iDreamPost

పిన్నెల్లికి మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన AP హైకోర్టు!

AP High Court- Pinnelli Ramakrishna Reddy: ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి భారీ ఊరట లభించింది. ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.

AP High Court- Pinnelli Ramakrishna Reddy: ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి భారీ ఊరట లభించింది. ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.

పిన్నెల్లికి మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన AP హైకోర్టు!

మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఏపీ హైకోర్టులో భారీ ఊరట లభించింది. ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేసిన ఆయనకు హైకోర్టు మధ్యంతర బెయిల్ ని మంజూరు చేసింది. జూన్ 5వ తారీఖు వరకు మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దు అంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసుకు సంబంధించి తదుపరి విచారణను జూన్ 6వ తేదీకి వాయిదా వేస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకుంది. ఈ కేసు విచారణలో పిన్నెల్లి తరఫున న్యాయవాది కీలక విషయాలను వెల్లడించారు. ఘటన జూన్ 13న జరిగితే.. ఎఫ్ఐఆర్ మాత్రం జూన్ 15న నమోదు చేశారు అంటూ న్యాయవాది వాదనలు వినిపించారు.

ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. ఆయన వేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై ఏపీ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. అలాగే తదుపరి విచారణను జూన్ 6కి వాయిదా వేసింది. ఈ కేసుకు సంబంధించి పిన్నెల్లి తరఫు న్యాయవాది కీలక వాదనలు వినిపించారు. ముఖ్యంగా ఈ ఘటన జూన్ 13న జరిగితే ఎఫ్ఐఆర్ మాత్రం జూన్ 15న నమోదు చేశారు అంటూ కోర్టుకు విన్నవించారు. అలాగే మొదటి ఈ కేసుకు సంబంధించి గుర్తుతెలియని వ్యక్తులు అంటూ పేర్కొని.. తర్వాత లోకేశ్ షేర్ చేసిన వీడియో చూసి ఈసీ చర్యలు తీసుకోవడంపై న్యాయవాది నిరంజన్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు.

ట్విట్టర్ లో పోస్ట్ చేసిన వీడియో మార్ఫింగ్ కూడా కావచ్చు అంటూ న్యాయవాది అనుమానాలు వ్యక్తం చేశారు. అంతేకాకుండా నోటీసులు ఇవ్వకపోవడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఏడేళ్లలోపు శిక్షపడే సెక్షన్లు ఉంటే 41A కింద నోటీసులు ఇవ్వాలనే మార్గదర్శకాలను గుర్తు చేశారు. సుప్రీంకోర్టు ఆర్నేష్ కుమార్ కేసులో అలాంటి మార్గదర్శకాలు ఉన్నట్లు ఉటంకించారు. ఏడేళ్లలోపు శిక్షపడే సెక్షన్లు కావడంతో బెయిల్ మంజూరు చేయాలని పిన్నెల్లి తరఫు న్యాయవాది హైకోర్టును కోరారు. పిన్నెల్లికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేశారు. కౌంటర్ దాఖలు చేసేందుకు తమకు సమయం కావాలని ఈసీ తరఫు న్యాయవాది కోర్టును కోరారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి