iDreamPost

కరోనా లెక్కలపై చైనా అబద్ధాలు చెప్పిందా ? ఎన్ని కేసులున్నాయో తెలుసా ?

కరోనా లెక్కలపై చైనా అబద్ధాలు చెప్పిందా ? ఎన్ని కేసులున్నాయో తెలుసా ?

కరోనా వైరస్ తీవ్రత విషయంలో చైనా ఇంత కాలం అబద్ధాలే చెప్పిందా ? అంటే అవుననే సమాధానం వస్తోంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం చైనాలో నమోదైన కేసులు 82 వేలు కాదని తేలిపోయింది. చైనా మిలిటరీకి చెందిన నేషనల్ యూనివర్సిటి ఆఫ్ డిఫెన్స్ టెక్నాలజీ నుండి లీక్ అయిన సమాచారం ప్రకారం వైరస్ బాధితుల సంఖ్య 6.4 లక్షలుగా లెక్కతేలింది. ప్రజల భద్రతతో పాటు అనేక ఇతర కారణాలను దృష్టిలో పెట్టుకుని వాస్తవాలను చైనా ప్రభుత్వం బయటపెట్టలేదని డిఫెన్స్ టెక్నాలజీని ఉదహరిస్తు వాషింగ్టన్ కు చెందిన ’ఫారిన్ పాలసీ మ్యాగజైన్’ ప్రత్యేక కథనాన్ని అందించింది.

మామూలుగా చైనాలోని వూహాన్ నగరంలోనే కేసులు తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు చైనా కలరింగ్ ఇచ్చింది. వూహాన్ ను లాక్ డౌన్ చేయటం యావత్ ప్రపంచం కూడా సమస్యంతా ఎక్కువగా వూహన్ లోనే ఉందని భావించారు. ఎందుకంటే చైనాలో ఏ విషయం అయినా ప్రభుత్వం బయటపెడితేనే ప్రపంచానికి తెలుస్తుంది. అలాంటిది తాజాగా వెల్లడైన సమాచారం ప్రకారం సమస్య వూహాన్లోనే కాదని చైనాలోని చాలా రాష్ట్రాలు, నగరాల్లో ఉధృతంగా ఉందని తేలింది.

ఇంతకాలం చైనా లెక్క ప్రకారం బాధితుల సంఖ్య 82 వేలుగా నమోదైంది. అధికారిక సమాచారం అదే కాబట్టి ప్రపంచమంతా అదే ప్రామాణికంగా తీసుకుంది. కానీ స్వయంగా చైనా ప్రభుత్వమే ఉద్దేశ్యపూర్వకంగా తప్పుడు లెక్కలను విడుదల చేసిందనే విషయంపై అనుమానాలు పెరిగిపోతోంది. మీడియా, విదేశీ మీడియాపై చైనాలో ఉక్కుపాదం ఉన్న కారణంగా ఏ విషయం కూడా బయటకు రావటం లేదు.

అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం వూహాన్ లో కలిపి మొత్తం చైనాలో దాదాపు 80 లక్షల సిమ్ కార్డులు నెలల తరబడి పనిచేయటం లేదట. అలాగే వూహాన్ లోని ఎలక్ట్రిక్ క్రిమిటోరియంలు ఆమధ్య నెలల తరబడి 24 గంటలూ నిర్విరామంగా పనిచేశాయట. ఎలక్ట్రిక్ క్రిమిటోరియంలు రోజుల తరబడి 24 గంటలూ పనిచేశాయంటే ఏమిటర్ధం ? అధికారిక లెక్కల ప్రకారం 4633 మంది చనిపోయారనేది కూడా తప్పుడు లెక్కలే అని తాజాగా వెల్లడైన లెక్కల ప్రకారం అనుమానాలు పెరిగిపోతున్నాయి. మరి ఇపుడైనా చైనా ప్రభుత్వం అసలైన లెక్కలను వెల్లడిస్తుందా ? చూడాల్సిందే.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి