iDreamPost

ఢిల్లీ ఎన్నికల కౌంటింగ్

ఢిల్లీ ఎన్నికల కౌంటింగ్

పేరుకే ఢిల్లీ రాష్ట్రం ,పెత్తనం మొత్తం కేంద్రానిదే!గతంలో ప్రతి ఎన్నికలో ఢిల్లీకి పూర్తిస్థాయి రాష్ట్ర హోదా ఇస్తామని కాంగ్రెస్,బీజేపీ రెండు వాగ్ధానం చేసేవి కానీ అధికారంలోకి వచ్చిన తరువాత మాత్రం ఆదిశగా ప్రయత్నాలు చేసేవి కావు.

2015లో కేజ్రీవాల్ AAP గెలిచినా తరువాత ఢిల్లీ రాష్ట్ర స్థాయి మీద పూర్తిస్థాయి అవగాహన వచ్చింది. గతంలో కేవలం పోలీస్ వ్యవస్థ మాత్రమే కేంద్రం పరిధిలో ఉండేది. కానీ కేజ్రీవాల్ ముఖ్యమంత్రి అయినా తరువాత క్లర్క్ ఉద్యోగాల నుంచి అన్నిటిలో గవర్నర్ పెత్తనం కోనసాగింది.ఢిల్లీ చీఫ్ సెక్రెటరీ ఆఫీస్ మీదనే ఏసీబీ/సిబిఐ దాడులు జరిగాయి. కొద్దికాలం తరువాత చీఫ్ సెక్రెటరీ మొదలు అందరు ఐఏఎస్ లు గవర్నర్కే రిపోర్ట్ చెయ్యటం మొదలు పెట్టారు..

Read Also: దేశానికి ఢిల్లీ దిశానిర్దేశం అవుతుందా

ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తన హక్కుల కోసం నిత్యం పోరాటం చెయ్యకతప్పలేదు,గవర్నర్ బంగ్లాలో మూడు రోజులు దీక్ష చేసేస్థాయికి పరిస్థితి వెళ్ళింది. మరో వైపు పాలనలో కేజ్రీవాల్ అద్భుతమైన మార్పులు తీసుకొచ్చారు. ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలలు ఎంతగా మెరుగుపడ్డాయంటే ఆంధ్రతో సహా అనేక రాష్ట్రాలు విద్యావ్యవస్థ అధ్యయనానికి ఢిల్లీ వెళ్లాయి. మంచి నీటి సరఫరా,కరెంట్ సరఫరా ఇలా ప్రజలకు అవసరమైన ప్రతి అంశంలో ఢిల్లీ ప్రభుత్వం గొప్ప పురోగతిని సాధించింది. ట్రాఫిక్ నియంత్రణతో పాటు మహిళాలకు ఉచిత ప్రయాణ సదుపాయం కలిగించింది.

AAP పార్టీ పరంగా కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్నా ప్రభుత్వరంగా గడచిన ఐదు సంవత్సరాలలో స్థిరమైన పాలన అందించింది. బీజేపీ.. కేజ్రీవాల్ దేశద్రోహి లాంటి ఆరోపణలకు పరిమితమాయ్యింది..గత ఎన్నికల ఎత్తుగడలే ఈ ఎన్నికల్లోనూ బీజేపీ అమలు పరిచింది

Read Also: ముఖ్యమంత్రి పీఠం దిశగా కేజ్రీవాల్

కేజ్రీవాల్ ఈ ఎన్నికల్లో మోడీ మీద దాడికి దిగకుండా తాము చేసిన అభివృద్ది పనుల ప్రచారం మీద ఎక్కువ దృష్టి పెట్టారు. బీజేపీ అస్త్రాలైన CAB ,హిందుత్వ ప్రభావిత అంశాలకు కేజ్రీవాల్ దూరంగా ఉన్నారు. చివరికి షాహీన్ బాగ్ దీక్షలను కూడా సందర్శించలేదు. అంటే కేజ్రీవాల్ తన ఆట తానూ ఆడాడు ,బీజేపీ బౌన్సర్లను బ్యాటింగ్ చెయ్యకుండా వదిలేశాడు .

కాంగ్రెస్ అసలు పోటీలో ఉందా లేదా అన్నట్లు ఉంది. JNU ,ఢిల్లీ యూనివర్సిటీ రాజకీయాలు ఢిల్లీ ఎన్నికల మీద ప్రభావం చూపుతాయి.

గత 2015 ఎన్నికల్లో మొదట AAP గెలుస్తుందని చెప్పిన ప్రీపోల్ సర్వేలు ఎన్నికల నాటికి బీజేపీ దే గెలుపు అని ప్రకటించాయి. బీజేపీ ఓడిపోతుందన్న ఊహను కూడా చెప్పటానికి సర్వే సంస్థలు చేయలేకపోయాయి. కానీ ఈ ఎన్నికలో ఎన్నడూ లేని విధంగా అన్ని ఎగ్జిట్ పోల్స్ AAP గెలుస్తుందని అంచనా వేశాయి.

మరి కొద్దీ సేపట్లో ఢిల్లీ ఎన్నికల ఫలితాల కౌంటింగ్ మొదలవుతుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి