iDreamPost

బరితెగించిన సైబర్ నేరగాళ్లు.. ఏకంగా తెలంగాణ డీజీపీనే వాడారు

  • Published May 21, 2024 | 12:22 PMUpdated May 21, 2024 | 12:22 PM

Cyber Criminals Fraud: టెక్నాలజీ పెరుగుతున్న కొద్ది సైబర్ నేరగాళ్ల సంఖ్య కూడా పెరిగిపోతుంది. ఈ మద్య సైబర్ నేరగాళ్లు కొత్త ట్రెండ్ ఫాలో అవుతున్నారు.. ఉన్నతాధికారుల ఫోటోలు డీపీగా పెట్టుకొని అమాయకులను బెదిరిస్తూ డబ్బు గుంజుతున్నారు.

Cyber Criminals Fraud: టెక్నాలజీ పెరుగుతున్న కొద్ది సైబర్ నేరగాళ్ల సంఖ్య కూడా పెరిగిపోతుంది. ఈ మద్య సైబర్ నేరగాళ్లు కొత్త ట్రెండ్ ఫాలో అవుతున్నారు.. ఉన్నతాధికారుల ఫోటోలు డీపీగా పెట్టుకొని అమాయకులను బెదిరిస్తూ డబ్బు గుంజుతున్నారు.

  • Published May 21, 2024 | 12:22 PMUpdated May 21, 2024 | 12:22 PM
బరితెగించిన సైబర్ నేరగాళ్లు.. ఏకంగా తెలంగాణ డీజీపీనే వాడారు

ఈ మధ్య కాలంలో దొంగలు కొత్త కొత్త పద్దతుల్లో నేరాలకు పాల్పపడుతున్నారు. ఒకప్పుడు దొంగలు ఇళ్లల్లో కన్నాలు వేసి చోరీలకు పాల్పపడేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. సైబర్ నేరగాళ్లు టెక్నాలజీ ఉపయోగించి ఎక్కడో ఉండి మన కొల్లగొడతున్నారు. ఇటీవల సైబర్ నేరగాళ్ళ మోసాబు మరీ మితిమీరిపోతున్నాయి. గిఫ్టులు, కూపన్లు, కొన్ని కంపెనీల పార్శిల్స్ వచ్చాయని చెబుతూ కేవైసీ పేరుతో డిటెల్స్ తెలుసుకొని క్షణాల్లో అకౌంట్ లో ఉన్న డబ్బు దోచేస్తున్నారు. తాము మోసపోయామని తెలుసుకొని బాధితులు లబో దిబో అంటూ సైబర్ క్రైమ్ ని ఆశ్రయిస్తున్నారు. ఇప్పుడు సైబర్ నేరగాళ్లు మరీ బరితెగించిపోతున్నారు.. ఏకంగా సెలబ్రెటలు, రాజకీయ నేతలు, ఉన్నతాధికారుల ఫోటోలు వాడుతూ బెదిరింపులకు పాల్పపడుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటన హైదరాబాద్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..

హైదరాబాద్ లో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఏకంగా తెలంగాణ డీజీపీ పేరుతో మోసాలకు పాల్పపడుతున్నారు. సైబర్ కేటుగాళ్ళు తెలంగాణ డీజీపీ వాట్సాఫ్ ఫోటోతో ఫేక్ వాట్సాప్ డీపీని క్రియేట్ చేసి మోసాని పాల్పపడిన ఘటన సంచలనం సృష్టించింది. డీజీపీ రవి గుప్తా ఫోటో పెట్టి ఓ వ్యాపార వేత్త కూతురికి వాట్సాప్ కాల్ చేశారు.. నిన్న డ్రగ్స్ కేసులో అరెస్ట్ చేస్తామని భయపెట్టారు.తనకు ఏం తెలియదు అని చెప్పినా వినలేదు. కేసు నుంచి తప్పించాలంటే 50 వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దీంతో ఆ వ్యాపారవేత్త కూతురు తండ్రితో జరిగిన విషయం చెప్పింది. +92 కోడ్ తో కాల్ రావడంతో అనుమానించిన వ్యాపారవేత్త పోలీసులను ఆశ్రయించారు.

కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభిచారు. విచారణలో భాగాంగా అది పాకిస్థాన్ కోడ్ గా సైబర్ పోలీసులు గుర్తించారు. అనుమానిత నెంబర్ల నుంచి ఫోన్లు వేస్తే లిఫ్ట్ చేయవొద్దని.. ఒకవేళ లిఫ్ట్ చేస్తే ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తే వెంటనే దగ్గరలోని పోలీస్ స్టేషన్ కి వెళ్లి కాల్ వివరాలు చూపించాలని పోలీసులు సూచించారు. సైబర్ నేరాల పట్ల అవగాహన పెంచేందుకు కృషి చేస్తామని.. ఇలాంటి ఫేక్ కాల్స్ విషయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు. ఇటీవల తెలంగాణ డీజీపీగా రవి గుప్తా నియమితులయ్యారు. రవి గుప్తా 1990 బ్యాచ్ కి చెందిన సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ గా ఉన్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి