iDreamPost

శాటిలైట్ పోటీ – హక్కుల కోసం కోట్లే కోట్లు

శాటిలైట్ పోటీ – హక్కుల కోసం కోట్లే కోట్లు

ఇవాళ కెజిఎఫ్ 2 శాటిలైట్ హక్కులను నాలుగు బాషలకు కలిపి జీ ఛానల్ సొంతం చేసుకున్నట్టు అఫీషియల్ గా ప్రకటన ఇచ్చారు. అసలు థియేట్రికల్ రిలీజ్ ఎప్పుడో చెప్పడం లేదు కానీ ఈ న్యూస్ మాకెందుకనుకుంటున్న ఫ్యాన్స్ లేకపోలేదు లెండి. కొన్ని నెలల క్రితం ఇదే తరహాలో రాజమౌళి క్రేజీ మల్టీ స్టారర్ ఆర్ఆర్ఆర్ ని సొంతం చేసుకున్న జీ సంస్థ ఇప్పుడు కెజిఎఫ్ రెండో భాగాన్ని తన ఖాతాలో వేసుకోవడం టీవీ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. ఫస్ట్ పార్ట్ స్టార్ మా దగ్గర ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కళ్ళు అరిగిపోయేలా ఎన్ని సార్లు టెలికాస్ట్ చేశారో లెక్కబెట్టడం కష్టం. ఆ స్థాయిలో రిపీట్లు వేశారు మరి.

సరే దీని సంగతలా ఉంచితే ఆర్ఆర్ఆర్, కెజిఎఫ్ 2 లతో పాటు అజిత్ వలిమై కూడా జీ వద్దే ఉంది. ఈ లెక్కన ఎంత భారీ పెట్టుబడి పెట్టిందో అర్థం చేసుకోవచ్చు. కానీ మూవీ లవర్స్ మాత్రం దీని పట్ల అంత హ్యాపీగా లేరు. ఎందుకంటే అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్ లతో పోలిస్తే జీ 5 యాప్ స్టాండర్డ్ వాటి స్థాయిలో ఉండదు. 4కె రెజల్యూషన్ కూడా ఇప్పటిదాకా ఇవ్వలేదు. మరి ఇకనైనా అప్ గ్రేడ్ చేస్తారా లేక ఇలాంటి విజువల్ గ్రాండియర్స్ ని కూడా రాజీ పడుతూ చూడాలా అని ఫీలవుతున్నారు ఓటిటి ఫ్యాన్స్. అవి స్ట్రీమ్ అయ్యేనాటికి గణనీయమైన మార్పులు వచ్చే అవకాశాలు లేకపోలేదు. అప్పటిదాకా వేచి చూడక తప్పదు

దీన్ని బట్టి చూస్తే శాటిలైట్ హక్కులకు మళ్ళీ రెక్కలు వచ్చినట్టు కనిపిస్తోంది. ఓటిటి లు వచ్చి అతి తక్కువ గ్యాప్ లో ప్రీమియర్లు వేయడం మొదలుపెట్టాక టీవీ ఛానల్స్ లో యాడ్స్ ని భరిస్తూ కొత్త సినిమాలు చూసే అలవాటు కొంత ప్రేక్షకుల్లో తగ్గింది. డిజిటల్ ఎంటర్ టైన్మెంట్ అందుబాటులో లేని మధ్యతరగతి ఆడియన్స్ బేస్ చాలా ఎక్కువగా ఉంది కాబట్టి ఇప్పటికి ఛానల్స్ కి వచ్చిన ముప్పేమీ కాదు కానీ భవిష్యత్తులో జరగడాన్ని కొట్టి పారేయలేం. పైన చెప్పిన సినిమాలకు జీ ఎంత ఆఫర్ చేసిందో బయటికి రాలేదు కానీ కళ్లుచెదిరే ఫిగర్స్ ఉంటాయని మీడియా వర్గాల ఇన్ సైడ్ టాక్

Also Read : ఓటిటి పెడుతున్న చిచ్చు మాములుగా లేదు

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి