iDreamPost

కోతుల విషయంలో అత్తా, కోడళ్ల మధ్య గొడవ.. ఆ కోపంలో

టామ్ అండ్ జెర్రీ రిలేషన్ అంటే.. అత్తా, కోడళ్లదే. ప్రతి విషయంలోనూ కోడలితో గొడవకు దిగుతుంటారు అత్త. అలాగే అత్తపై కయ్యానికి కాలు దువ్వుతూ ఉంటుంది కోడలు.

టామ్ అండ్ జెర్రీ రిలేషన్ అంటే.. అత్తా, కోడళ్లదే. ప్రతి విషయంలోనూ కోడలితో గొడవకు దిగుతుంటారు అత్త. అలాగే అత్తపై కయ్యానికి కాలు దువ్వుతూ ఉంటుంది కోడలు.

కోతుల విషయంలో అత్తా, కోడళ్ల మధ్య గొడవ.. ఆ కోపంలో

ఇండియన్ ఫ్యామిలీ విలన్స్ అంటే.. అత్తా, కోడళ్లే.. పెళ్లైంది మొదలు వీరిద్దరికి పొసగడం లేదు. చిన్న విషయంలో కూడా పడదు. అత్త ఏదైనా చెబితే.. కోడలికి గిట్టడు. అలాగే కోడలు ఏదైనా విన్నవిస్తే.. అత్త సహించలేదు. దీంతో వీరిద్దరి మధ్య..మాట మాట పెరిగి అత్తా, కోడళ్ల మధ్య వివాదం చెలరేగుతోంది. టామ్ అండ్ జెర్రీలా నిత్యం గొడవలు ఉంటాయి. ఇవే వేరు కాపురాలకు దారి తీస్తుంటాయి. వీరి మధ్య నలిగిపోతుంటారు ఇంట్లో మగవాళ్లు. ఒక్కోసారి అత్తా, కోడళ్ల మధ్య కయ్యాలు దారుణాలకు కూడా దారి తీస్తున్నాయి. గతంలో ఎక్కువగా కోడలి చేతిలో హింసకు గురైన అత్తలే ఉండేవారు. దీంతో అత్త అనగానే గయ్యాళీ అన్న ముద్ర పడింది. కానీ కోడళ్లు కూడా తక్కువ తినలేదని నిరూపిస్తున్నారు. అందుకు మరో ఉదాహరణ ఈ ఘటన.

అత్తపై కోపంతో పలుమార్లు దాడి చేయడమే కాదూ.. ఏకంగా ఈ సారి హత్యే చేసింది. అనకాపల్లిలోని కొత్తూరు పంచాయతీ దేవీనగర్‌లో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలవరపాటుకు గురి చేసింది. వివరాల్లోకి వెళితే.. ఈగల సింహాద్రమ్మ, సన్యాసిరావుకు కుమారుడు, ముగ్గురు కుమార్తెలున్నారు. కుమారుడు గణేష్.. తుమ్మపాలకు చెందిన పూర్ణను ప్రేమించి.. 2007లో వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు. అత్తా, కోడళ్లు పక్క పక్క ఇంట్లోనే నివసించే వారు. పెళ్లైన నాటి నుండి తరచూగా వీరిద్దరి మధ్య గొడవలు జరుగుతుండేవి. ఏడాది క్రితం కోడలు పూర్ణ.. అత్త సింహాద్రమ్మపై దాడి చేయగా.. ఆమెకు గాయాలయ్యాయి. అయితే కుటుంబ సభ్యులు సర్థి చెప్పారు. మళ్లీ అత్త సూటీ పోటీ మాటలు అంటుంటే.. భరించలేక.. ఇటీవల దిశ పోలీస్ స్టేషన్‌లో అత్తా, మామలపై వరకట్న కేసు పెట్టింది.

సోమవారం ఉదయం ఇంట్లోకి కోతులు వచ్చిన విషయంపై అత్తా కోడళ్ల మధ్య వివాదం నెలకొంది. ఈ విషయంపై కోడలు పూర్ణతో గొడవపడింది. అంతలో ఆవేశంలో ఉన్న పూర్ణ ‘నువ్వ పోతేగానీ మాకు మన:శాంతి ఉండదు’ అంటూ సన్నికాలు రాయితో అత్త తల,మొహంపై కొట్టింది. రక్తం చిందగానే.. పూర్ణ భయంతో కేకలు వేసుకుంటూ బయటకు పరుగులు తీసింది. రక్తపు మడుగుల్లో పడి ఉన్న సింహాద్రమ్మను చికిత్స నిమిత్తం అనకాపల్లిలో జిల్లా ఆసుపత్రికి తరలించారు. కానీ ఆమె అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. మామ సన్యాసిరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కోడలు పూర్ణపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. కోడలు పూర్ణ పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి