iDreamPost

David Warner: వీడియో: మ్యాచ్‌ కోసం హెలికాప్టర్‌లో వార్నర్‌.. నేరుగా గ్రౌండ్‌లోనే ల్యాండింగ్‌!

  • Published Jan 12, 2024 | 12:15 PMUpdated Jan 12, 2024 | 12:15 PM

బ్యాటింగ్​తోనే కాదు తన అల్లరితో, డ్యాన్స్​తో అభిమానుల్ని సర్​ప్రైజ్ చేస్తుంటాడు డేవిడ్ వార్నర్. అలాంటి ఈ ఆసీస్ ఓపెనర్ ఈసారి అందర్నీ షాక్​కు గురిచేశాడు.

బ్యాటింగ్​తోనే కాదు తన అల్లరితో, డ్యాన్స్​తో అభిమానుల్ని సర్​ప్రైజ్ చేస్తుంటాడు డేవిడ్ వార్నర్. అలాంటి ఈ ఆసీస్ ఓపెనర్ ఈసారి అందర్నీ షాక్​కు గురిచేశాడు.

  • Published Jan 12, 2024 | 12:15 PMUpdated Jan 12, 2024 | 12:15 PM
David Warner: వీడియో: మ్యాచ్‌ కోసం హెలికాప్టర్‌లో వార్నర్‌.. నేరుగా గ్రౌండ్‌లోనే ల్యాండింగ్‌!

క్రికెట్ అంటే కొందరికి ఇష్టం, మరికొందరికి ఎంటర్​టైన్​మెంట్. కానీ జెంటిల్మన్‌ గేమ్ అంటే ఫుల్ ప్యాషన్, పిచ్చి, ప్రేమ ఉన్నవాళ్లూ చాలా మందే ఉన్నారు. గేమ్ మీద తమకు ఉన్న లవ్​ను ఒక్కొక్కరు ఒక్కోలా చూపిస్తుంటారు. అభిమానులను పక్కన పెట్టి ప్లేయర్ల విషయానికొస్తే.. ఆట కోసం ఎన్నో విషయాలను వదులుకుంటారు. నచ్చిన ఫుడ్​ను, పార్టీ, ఎంజాయ్​మెంట్.. ఇలా అన్నింటినీ పక్కకు క్రికెట్​ మీదే కాన్​సంట్రేట్ చేస్తారు. ఒక్కోసారి తమ ఇంట్లో వేడుకలకు కూడా దూరమవుతుంటారు. ఆస్ట్రేలియా డాషింగ్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ కూడా ఇప్పుడు అలాగే చేశాడు. బిగ్​బాష్ లీగ్ కోసం తన తమ్ముడి పెళ్లిని కూడా వదులుకున్నాడీ స్టార్ బ్యాట్స్​మన్. ఏకంగా వివాహ వేదిక నుంచి మ్యాచ్ జరుగుతున్న గ్రౌండ్​లోకి హెలికాప్టర్​లో ల్యాండ్ అయ్యాడు.

బిగ్​బాష్ లీగ్​లోని ఓ మ్యాచ్​కు ఆతిథ్యం ఇస్తున్న సిడ్నీ క్రికెట్ గ్రౌండ్​లో శుక్రవారం హల్​చల్​ చేశాడు డేవిడ్ వార్నర్. హాలీవుడ్ హీరోల రేంజ్​లో హెలికాప్టర్ వేసుకొని ఏకంగా గ్రౌండ్​లోకి దిగిపోయాడు. ఇవాళ తన సోదరుడి పెళ్లి ఉండటంతో డేవిడ్ భాయ్ ఈ మ్యాచ్​లో ఆడతాడో లేదో అనుమానంగా మారింది. కానీ వివాహ వేడుకను త్వరగా ముగించుకొని నేరుగా హెలికాప్టర్​లో మైదానానికి చేరుకున్నాడు. అయితే మ్యాచ్​ ఆరంభానికి ముందే అతడు అక్కడికి రీచ్ అయ్యాడు. మ్యాచ్ చూసే ఆడియెన్స్ కోసం గేట్లు తెరవడానికి ముందే డేవిడ్ భాయ్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ఎస్​సీజీలో ల్యాండ్ అయింది. దీంతో అతడు ప్రాతినిధ్యం వహిస్తున్న సిడ్నీ థండర్ టీమ్ ‘అతను వచ్చేశాడు’ అంటూ నెట్టింట ఓ పోస్ట్ చేసి తమ సంతోషాన్ని అభిమానులతో పంచుకుంది.

వార్నర్ హెలికాప్టర్​ ల్యాండింగ్ వీడియో చూసిన నెటిజన్స్ షాకవుతున్నారు. హెలికాప్టర్​ను నేరుగా గ్రౌండ్​కు వేసుకొని రావడం ఏంట్రా బాబు అని ఆశ్చర్యపోతున్నారు. గేమ్​పై డేవిడ్ భాయ్​కు ఉన్న కమిట్​మెంట్​కు ఇది నిదర్శనమని కామెంట్స్ చేస్తున్నారు. వార్నర్​ హాలీవుడ్ స్టైల్ ఎంట్రీ అదిరిపోయిందని చెబుతున్నారు. బిగ్​బాష్​ లీగ్​లో సిడ్నీ థండర్ తరఫున ఈ మ్యాచ్ సహా మరో రెండు గేమ్స్​లో ఆడనున్నాడు వార్నర్. ఆ తర్వాత ఐఎల్ టీ20 లీగ్​లో పాల్గొనేందుకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్​కు పయనం కానున్నాడు. అక్కడ దుబాయ్ క్యాపిటల్స్ తరఫున అతడు బరిలోకి దిగనున్నాడు. అది ముగిసిన వెంటనే వెస్టిండీస్​తో స్వదేశంలో జరిగే టీ20 సిరీస్​లో పాల్గొంటాడీ లెఫ్టాండ్ బ్యాటర్. ఐపీఎల్​లోనూ సందడి చేయనున్నాడు. మరి.. మ్యాచ్ కోసం వార్నర్ హెలికాప్టర్​ వేసుకొని రావడంపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ చేయండి.

ఇదీ చదవండి: ఆయన నాకు స్ఫూర్తి! టీమిండియాను గెలిపించిన దూబె ఇంట్రెస్టింగ్‌ స్టేట్‌మెంట్‌..

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి