iDreamPost

భార్యతో గొడవ.. అత్తను హత్య చేసి పరార్.. 28 ఏళ్ల తర్వాత

మూడు దశాబ్దాల క్రితం ఓ హత్య చేసి పరారయ్యాడో వ్యక్తి. రాష్ట్రాలు దాటి పోలీసులకు చిక్కకుండా బతుకుతున్నాడు. అతడి కోసం పోలీసులు వెతికి వెతికి వేసారిపోయారు. ఈ కేసు అనేక మంది పోలీసుల టేకప్ చేసి.. నిందితుడ్ని కనుక్కోలేకపోయారు.. కానీ

మూడు దశాబ్దాల క్రితం ఓ హత్య చేసి పరారయ్యాడో వ్యక్తి. రాష్ట్రాలు దాటి పోలీసులకు చిక్కకుండా బతుకుతున్నాడు. అతడి కోసం పోలీసులు వెతికి వెతికి వేసారిపోయారు. ఈ కేసు అనేక మంది పోలీసుల టేకప్ చేసి.. నిందితుడ్ని కనుక్కోలేకపోయారు.. కానీ

భార్యతో గొడవ.. అత్తను హత్య చేసి పరార్.. 28 ఏళ్ల తర్వాత

నేరాలు చేసి చట్టం నుండి ఆ క్షణం తప్పించుకోవచ్చు కానీ.. సంవత్సరాల తర్వాత అయినా నిర్దారణ అయితే శిక్ష అనుభవించక తప్పదు. కొన్నాళ్ల తర్వాత తమను పోలీసులు మర్చిపోయారని.. కోర్టులు, చట్టాలు ఏమార్చవచ్చునని భ్రమిస్తుంటారు నేరస్థులు. రక్షక భటులు కేసుకు సంబంధించిన తీగ తగలాలే కానీ డొంక మొత్తం కదిలించేస్తారు. రాష్ట్రాలు, దేశాలు దాటినా వారిని పట్టుకుని.. కోర్టు ముంగిట కూర్చొబెడతారు. అందుకు ఉదాహరణ ఈ కేసే. దాదాపు మూడు దశాబ్దాల క్రితం ఓ హత్య చేసి.. రాష్ట్రాలు దాటాడో వ్యక్తి. సంవత్సరాలు గడిచిపోయాయి. ఇక తన హత్య కేసు గురించి ఎవరూ పట్టించుకుంటారులే అనుకున్న తరుణంలో రంగ ప్రవేశం చేసిన పోలీసులు ‘యు ఆర్ అండర్ అరెస్ట్’ అనడంతో బిత్తరపోయాడు నిందితుడు.

వివరాల్లోకి వెళితే.. ఒడిశాలోని గంజాం జిల్లా బెరంపూర్‌కు చెందిన వి హరి హర పట్టా జోషి.. 1993లో తమిళనాడులోని చెన్నైలోని ఓ కంపెనీలో పనిచేశాడు. 1994లో ఇందిర అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అయితే వీరి సంసారం మూడుణాళ్ల ముచ్చటగా మిగిలింది. పెళ్లైన నాటి నుండి గొడవలు పడుతుండటంతో ఇందిర భర్తను వదిలి.. పుట్టింటికి వెళ్లిపోయింది. అనంతరం విడాకుల కోసం అప్లై చేసింది. దీన్ని తట్టుకోలేని జోషి.. ఇందిరపై కక్ష పెంచుకున్నాడు. 1995లో భార్య ఇందిర, ఆమె సోదరుడు కార్తీక్, అత్త రమాలపై కత్తితో దాడి చేసి.. పరారయ్యాడు. ఈ దాడిలో ఇందిర, కార్తీక్ ప్రాణాలతో బయటపడగా.. గాయాలతో అత్త రమా చనిపోయింది.

ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. పలు మార్లు జోషి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. 1996-2006 మధ్యలో అనేక సార్లు అతడి స్వస్థలమైన గంజాంలో అతడి కోసం వెతికారు. కానీ ఆచూకీ కానరాలేదు. ఎంతో మంది పోలీసులు ట్రాన్స్ ఫర్ అయి వెళ్లిపోయారు. మరి కొంత మంది రిటైర్ మెంట్ కూడా అయ్యారు. కానీ ఈ కేసును ఛాలెంజ్‌గా తీసుకున్న పోలీసులు.. ఇటీవల అడంబక్కం సబ్ ఇన్ స్పెక్టర్ కన్నన్ ఆధ్వర్యంలో నలుగురు సభ్యుల ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. జోషి 22 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు తీసిన నలుపు, తెలుపు ఫోటోతో ఒడిశాకు వెళ్లి అతడి కోసం గాలింపు ప్రారంభించారు. రెండు వారాల పాటు శ్రమించిన పోలీసులకు హత్య జరిగిన 28 ఏళ్ల తర్వాత జోషి పట్టుబడ్డాడు. స్థానికుల సహకారంతో అతడిని అరెస్టు చేశారు. చెన్నైలో అత్తను హత్య చేసిన తర్వాత.. బెరంపూర్ వచ్చి ఓ మహిళతో సహజీవనం చేస్తున్నాడని పోలీసులు తెలిపారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి