iDreamPost

భర్తపై భార్య పైశాచికం.. తిట్టడం, కొట్టడమే కాదూ..

భారతీయ సగటు నారీ మణి ఏమీ కోరుకుంటుంది.. పది కాలాల పాటు పసుపు, కుంకుమలతో, సిరి సంపదలు, సౌభాగ్యంతో జీవించాలని భావిస్తూ ఉంటుంది. ఇదిగో ఈ ఫోటోలో కనిపిస్తున్న మహిళను చూస్తే అలానే అనిపిస్తుంది కదూ.. అయితే..

భారతీయ సగటు నారీ మణి ఏమీ కోరుకుంటుంది.. పది కాలాల పాటు పసుపు, కుంకుమలతో, సిరి సంపదలు, సౌభాగ్యంతో జీవించాలని భావిస్తూ ఉంటుంది. ఇదిగో ఈ ఫోటోలో కనిపిస్తున్న మహిళను చూస్తే అలానే అనిపిస్తుంది కదూ.. అయితే..

భర్తపై భార్య పైశాచికం.. తిట్టడం,  కొట్టడమే కాదూ..

భార్యను హింస పెడుతున్న భర్తలు ఉన్నట్లే.. పతిని చిత్రవధకు గురి చేసే భార్యలు ఉన్నారు. కానీ సమాజం.. భర్త బాధను అర్థం చేసుకోదు. నీకేంట్రా మగాడివి.. నువ్వు బాధపడకూడదంటూ కబుర్లు చెబుతుంటారు. మగవాళ్లు ఏడ్చితే లోకం కూడా ఒప్పుకోదు కాబట్టే.. కిమ్మనకుండా కష్టాలను కడుపులో దాచుకుని గయ్యాళి భార్యలతో సంసారం నెట్టుకు వస్తున్న భర్తలు ఉన్నారు ఈ లోకంలో. కట్టుకున్న ఇల్లాలు కష్టపెడుతున్నా.. దాడి చేస్తున్నా.. బాధపడటం తప్ప ఏమీ చేయలేకపోతున్నారు. చివరకు ప్రాణాల మీదకు కూడా తెచ్చుకుంటున్నారు. ఈ రోజుల్లో భార్యా బాధితుల సంఖ్య నానాటికి పెరిగిపోతుంది. ఇదిగో ఆ జాబితాలోకి ఇతడు కూడా చేరిపోయాడు.

ఈ ఫోటోలో అమాయకంగా, నిండైన కట్టుబొట్టుతో.. భర్తకు తగ్గ భార్యగా కనిపిస్తోన్న మహిళను చూశారు కదా.. పసుపు, కుంకుమలు ముఖ్యం అనుకునే సగటు భారతీయ నారీమణిలా కనిపిస్తుంది. కానీ భర్తను గ్యాస్ సిలిండర్‌తో తలపై కొట్టి చంపేసింది. వింటేనే ఒళ్లు గగొర్పుడుస్తున్న ఈ ఘటన పశ్చిమ బెంగాల్‌లోని తూర్పు బూర్వాన్‌లో వెలుగు చూసింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని అతడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. భార్యను అరెస్టు చేశారు పోలీసులు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని గల్సి 2 బ్లాక్‌లోని భుండి గ్రామ పంచాయతీలోని కలిమోహన్ పూర్ గ్రామంలో నివసిస్తోంది సంతోష్ కుమార్ మజుందార్ అలియాస్ సునీల్ కుటుంబం.

ప్రస్తుతం సంతోష్ వయస్సు 62 సంవత్సరాలు. ఆయన ఐసిడిఎస్ ఉద్యోగి. అయితే భార్యా భర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. అయితే ఇటీవల ఏదో విషయంపై తగాదా మొదలైంది. కోపంతో ఊగిపోయిన భార్య సిలిండర్ తీసుకుని భర్త తలపై కొట్టడంతో.. అక్కడిక్కడే మృతి చెందాడు. కాగా, మృతురాలి కుమార్తె షర్మిలా బిస్వాస్ చెప్పిన వివరాల ప్రకారం.. తన తల్లికి తండ్రి అంటే అస్సలు ఇష్టం లేదని, ఆమె తన తండ్రిని హింసించేదని, అతడిని చాలా సార్లు కొట్టిందని వెల్లడించింది. వారిద్దరికీ ఎప్పుడూ గొడవలు జరిగేవని స్థానికులు చెబుతున్నారు. సోమవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో దుకాణం బయట సంతోష్ మృతదేహాన్ని చూసిన స్థానికులు.. పోలీసులకు సమాచారం అందించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి