iDreamPost
android-app
ios-app

Bigg Boss 7 Telugu: గీతూపై బూతులతో రెచ్చిపోయిన ధామినీ సోదరి!

Bigg Boss 7 Telugu: గీతూపై బూతులతో రెచ్చిపోయిన ధామినీ సోదరి!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 అంతా ఉల్టా పుల్టా అని అందరికీ తెలిసిందే. అయితే ఎలిమినేషన్స్ మాత్రం పక్కాగా జరుగుతున్నాయి. ఇప్పటివరకు మూడు వారాల్లో ముగ్గురు ఇంటికి వెళ్లిపోయారు. మొదటివారం కిరణ్ రాథోడ్, రెండో వారం షకీలా, మూడోవారం సింగర్ ధామినీ ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేశారు. వీరిలో సింగర్ ధామినీ కాస్త ఫాస్ట్ గా హౌస్ నుంచి వచ్చేసిందేమో అనే భావన అయితే ప్రేక్షకుల్లో ఉంది. అయితే గేమ్ పరంగా రెండు వారాల పాటు ధామినీ పెద్దగా కనిపించలేదు. పైగా గొడవలు జరుగుతుంటే దూరంగా వెళ్లిపోవడం చేసింది. అయితే కరెక్ట్ గా గేమ్ స్టార్ట్ చేసింది అనుకున్న సమయానికి ధామినీ ఎలిమినేట్ అయింది.

బిగ్ బాస్ హౌస్ లో కంటెంట్ ఇవ్వకపోతే కంటిన్యూ అవ్వడం కష్టం. హౌస్ లో ఉండాలి అంటే గొడవలకు దిగాలి. నీ తప్పు ఉన్నా కూడా కొన్నిసార్లు కేకలు వేయాల్సి ఉంటుంది. కానీ, ధామినీ మాత్రం తన తప్పులేకపోయినా కూడా గట్టిగా నిలదీయలేకపోయింది. ఎవరన్నా కేకలు వేస్తుంటే దూరంగా వెళ్లిపోయింది. ఇవ్వన్నీ చూసిన ప్రేక్షకులు సింగర్ ధామినీ బిగ్ బాస్ హౌస్ కి అంత సూట్ కాదు అని అనుకున్నారు. కానీ, రెండువారాల తర్వాత ధామినీ తన ఆటను స్టార్ట్ చేసింది. కానీ, అప్పటికే చాలా లేట్ అయిపోయింది. అప్పటికే కంటెస్టెంట్స్ అంతా ఫామ్ లోకి వచ్చేశారు. అందరి ముందు ధామినీ తేలిపోయినట్లు కనిపించింది. దాంతో హౌస్ నుంచి బయటకు రాక తప్పలేదు. అయితే ఎలిమినేట్ అయ్యి వచ్చిన తర్వాత కూడా ధామినీ కుంగిపోలేదు. చాలా స్ట్రాంగ్ గా ఉంది. అలాగే హౌస్ నుంచి వచ్చే సమయంలో కంటెస్టెంట్స్ కి మంచి సూచనలు కూడా చేసింది.

బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన తర్వాత బయటకు వచ్చాక బిగ్ బాస్ బజ్ అనే ఇంటర్వ్యూ చేస్తారు. ఏడాదికి ఒకరు హోస్ట్ గా ఉంటారు. ఈ బిగ్ బాస్ బజ్ సీజన్ ను గీతూ రాయల్ హోస్ట్ చేస్తోంది. అయితే బిగ్ బాస్ బజ్ ఎపిసోడ్ లో స్టార్టింగ్ వీక్స్ లో వచ్చే కంటెస్టెంట్స్ ని గేమ్ ఆడలేక బయటకు వచ్చేశావ్ అనే ధోరణిలో ప్రశ్నలు అడుగుతారు. అది ఏటా జరిగే ప్రక్రియే. ఈసారి గీతూ రాయల్ కూడా ధామినీని కాస్త అలాంటి ప్రశ్నలే అడిగింది. ఇంత త్వరగా ఎందుకు బయటకు వచ్చానో నాకు అర్థం కావట్లేదు అంటే.. ఇంటర్వ్యూ అయ్యే సరికి నీకే క్లారిటీ వస్తుంది అంటూ కామెంట్ చేసింది. అలాంటి సైటెర్లు, కాస్త ఇబ్బంది పెట్టాలని చూసే ప్రశ్నలు ధామినీకి ఎక్కువగానే వచ్చాయి. అయితే ధామినీ ఎంతో కాన్ఫిడెంట్ గా, మెచ్యూర్డ్ గా సమాధానాలు చెప్పింది.

Dhamini sister warning to geethu royal

కానీ, ధామినీ సిస్టర్ కు అంత పేషన్స్ ఉన్నట్లు లేదు. తన సోదరిని ఇబ్బంది పెట్టినట్లు మాట్లాడినందుకు గీతూ రాయల్ పై బూతులతో రెచ్చిపోయింది. తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో అసలు బిగ్ బాస్ బజ్ హోస్ట్ చేసేది ఎవరు? అంటూ ప్రశ్నించింది. మధ్యలో ఒక బూతును కూడా చేర్చింది. ఒకవేళ ఆమె టైటిల్ విన్నర్ అయుంటే.. నాకు పేరు తెలిసే ఉండాలే? అంటూ ప్రశ్నించింది. ఈ టాపిక్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఇంక ఈ సీజన్ కి సంబంధించిన లీకులు చూస్తుంటే.. మరోసారి సింగర్ ధామినీ హౌస్ లోకి రీ ఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. మరి.. గీతూ రాయల్ పై ధామినీ చెల్లి చేసిన కామెంట్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

jojobet girişmarsbahiscasibomJojobet GirişcasibomJojobet GirişHoliganbetcasibom girişholiganbetvaycasinomarsbahis girişJojobettaraftarium24madridbet güncel girişHoliganbet Girişmadridbet güncel girişmadridbet