iDreamPost

నిరుద్యోగుల పాలిట వరం.. ఇకపై ఆ పరీక్షలు కూడా తెలుగులోనే!

నిరుద్యోగ అభ్యర్థులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇది వారిపాలిట వరమనే చెప్పాలి. మరి ఇంతకీ కేంద్ర హోం శాఖ తీసుకున్న ఆ నిర్ణయం ఏంటి? ఆ వివరాలు తెలుసుకుందాం పదండి.

నిరుద్యోగ అభ్యర్థులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇది వారిపాలిట వరమనే చెప్పాలి. మరి ఇంతకీ కేంద్ర హోం శాఖ తీసుకున్న ఆ నిర్ణయం ఏంటి? ఆ వివరాలు తెలుసుకుందాం పదండి.

నిరుద్యోగుల పాలిట వరం.. ఇకపై ఆ పరీక్షలు కూడా తెలుగులోనే!

దేశంలో లక్షల మంది ఉద్యోగాలకు ప్రయత్నిస్తూ ఉన్నారు. అలాంటి నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది కేంద్ర హోం శాఖ. సెంట్రల్ గవర్నమెంట్ నిర్వహించే CRPF, BSF, CISF లాంటి పారామిలటరీ దళాల్లో కానిస్టేబుల్ రిక్రూట్ మెంట్ పరీక్షలను ఇక నుంచి తెలుగుతో పాటుగా 13 ప్రాంతీయ భాషల్లో నిర్వహించనున్నట్లు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదివారం ప్రెస్ నోట్ ను రిలీజ్ చేసింది. ఇది కొన్ని లక్షల మందికి తీపికబురనే చెప్పాలి. ఎందుకంటే? ఇంగ్లీష్ భాషలో పరీక్షలు నిర్వహించడం వల్ల చాలా మందికి ఉద్యోగాలు రావడం లేదు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం పట్ల హర్షం వ్యక్తం అవుతోంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

నిరుద్యోగ అభ్యర్థులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. సెంట్రల్ గవర్నమెంట్ నిర్వహించే CRPF, BSF, CISF లాంటి పారామిలటరీ దళాల్లో కానిస్టేబుల్ రిక్రూట్ మెంట్ పరీక్షలను ఇక నుంచి తెలుగుతో సహా 13 ప్రాంతీయ భాషల్లో నిర్వహించనున్నట్లు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ప్రకటన జారీ చేసింది. ఫిబ్రవరి 20 నుంచి మార్చి 7 వరకు జరిగే ఈ ఎగ్జామ్స్ ను ఫస్ట్ టైమ్ తెలుగుతో పాటుగా మరో 13 ప్రాంతీయ భాషల్లో నిర్వహిస్తున్నారు. దీంతో నిరుద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా.. దేశవ్యాప్తంగా 128 నగరాల్లో కానిస్టేబుల్(జనరల్ డ్యూటీ) ఎగ్జామ్ కు దాదాపు 48 లక్షల మంది హాజరౌతున్నారని MHA ఓ ప్రకటనలో పేర్కొంది.

కాగా.. కేంద్ర సాయుధ పోలీసు దళాల్లో స్థానిక యువత భాగస్వామ్యాన్ని పెంచడానికి, ప్రాంతీయ భాషలను ప్రోత్సహించడానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా అదేశాల మేరకే ఈ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు హోం శాఖ వెల్లడించింది. అస్సామీ, గుజరాతీ, మరాఠీ, బెంగాలీ, మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ, ఒడియా, ఉర్దూ, పంజాబీ, మణిపురి, కోంకణి భాషల్లో ఎగ్జామ్స్ జరగనున్నాయి. వీటితో పాటుగా ఇప్పటికే ఇంగ్లీష్, హిందీ భాషల్లో పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఎంవోయూపై సంతకాలు చేశాయి MHA, SSC విభాగాలు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ చారిత్రాత్మక నిర్ణయంతో.. యువతకు ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటుగా.. దేశ సేవలో పాల్గొనే సువర్ణావకాశం లభిస్తుందని హోం శాఖ పేర్కొంది. మరి కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదికూడా చదవండి: ఆర్మా కొత్త ఫోల్డబుల్ ఈ-స్కూటర్.. బ్యాగులో పెట్టుకుని తీసుకుపోవచ్చు!.. ధర ఎంతంటే?

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి