iDreamPost

రోగుల పాలిట యమకింకరులుగా మారిన వైద్యులు.. ఇలాంటి ఘోరం ఎక్కడా వినుండరు!

వైద్యులను దేవుళ్లగా కొలుస్తుంటాం. కానీ, ఇప్పుడు అదే కొందరు వైద్యులు ఇప్పుడు యమకింకరులుగా మారిపోతున్నారు. ఫేక్ సర్టిఫికేట్లతో ఓ క్లినిక్ ను ఏర్పాటు చేసి చివరికి అమాయకుల ప్రాణాలు తీస్తున్నారు. ఇంతకు ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే?

వైద్యులను దేవుళ్లగా కొలుస్తుంటాం. కానీ, ఇప్పుడు అదే కొందరు వైద్యులు ఇప్పుడు యమకింకరులుగా మారిపోతున్నారు. ఫేక్ సర్టిఫికేట్లతో ఓ క్లినిక్ ను ఏర్పాటు చేసి చివరికి అమాయకుల ప్రాణాలు తీస్తున్నారు. ఇంతకు ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే?

రోగుల పాలిట యమకింకరులుగా మారిన వైద్యులు.. ఇలాంటి ఘోరం ఎక్కడా వినుండరు!

మాములుగా మనం వైద్యులను దేవుళ్లతో సమానంగా కొలుస్తుంటాము. కానీ, అదే కొందరు వైద్యులు ఇప్పుడు యమకింకరులుగా మారిపోతున్నారు. మారిపోయారు. అవును, మీరు విన్నది నిజమే. కొందరు వ్యక్తులు ఫేక్ సర్టిఫికేట్లతో వైద్యులుగా చలామణి అవుతూ ప్రజల ప్రాణాలతో చలగాటమాడుతున్నారు. ఈ ఫేక్ డాక్టర్ల దారుణంలో ఇప్పటికీ ఏడుగురు బలైనట్లుగా తెలుస్తుంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన దేశ వ్యాప్తంగా ఇప్పుడు తీవ్ర కలకలంగా మారుతోంది. అనంతరం కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇంతకు ఈ ఘటన ఎక్కడ జరిగింది? అసలు స్టోరీ ఏంటంటే?

పోలీసుల కథనం ప్రకారం.. దేశ రాజధాని దక్షిణ ఢిల్లీలోని ఓ ప్రాంతంలో నీరజ్ అగర్వాల్, అతని భార్య పూజా అగర్వాల్ తో పాటు మరి కొంత మంది వ్యక్తులు కలిసి 2016లో ఓ క్లినిక్ ను ప్రారంభించారు. షాకింగ్ న్యూస్ ఏంటంటే? వీళ్లు నకిలీ సర్టిఫికేట్లు చూపించి డాక్టర్లుగా చలామణీ అవుతున్నారు. అయితే ఈ వైద్యులు గుట్టు చప్పుడు కాకుండా గత కొన్నాళ్ల నుంచి ప్రజలను మోసం చేస్తూ చివరికి వారి ప్రాణాలతో చెలగాట మడుతున్నారు.ఇకపోతే.. ఇదే ప్రాంతంలో నివాసం ఉంటున్న కొందరు వ్యక్తులు వైద్యం నిమిత్తం ఇటీవల వీరి క్లినిక్ లో చేరారు. దీంతో ఆ డాక్టర్లు వచ్చి రాని చికిత్స చేయడంతో అది బెడిసి కొట్టి చివరికి ఇద్దరు రోగులు ప్రాణాలు కోల్పోయారు.

ఇక మృతుల కుటంబ సభ్యులకు  ఈ వైద్యుల తీరుపై అనుమానం వచ్చింది. ఫేక్ సర్టిఫికేట్లతో ఈ ఆస్పత్రిని నడిపిస్తున్నట్లు వారు గుర్తించారు. వెంటనే ఇదే విషయంపై స్థానిక పోలీసులకు సమచారం అందించారు. ఇక ఆ ఆస్పత్రికి చేరుకున్న పోలీసులు వారి సర్టిఫికేట్లను పరిశీలించగా.. వీళ్లంతా నకిలీ డాక్టర్లు అని తెలిసింది. ఇక పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టగా.. ఈ నకిలీ డాక్టర్లు ఇప్పటికీ ఎంతో మంది అమాయకులను పొట్టన పెట్టుకున్నట్లు తెలిసింది. దీంతో పాటు ఈ వైద్యులు.. ముగిసిన మందులు, సర్జికల్ బ్లేడ్స్ ను వాడుతున్నట్లుగా బయటపడింది. ఇక రోగుల ప్రాణాల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా ప్రోటోకాల్ ను వదిలి దారుణానికి పాల్పడ్డారు.

మరో విషయం ఏంటంటే? వీరి క్లినిక్ పై ఇప్పటికీ 9పైగా కేసులు కూడా నమోదైనట్లు పోలీసులు తెలిపారు. ఇక అసలు విషయం వెలుగులోకి రావడంతో ఆ ఫేక్ డాక్టర్లు పోలీసుల విచారణలో సమాధానాలు చెప్పలేక నోట్లో నీళ్లు నమిలారు. అనంతరం పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి నీరజ్ అగర్వాల్, అతని భార్య పూజా అగర్వాల్ తో పాటు మరి కొంత మంది ఫేక్ డాక్టర్ల బృందాన్ని అరెస్ట్ చేశారు. ఈ నకిలీ డాక్టర్లు ఇప్పటికీ దాదాపు  ఏడుగురు వ్యక్తులను బలి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఫేక్ వైద్యుల బండారం బయట పడడంతో స్థానిక ప్రజలు భయందోళనలకు గురవుతున్నారు. నకిలీ సర్టిఫికేట్లతో ఆస్పత్రి నడిపిస్తున్న ఈ నకిలీ డాక్టర్ల దారుణంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి