iDreamPost

ఆస్ట్రేలియాని వణికిస్తున్న సైబర్ దాడులు! ఏకంగా దేశమే హడల్!

  • Author Soma Sekhar Published - 05:24 PM, Mon - 13 November 23

వరుసగా జరుగుతున్న సైబర్ దాడులతో ఆస్ట్రేలియా ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఈ దాడులతో ఆస్ట్రేలియా డేంజర్ జోన్ లో ఉంది.

వరుసగా జరుగుతున్న సైబర్ దాడులతో ఆస్ట్రేలియా ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఈ దాడులతో ఆస్ట్రేలియా డేంజర్ జోన్ లో ఉంది.

  • Author Soma Sekhar Published - 05:24 PM, Mon - 13 November 23
ఆస్ట్రేలియాని వణికిస్తున్న సైబర్ దాడులు! ఏకంగా దేశమే హడల్!

ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులోకి వస్తున్న కొత్త టెక్నాలజీతో ప్రయోజనాలే కాదు.. ప్రమాదాలు కూడా ఉన్నాయని ఎన్నో సంఘటనలు ఇప్పటికే రుజువుచేశాయి. ప్రస్తుత ఆధునిక సమాజంలో సైబర్ నేరాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. గవర్నమెంట్ సంస్థలు, బ్యాంకులు, రక్షణ విభాగాలకు సంబంధించిన వెబ్ సైట్లను హ్యాక్ చేసి విలువైన సమాచారాన్ని చోరీ చేస్తున్న విషయం మనకు తెలియనిది కాదు. తాజాగా ఆస్ట్రేలియా దేశం సైబర్ దాడులు తట్టుకోలేక వణికిపోతోంది. ఆసీస్ టెలి కమ్యూనికేషన్ పై సైబర్ నేరగాళ్లు దాడిచేయగా.. తాజాగా పోర్టులకు సంబంధించిన వెబ్ సైట్ ను హ్యాక్ చేశారు నేరగాళ్లు. మరిన్ని వివరాల్లోకి వెళితే..

‘క్రైమ్ చావదు దాని రూపం మార్చుకుంటుంది అంతే’ అన్న ఆర్జీవీ సినిమాలోని మాటలు ప్రస్తుత సమాజానికి అచ్చుగుద్దినట్లుగా సరిపోతాయి. టెక్నాలజీ పెరిగే కొద్ది ఆర్థిక దొంగతనాలు ఎక్కువ అవుతున్న సంఘటనలు మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా వరుసగా జరుగుతున్న సైబర్ దాడులతో ఆస్ట్రేలియా ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఇటీవలే ఆస్ట్రేలియాలోని రెండో అతిపెద్ద టెలి కమ్యూనికేషన్ కంపెనీ ఆప్టస్ లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో దాదాపు కోటి మంది కస్టమర్లకు ఇంటర్నెట్, మెుబైల్ సేవలు నిలిచిపోయాయి. గతేడాది కూడా ఈ సంస్థపై ఇలాగే సైబర్ దాడి జరిగింది. ఇది ఆ దేశ చరిత్రలోనే బిగ్గెస్ట్ డేటా లీక్ గా నిలిచింది.

తాజాగా మరోసారి కంగారూ దేశంపై సైబర్ దాడి జరిగింది. ఆసీస్ లోని అతిపెద్ద నౌకాశ్రయం వెబ్ సైట్ సైబర్ దాడికి గురైంది. దీని కారణంగా ఆ వెబ్ సైట్ ను కొన్ని రోజుల పాటు మూసివేయాల్సి వచ్చింది. ఇక ఈ దాడిని ఆస్ట్రేలియా ప్రభుత్వం కూడా ధ్రువీకరించింది. ఈ పోర్ట్ కు సంబంధించి 40 శాతం ఎగుమతులు, దిగుమతుల సముద్ర రవాణాను దుబాయ్ కి చెందిన డీపీ వరల్డ్ అనుబంధ సంస్థ నిర్వహిస్తోంది. మెల్ బోర్న్, సిడ్నీ, బ్రిస్బేన్, పెర్త్, ఫ్రిమాంటల్ లాంటి పోర్టుల టెర్మినళ్లు డీపీ వరల్డ్ ఆధీనంలో నడుస్తున్నాయి.

ఈ సైబర్ దాడుల కారణంగా ఎగుమతుల, దిగుమతులపై తీవ్ర ప్రభావం పడింది. నౌకలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. శుక్రవారం వెలుగు చూసిన ఈ దాడి నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది సంస్థ. సోమవారం నుంచి డీపీ వరల్డ్ సంస్థకు సంబంధించిన అన్ని వెబ్ సైట్స్ ఆన్ లైన్ సేవలు అందుబాటులోలకి వచ్చాయి. కాగా.. ఈ దాడికి పాల్పడిన వారిని ఇంకా గుర్తించలేదని అధికారులు తెలిపారు. ఈ పరిస్థితిపై సోమవారం ఉదయం పోర్ట్స్‌ ఆస్ట్రేలియా ఓ ప్రకటన చేసింది. ‘డీపీ వరల్డ్‌ టెర్మినళ్లలో పరిస్థితి అలాగే కొనసాగుతోంది.. మిగతా సంస్థల ఆధీనంలోని ఓడరేవుల టెర్మినళ్లు సాధారణంగానే పనిచేస్తున్నాయి’ అని పేర్కొంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి