iDreamPost
android-app
ios-app

ఐదేళ్ల తర్వాత మరోసారి ధనుష్ కీలక నిర్ణయం..!

  • Author ajaykrishna Published - 08:20 AM, Mon - 21 August 23
  • Author ajaykrishna Published - 08:20 AM, Mon - 21 August 23
ఐదేళ్ల తర్వాత మరోసారి ధనుష్ కీలక నిర్ణయం..!

సౌత్ ఇండియన్ స్టార్స్ లో ఒకరైన ధనుష్.. ప్రస్తుతం కెరీర్ పరంగా చేతినిండా సినిమాలతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇటీవల హీరోగా తన 49వ సినిమా కెప్టెన్ మిల్లర్ కంప్లీట్ చేస్తున్న ధనుష్.. తదుపరి సినిమాలను చకచకా సెట్స్ పైకి తీసుకెళ్లే ఆలోచన చేస్తున్నాడు. కోలీవుడ్ నుండి హాలీవుడ్ సినిమాలలో నటించే స్థాయికి ఎదిగిన ధనుష్.. తెలుగులోను వరుసగా కొత్త ప్రాజెక్ట్స్ లైనప్ చేస్తున్నాడు. అయితే.. ధనుష్ కేవలం నటుడిగానే కాకుండా.. సింగర్, లిరిసిస్ట్, డైరెక్టర్, నిర్మాత.. ఇలా మల్టీటాలెంటెడ్ అని తెలిసిందే. ఇప్పటికే చాలా సార్లు తన స్పెషల్ టాలెంట్స్ అన్ని ప్రూవ్ చేసుకుంటూ వచ్చాడు. దీంతో అటు దేశవ్యాప్తంగా ధనుష్ కి మంచి ఫ్యాన్ బేస్ ఏర్పడింది.

ఇక ధనుష్ సింగర్ గా, లిరిసిస్ట్ గా ఎంత అలరించినా.. తనలో మంచి టేస్ట్ ఉన్న ప్రొడ్యూసర్ ఉన్నాడు. ధనుష్ కి వండర్ బార్ ఫిలిమ్స్ అని ప్రొడక్షన్ హౌస్ ఉంది. అందులో ఇప్పటికే 14 సినిమాలు ప్రొడ్యూస్ చేశాడు. అయితే.. తన కెరీర్ లో 50వ సినిమా ఎంతో స్పెషల్ కాబోతుందని అంటున్నాడు. అందుకే ఆ సినిమా కర్ణన్, మామన్నన్ సినిమాలు తీసిన మారి సెల్వరాజ్ దర్శకత్వంలో చేసే ప్లాన్ లో ఉన్నాడు. తన ప్రొడక్షన్ హౌస్ వండర్ బార్ ఫిలిమ్స్ లోనే ఈ సినిమా నిర్మించనున్నట్లు సమాచారం. నిర్మాతగా ధనుష్.. 3, ఎదుర్‌ నీచ్చల్‌, వేలై ఇల్లా పట్టాదారి, కాకాముట్టై, మారి, నానుమ్‌ రౌడీధాన్‌, విచారణై, కాలా, వడ చైన్నె వంటి విజయవంతమైన సినిమాలు ప్రొడ్యూస్ చేశాడు. చివరిగా 2018లో మారి 2 చిత్రాన్ని నిర్మించాడు. ఆ తర్వాత నిర్మాతగా ఏ సినిమా చేయలేదు.

ఈ క్రమంలో ఇప్పుడు మరోసారి నిర్మాతగా కొత్త సినిమా చేసే ప్రణాళిక చేస్తున్నాడు. దాదాపు ఐదేళ్ల తర్వాత మళ్లీ ధనుష్ నిర్మాతగా సినిమా చేస్తుండటంతో ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. ధనుష్ కి కర్ణన్ లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన మారి సెల్వరాజ్.. ఈ సినిమా చేయనున్నాడు. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం చేస్తున్న కెప్టెన్ మిల్లర్ మూవీ పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ కాబోతుంది. డిసెంబర్ 15న రిలీజ్ కాబోతున్న ఈ సినిమాలో ధనుష్ గెటప్స్.. క్యారెక్టరైజేషన్స్ కొత్తగా ఉండబోతున్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ తర్వాత 50 సినిమా చేసి.. శేఖర్ కమ్ముల, మారి సెల్వరాజ్, ఆర్. బాల్కి డైరెక్షన్స్ లో సినిమాలు చేయబోతున్నాడు. మరి ధనుష్ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Jojobet GirişmeritbetzirvebetMeritbet girişcasibomJojobet GirişjojobetjojobetjojobetjojobetzirvebetMadridbetMadridbetcasibomkingroyal girişmeritkinggalabetjojobetholiganbet girişMarsbahis GüncelMarsbahis GirişMarsbahis Güncel GirişJojobet GirişCasibom