iDreamPost

ఆస్పత్రిలో నిద్రలేని రాత్రుల నుంచి IPLలో వీర విహారం.. ఎవరీ రఘువన్షీ?

Who Is Angkrish Raghuvanshi: ఢిల్లీతో మ్యాచ్ లో కేకేఆర్ జట్టు మెరుపులు మెరిపించింది. సునీల్ నరైన్ 85 పరుగులతో చెలరేగాడు. రఘువన్షీ కూడా అర్ధ శతకం చేశాడు. అసలు ఎవరు ఈ రఘువన్షీ?

Who Is Angkrish Raghuvanshi: ఢిల్లీతో మ్యాచ్ లో కేకేఆర్ జట్టు మెరుపులు మెరిపించింది. సునీల్ నరైన్ 85 పరుగులతో చెలరేగాడు. రఘువన్షీ కూడా అర్ధ శతకం చేశాడు. అసలు ఎవరు ఈ రఘువన్షీ?

ఆస్పత్రిలో నిద్రలేని రాత్రుల నుంచి IPLలో వీర విహారం.. ఎవరీ రఘువన్షీ?

ఢిల్లీ క్యాపిటల్స్- కోల్ కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో పరుగుల వరద పారింది. ఢిల్లీ బౌలర్స్ కు అస్సలు ఆస్కారం లేకుండా కేకేఆర్ బ్యాటర్స్ చెలరేగి ఆడారు. వేసే ప్రతి బంతిని సిక్సు, ఫోర్ గా మలుస్తూ పంత్ సేనకు చుక్కలు చూపించారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కేకేఆర్ జట్టు తొలి ఓవర్ నుంచి ఢిల్లీ బౌలర్లపై ఆధిపత్యం కొనసాగిస్తూనే ఉంది. ఫిలిప్ సాల్ట్ కేవలం 18 పరుగులకే అవుట్ అవ్వగానే ఢిల్లీ సంబరాలు చేసుకుంది. కానీ, సునీల్ నరైన్- అంగ్క్రీష్ రఘువన్షీ జోడీ ఢిల్లీ బౌలర్లకు భయం ఏంటో చూపించింది. వీళ్లిద్దరు ప్రతి బౌలర్ పై విరుచుకుపడ్డారు. ఇప్పుడు అంతా సునీల్ నరైన్ తో కలిసి పరుగుల వరద పారించిన రఘువన్షీ గురించే మాట్లాడుకుంటున్నారు. అసలు ఎవరీ రఘువన్షీ?

వైజాగ్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్- కోల్ కతా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ ఉత్కంఠగా సాగింది. ఈ మ్యాచ్ లో కేకేఆర్ బ్యాటర్లు వీర విహారం చేశారు. ముఖ్యంగా సునీల్ నరైన్(85), రఘువన్షీ(54) చెలరేగడంతో స్కోర్ బోర్డ్ పరుగులు పెట్టింది. అయితే ఇప్పుడు అందరూ అసలు ఎవరీ రఘువన్షీ అని వెతుకులాట మొదలు పెట్టారు. అరంగేట్రం మ్యాచ్ లోనే అర్ధశతకం చేసిన యంగెస్ట్ ప్లేయర్ గా రికార్డులకెక్కాడు. ఈ 18 ఏళ్ల రఘువన్షీ ఆర్సీబీతో జరిగిన మ్యాచ్ లో ఇంపాక్ట్ ప్లేయర్ గా జట్టులోకి అడుగుపెట్టాడు. అయితే ఆ మ్యాచ్ లో అతనికి బ్యాటింగ్ చేసే అవకాశం దక్కలేదు. ఢిల్లీలో మ్యాచ్ లో బ్యాటింగ్ కి రావడమే కాకుండా.. బౌలర్లపై విజృంభించాడు. కేవలం 25 బంతుల్లోనే 50 పరుగులు చేశాడు. ఈ రఘువన్షీ ఢిల్లీ కుర్రాడు కావడం మరో విశేషం. 2005లో ఢిల్లీ జన్మించిన రఘువన్షీ 11 ఏళ్ల వయసులో ముంబయికి షిఫ్ట్ అయ్యాడు. అక్కడ అతనిలో ఉన్న క్రికెటింగ్ స్కిల్స్ కి పదునుపెట్టాడు.

రఘువన్షీ పేరు 2022 అండర్ 19 వరల్డ్ కప్ లో బాగా వినిపించింది. ఆ టోర్నమెంట్ లో రఘువన్షీ 278 పరుగులు చేశాడు. టీమిండియా టైటిల్ కొట్టడంలో రఘువన్షీ కీలకపాత్ర పోషించాడు. రఘువన్షీ 2023లో ముంబయి తరఫున లిస్ట్ ఏ, టీ20ల్లో అరంగేట్రం చేశాడు. అతను సీకే నాయుడు ట్రోఫీలో మెరిశాడు. ఆ టోర్నీలో ఏకంగా 765 పరుగులు చేశాడు. దేశవాళీ వైట్ బాల్ క్రికెట్ లో మాత్రం రఘువన్షీ పెద్దగా రాణించలేదు. కానీ, అతడిని కేకేఆర్ కొనుగోలు చేయడం వెనుక పెద్ద కథ ఉంది. రఘువన్షీ చిన్ననాటి కోచ్ అభిషేక్ నాయర్. అతను ప్రస్తుతం కేకేఆర్ సపోర్టింగ్ స్టాఫ్ గా ఉన్నాడు. అతని ప్రోత్బలంతోనే రఘువన్షీకి కేకేఆర్ జట్టులో స్థానం దక్కిందని చెప్తున్నారు. అతనికి వచ్చిన అవకాశాన్ని మాత్రం సద్వినియోగం చేసుకుంటున్నాడు.

అంగ్క్రీష్ రఘువన్షీ వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే.. అతని తమ్ముడు కృష్ణన్ ఒక టెన్నిస్ ప్లేయర్. అతనికి చిన్న వయసులోనే క్యాన్సర్ ఉన్నట్లు తేలింది. కృష్ణన్ అంటే రఘువన్షీకి విపరీతమైన ప్రేమ అని అతని తల్లి వెల్లడించింది. కృష్ణన్ కోసం రఘువన్షీ ఎన్నో రాత్రులు ఆస్పత్రిలోనే గడిపేవాడంట. తమ్ముడిని అలా ఆస్పత్రిలో చూసి మానసికంగా ఎంతో వ్యధను అనుభవించేవాడని తల్లి తెలియజేసింది. కృష్ణన్ ట్రీట్మెంట్ తీరు కూడా అంగ్క్రీష్ రఘువన్షీని మెంటల్ స్ట్రాంగ్ చేసిందని చెప్పుకొచ్చారు. మొత్తానికి టీమిండియాకి మరో స్టార్ దొరికాడు అంటూ ఐపీఎల్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ మ్యాచ్ లో కేకేఆర్ ఐపీఎల్ లోనే సెకండ్ హయ్యెస్ట్ స్కోర్ నమోదు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 272 పరుగులు చేసింది. మరి.. అంగ్క్రీష్ రఘువన్షీ ఆటపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి