iDreamPost

DC vs GT: వీడియో: DC గెలిచింది పంత్‌ వల్ల కాదు.. ఈ కుర్రాడి వల్లే!

గుజరాత్ టైటాన్స్ పై ఢిల్లీ క్యాపిటల్స్ 4 పరుగుల తేడాతో థ్రిల్లింగ్ విక్టరీని నమోదు చేసింది. అయితే ఈ మ్యాచ్ పంత్ వల్లే గెలిచిందని అందరూ అనుకుంటున్నారు. కానీ కాదని.. ఆ కుర్రాడి వల్లే డీసీకి ఈ విజయం దక్కిందని కెవిన్ పీటర్సన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. మరి పీటర్సన్ అలా ఎందుకు అన్నాడో ఇప్పుడు చూద్దాం.

గుజరాత్ టైటాన్స్ పై ఢిల్లీ క్యాపిటల్స్ 4 పరుగుల తేడాతో థ్రిల్లింగ్ విక్టరీని నమోదు చేసింది. అయితే ఈ మ్యాచ్ పంత్ వల్లే గెలిచిందని అందరూ అనుకుంటున్నారు. కానీ కాదని.. ఆ కుర్రాడి వల్లే డీసీకి ఈ విజయం దక్కిందని కెవిన్ పీటర్సన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. మరి పీటర్సన్ అలా ఎందుకు అన్నాడో ఇప్పుడు చూద్దాం.

DC vs GT: వీడియో: DC గెలిచింది పంత్‌ వల్ల కాదు.. ఈ కుర్రాడి వల్లే!

225 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ 19 ఓవర్లకు 8 వికెట్లు కోల్పోయి 206 పరుగులతో ఉంది. విజయానికి చివరి ఓవర్లో 19 రన్స్ కావాలి. క్రీజ్ లో 6 బంతుల్లో 13 పరుగులు చేసిన సాయి కిశోర్, రషీద్ ఖాన్ ఉన్నారు. దీంతో మ్యాచ్ నరాలు తెగే ఉత్కంఠతకు దారితీసింది. ప్రేక్షకులు బంతి బంతికి ఊపిరి బిగపట్టుకుని మ్యాచ్ ను చూస్తున్నారు. కానీ చివరి ఓవర్లో 14 రన్స్ మాత్రమే వచ్చాయి. దీంతో 4 పరుగులతో గుజరాత్ ఓడిపోయింది. అయితే ఈ మ్యాచ్ లో ఢిల్లీ గెలించింది రిషబ్ పంత్ బ్యాటింగ్ వల్లే అనుకుంటున్నారు. కానీ కాదు.. ఈ కుర్రాడి వల్లే. పూర్తి వివరాల్లోకి వెళితే..

గుజరాత్ తో జరిగిన మ్యాచ్ ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్ థండర్ ఇన్నింగ్స్ తో అదరగొట్టాడు. 44 రన్స్ కే 3 కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న జట్టును ఆదుకున్న తీరు అమోఘం. అసలు ఢిల్లీ 224 రన్స్ చేస్తుందని ఎవ్వరూ ఊహించి ఉండరు. కానీ పంత్ పుణ్యమా అని ఆ రన్స్ వచ్చాయి. పంత్ కేవలం 43 బంతుల్లోనే 5 ఫోర్లు, 8 సిక్సులతో 88 పరుగులతో అజేయంగా నిలిచాడు. దీంతో భారీ స్కోర్ చేసి పంత్ ఢిల్లీని గెలిపించాడని అందరూ అనుకుంటున్నారు. కానీ అసలు ఢిల్లీ గెలిచింది పంత్ వల్ల కాదని ఓ కుర్రాడి వల్ల అని ఇంగ్లండ్ దిగ్గజ ప్లేయర్ కెవిన్ పీటర్సన్ తన అభిప్రాయాని వ్యక్తం చేశాడు. అసలు విషయం ఏంటంటే?

ఢిల్లీ బౌలర్ రాసిక్ సలామ్ వేసిన 19వ ఓవర్లో 18 పరగులు వచ్చాయి. అసలైతే 24 రన్స్ రావాల్సింది. కానీ ఢిల్లీ ప్లేయర్ ట్రిస్టన్ స్టబ్స్ మెరుపు ఫీల్డింగ్ తో సిక్స్ వెళ్లే బంతిని అద్భుతంగా ఆపాడు. ఈ ఓవర్ రెండో బంతిని రషీద్ ఖాన్ భారీ షాట్ ఆడాడు. దీంతో బంతి ఫ్లాట్ సిక్స్ గా వెళ్తుందని అందరూ భావించారు. కానీ అనూహ్యంగా స్టబ్స్ ఆ బాల్ ను సిక్స్ వెళ్లకుండా ఆపాడు. అప్పటి గుజరాత్ ప్లేయర్లు సింగిల్ మాత్రమే తీశాడు. దీంతో ఢిల్లీకి 5 పరుగులు సేవ్ అయ్యాయి. ఇదే బాల్ సిక్స్ పడితే గుజరాత్ విజయం సాధించేదే. స్టబ్స్ సేవ్ చేసిన 5 రన్స్ వల్లే నిన్న ఢిల్లీ విజయం సాధించిందని కెవిన్ పీటర్సన్ పేర్కొన్నాడు. మరి ఢిల్లీ ట్రిస్టన్ స్టబ్స్ వల్లే గెలిచింది అన్న పీటర్సన్ కామెంట్స్ పై మీ అభిప్రాయాలను తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by CricFit | Cricket News Update (@cricfit)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి