iDreamPost

Davos Tour : సీఎం జగన్ దావోస్ టూర్.. ఏపీకి పెట్టుబడుల వెల్లువ

Davos Tour : సీఎం జగన్ దావోస్ టూర్.. ఏపీకి పెట్టుబడుల వెల్లువ

ఏపీ సీఎం జగన్ ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. పర్యటనలో భాగంగా..ప్రపంచ ఆర్థిక సదస్సులో జగన్ పాల్గొన్నారు. ఈ వేదికగా.. గ్రీన్ ఎనర్జీ రంగంలో ఏపీకి మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు ప్రముఖ కంపెనీలు మొగ్గు చూపాయి. మంగళవారం జరిగిన ఈ సదస్సులో సీఎం జగన్ మరో మూడు అవగాహన ఒప్పందాలు చేసుకున్నారు. రూ.37 వేల కోట్లతో గ్రీన్ కో విద్యుత్ ఉత్పత్తికి ఒప్పందం జరిగింది. దీని ద్వారా రాష్ట్రంలో 10 వేల మందికి ఉపాధి లభించనుంది.

అలాగే అరబిందో రియాల్టీ సంస్థతో మరో రూ.28 వేల కోట్లకు ఒప్పందం కుదుర్చుకుంది ఏపీ ప్రభుత్వం. దీని ద్వారా మరో 8 వేలమందికి ఉపాధి లభించనుంది. ఏపీలో 13,700 మెగావాట్ల గ్రీన్ ఎనర్జీ కోసం ఇప్పటికే అదానీ సంస్థతో రూ.60 వేలకోట్లకు ఒప్పందం జరగగా.. తాజాగా జరిగిన ఒప్పందాలతో.. ఒక్క గ్రీన్ ఎనర్జీ ద్వారానే రాష్ట్రానికి రూ.1.25 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయి. దీనిపై సీఎం జగన్ హర్షం వ్యక్తం చేశారు. గ్రీన్ కో సంస్థతో జరిగిన ఒప్పందం ద్వారా.. 8 వేల మెగావాట్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి కానుంది. అలాగే అరబిందో రియాల్టీ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ తో కుదుర్చుకున్న అవగాహన ఒప్పందం ద్వారా6 వేల మెగావాట్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి కానుంది.

వీటితో పాటు కృష్ణాజిల్లా మచిలీపట్నంలో కర్బన రహిత ఇండస్ట్రియల్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ జోన్‌ ఏర్పాటుకు ఏస్‌ అర్బన్‌ డెవలపర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌తో రాష్ట్ర ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదర్చుకుంది. గ్రీన్ ఎనర్జీతో ఈ జోన్ లో పారిశ్రామిక ఉత్పత్తి చేపట్టనుంది. ప్రపంచస్థాయి కంపెనీలకు అవసరమైన వసతులను ఈ జోన్ లోనే కల్పించనున్నారు.

 

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి