేంజింగ్ ఫ్లాగ్ షిప్ ఫోన్ వచ్చేసింది. అది కూడా బడ్జెట్ రేంజ్ లోనే ఉండటం విశేషం. ఈ ఫోన్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ మారిపోయింది. మరి.. ఆ ఫోన్ ప్రత్యేకతలు, ధర ఎంతో చూడండి.

Poco F6 5G SmartPhone- Full Specifications And Price: మార్కెట్లోకి ఒక గేమ్ ఛేంజింగ్ ఫ్లాగ్ షిప్ ఫోన్ వచ్చేసింది. అది కూడా బడ్జెట్ రేంజ్ లోనే ఉండటం విశేషం. ఈ ఫోన్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ మారిపోయింది. మరి.. ఆ ఫోన్ ప్రత్యేకతలు, ధర ఎంతో చూడండి.

మార్కెట్ లోకి వచ్చేసిన బడ్జెట్ ఫ్లాగ్ షిప్ ఫోన్.. ఇన్ని ఫీచర్స్ ఇంత తక్కువ ధరకా?

స్మార్ట్ ఫోన్ యూజర్స్ తరచూ ఈ ఫ్లాగ్ షిప్ ఫోన్ అనే మాట వినే ఉంటారు. అంటే అది కాస్త ప్రీమియం ఫీచర్స్, స్పెసిఫికేషన్స్ తో వస్తూ ఉంటుంది అని అర్థం. అంటే అన్ని ఫీచర్స్ ఉంటే దాని ధర కూడా అదే రేంజ్ లో ఉంటుంది. అయితే మీకు ఇప్పుడు ఒక ఫ్లాగ్ షిప్ ఫోన్ బడ్జెట్ రేంజ్ లోకి వచ్చేసింది. అది కూడా కేవలం రూ.27 వేలలోపే ఒక ఫ్లాగ్ షిప్ ఫోన్ రావడం అంటే మామూలు విషయం కాదు. ఒక్కే ఫీచర్ వింటూ ఉంటే మీకు బుర్ర గిర్రున తిరుగుతుంది. ఎందుకంటే అక్కడ చెప్పే ఫీచర్స్ కి.. వాళ్లు పెట్టిన ధరకు అస్సలు సంబంధం లేదు. కాకపోతే ఈ ఆఫర్స్ ఎక్కువ రోజులు ఉండే ఛాన్స్ లేదు. డిమాండ్ పెరిగిందంటే రేటు పెరిగిపోతుంది కూడా.

ఇప్పుడు చెప్పుకుంటున్న ఆ ఫ్లాగ్ షిప్ 5జీ ఫోన్ పేరు పోకో ఎఫ్6 5జీ. గతంలో ఉన్న సిరీస్ ని ఒక అప్ గ్రేడెడ్ ప్రాసెసర్ తో తీసుకొచ్చారు. అలాగే చాలా ఫీచర్స్ కూడా మార్చేశారు. అయితే ఇండియాలోనే ఇది ఫస్ట్ 8ఎస్ జెన్ 3 ప్రాసెసర్ తో రన్ అయ్యే స్మార్ట్ ఫోన్. అలాంటి ఒక ఫోన్ ని అతి తక్కువ ధరలో తీసుకురావడం కూడా అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. లుక్స్, స్క్రీన్, ప్రాసెసర్, బిల్ట్ క్వాలిటీ, ప్రైస్ అన్నింటింలో అగ్రెసివ్ ఛేంజ్ అయితే చూపించారు. అందుకే ఇప్పుడు ఈ స్మార్ట్ ఫోన్ టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిపోయింది. ఈ ఫోన్ ని రూ.30 వేలలోపు తీసుకొస్తారని భావించారు. కానీ, అందరూ ఊహించిన దానికంటే కూడా.. చాలా తక్కువ ధరకు తీసుకొచ్చేశారు.

ఈ పోకో ఎఫ్6 5జీ స్మార్ట్ ఫోన్ లో మొత్తం 3 వర్షన్స్ ఉన్నాయి. ఇది స్టార్టింగ్ వేరియంట్ 8 జీబీ ర్యామ్+ 256 జీబీ స్టోరేజ్ తో తీసుకొస్తున్నారు. ఈ వర్షన్ ధరను అన్నీ ఆఫర్స్ కలిపి రూ.25,999కే అందించనున్నారు. అలాగే ఇందులో ఇంకో వర్షన్ 12 జీబీ ర్యామ్+ 256 జీబీ స్టోరేజ్ ధర అన్నీ ఆఫర్స్ కలిపి రూ.27,999కే అందిస్తున్నారు. ఇంక మూడో వర్షన్ 12 జీబీ ర్యామ్+ 512జీబీ స్టోరేజ్ వర్షన్ ధర అన్నీ ఆఫర్స్ కలిపి కేవలం రూ.29,999కే అందిస్తున్నారు. అంటే మీరు ఒక ఫ్లాగ్ షిప్ ఫోన్ హైఎండ్ వర్షన్ ను కేవలం రూ.30 వేలలోపే పొందచ్చు. ఈ పాయింటే ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ముఖ్యంగా ఈ ఫోన్ స్పీడ్ గురించి మాట్లాడుకోవాలి. ఇది మంచి గేమింగ్ ఫోన్ కూడా అవుతుంది. అలాగే పిక్చర్ క్వాలిటీ, ఇమేజెస్, కెమెరా ఇలా అన్ని విభాగాల్లో ఈ ఫోన్ ధరకు వర్త్ అనే చెప్పాలి.

పోకో F6 5G ఫీచర్స్:

  • 6.67 1.5కే ఆమోలెడ్ డిస్ ప్లే
  • 120 హెట్జ్ రిఫ్రెష్ రేట్
  • 10+2 బిట్ కలర్ డెప్త్
  • 2400 నిట్స్ పీక్ బ్రైట్ నెస్
  • క్వాల్కామ్ స్నాప్ డ్రాగన్ 8ఎస్ జెన్ 3 ప్రాసెసర్
  • డాల్బీ విజన్
  • డాల్బీ ఆటమ్స్ సౌండ్
  • 8జీబీ/ 12 జీబీ ర్యామ్
  • 256 జీబీ/ 512 జీబీ స్టోరేజ్
  • 50 ఎంపీ సోనీ ఐవోఎస్+ 8 ఎంపీ అల్ట్రా వైడ్ కెమెరా
  • 20 ఎంపీ సెల్ఫీ కెమెరా
  • 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 90 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ (50% ఇన్ 15 మినిట్స్)
  • 120 వాట్స్ ఛార్జర్
  • ఇన్ డిస్ ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి