iDreamPost

చంద్రబాబుకు, జగన్‌కు మధ్య వ్యత్యాసం అదే..!

చంద్రబాబుకు, జగన్‌కు మధ్య వ్యత్యాసం అదే..!

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం మారి ఇంకా ఏడాది పూర్తి కాలేదు. విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో పరిపాలనలో అనుభవం ఉన్న నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా టీడీపీ ప్రభుత్వం కొలువుతీరింది. దాదాపు 650 హామీలు, అనుభవం అనే చక్రాలపై టీడీపీ బండి పట్టాలపైకి వచ్చింది. ఐదేళ్లు ముగిసాయి. నిర్థిష్టమైన హామీలు, విశ్వసనీయత అనే చక్రాలతో ఈ సారి ఎలాంటి పరిపాలన అనుభవం లేని వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రిగా వైసీపీ ప్రభుత్వం పట్టాలపైకి వచ్చింది. సీఎం జగన్‌ నేతృత్వంలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడవకముందే చంద్రబాబుకు, జగన్‌కు మధ్య ఉన్న వ్యత్యాసం ఏమిటో రాష్ట్ర ప్రజలకే కాదు రాజకీయ విశ్లేషకులు, విమర్శలకు అర్థం అవుతోంది.

ఇచ్చిన హామీలను ఎలా ఎగ్గొట్టాలి, అడిగిన వారిని ఎలా దబాయించాలి, చేయకపోయినా.. చేశామని ఎలా చెప్పుకోవాలి.. అనే రీతిలో 40 ఏళ్ల రాజకీయ అనుభవం 2014 నాటికి 9 ఏళ్లు ముఖ్యమంత్రిగా, 10 ఏళ్లు ప్రతిపక్ష నేతగా, ఏడు పదుల వయస్సులో ఉన్న చంద్రబాబు నాయుడు పాలన సాగిన విషయం ప్రజల మెదల్లోలో ఇప్పటికీ మెదులుతూనే ఉంది. మరి ఇప్పుడు.. ఇచ్చిన హామీలను ఎలా అమలు చేయాలి, అందు కోసం యంత్రాంగాన్ని ఎలా నడిపించాలి..? పథకాల అమలులో వివక్ష లేకుండా ఎలా దిశానిర్ధేశం చేయాలి అనే ఆలోచనలతో తాను ఇచ్చిన హామీల అమలుకు క్యాలెండర్‌ ప్రకటించిన ముఖ్యమంత్రిగా ఎలాంటి అనుభవం లేని నాలుగు పదుల వయసున్న వైఎస్‌ జగన్‌ పాలనను ప్రజలు చూస్తున్నారు.

చంద్రబాబు, జగన్‌ ఇద్దిరికీ ఒక్కటే వ్యత్యాసం.. అదే విశ్వసనీయత. ఇచ్చిన మాట ఎలా తప్పాలనేది ఒకరి ఆలోచనైతే.. ఇచ్చిన మాట ఎలా అమలు చేయాలనేది మరోకరి ఆలోచన. నాకు ఓట్లు వేసిన వారికే ప్రభుత్వ పథకాలు ఇవ్వాలనేది చంద్రబాబు హుంకారమైతే.. ఓట్లు వేసినా, వేయకపోయినా.. అందరికీ ప్రభుత్వ పథకాలు అందాలనేది వైఎస్‌ జగన్‌ మాట. ‘‘పాలనా కాలం చివరి నెలల్లో చేశామని చెప్పుకునేందుకు పథకాలు ప్రవేశపెట్టే చంద్రబాబు ఎక్కడ, పాలన పగ్గాలు చేపట్టిన మొదటి ఏడాదిలోనే హామీల అమలుకు పథకాలు అమలు చేస్తున్న జగన్‌ ఎక్కడ’’ అనే మాటలు ప్రస్తుతం ఏపీలో వినిపిస్తున్నాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి