iDreamPost

హార్ధిక్‌ పాండ్యాకి పెరుగుతున్న మద్దతు! ఇంత బాధని ఎలా భరించావ్ అంటూ పోస్ట్స్!

  • Published May 27, 2024 | 3:08 PMUpdated May 27, 2024 | 3:08 PM

Hardik Pandya, Natasa, Divorce: టీమిండియా స్టార్‌ క్రికెటర్‌ హర్ధిక్‌ పాండ్యా ఐపీఎల్‌ 2024 సందర్భంగా ఎంత భయంకరమైన ట్రోలింగ్‌ గురయ్యాడో తెలిసిందే. కానీ, ఇప్పుడు సీన్‌ మారిపోయింది. పాండ్యాకు ఊహించని మద్దతు లభిస్తోంది. అది ఎందుకో ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

Hardik Pandya, Natasa, Divorce: టీమిండియా స్టార్‌ క్రికెటర్‌ హర్ధిక్‌ పాండ్యా ఐపీఎల్‌ 2024 సందర్భంగా ఎంత భయంకరమైన ట్రోలింగ్‌ గురయ్యాడో తెలిసిందే. కానీ, ఇప్పుడు సీన్‌ మారిపోయింది. పాండ్యాకు ఊహించని మద్దతు లభిస్తోంది. అది ఎందుకో ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

  • Published May 27, 2024 | 3:08 PMUpdated May 27, 2024 | 3:08 PM
హార్ధిక్‌ పాండ్యాకి పెరుగుతున్న మద్దతు! ఇంత బాధని ఎలా భరించావ్ అంటూ పోస్ట్స్!

ఐపీఎల్‌ 2024 సీజన్‌ ఆసాంతం అత్యంత దారుణంగా ట్రోలింగ్‌ గురైన క్రికెటర్‌ ఎవరంటే అంతా హార్ధిక్‌ పాండ్యా పేరు చెబుతారు. నిజానికి టోర్నీ ఆరంభానికంటే ముందు నుంచే పాండ్యా ట్రోలింగ్‌కు గురి అయ్యాడు. ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మను తప్పించి, అతని స్థానంలో పాండ్యాను ప్రకటించినప్పటి నుంచి పాండ్యాపై సోషల్‌ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్‌ జరిగింది. పైగా ఈ సీజన్‌లో ముంబై ఇండియన్స్‌ అత్యంత దారుణంగా చెత్త ప్రదర్శన కనబర్చడంతో ఆ ట్రోల్స్‌ మరింత ఎక్కువ అయ్యాయి. అయితే.. గత కొన్ని రోజులుగా హార్ధిక్‌ పాండ్యా వ్యక్తిగత జీవితం గురించి షాకింగ్‌ విషయాలు ప్రచారంలో ఉన్నాయి. తన భార్య నటాషాతో విడాకులు తీసుకుని పాండ్యా విడిపోతున్నాడని, దాని కోసం తన కష్టార్జితం నుంచి 70 శాతం ఆస్తిని ఆమెకు ట్రాన్స్‌ఫర్‌ చేశాడని కూడా వార్తలు వచ్చాయి.

ఈ రూమర్స్‌ వస్తున్న క్రమంలోనే హార్ధిక్‌ పాండ్యా భార్య నటాషా ఇటీవల తన ఫ్రెండ్‌ అలెగ్జాండర్‌తో కలిసి బయటికి లంచ్‌ చేయడానికి వచ్చింది. ఆ సమయంలో మీడియా వాళ్లు విడాకుల గురించి ఆమెను ప్రశ్నించగా.. ఎలాంటి సమాధానం ఇవ్వకుండా.. వారి ప్రశ్నను ఖండించకుండా అక్కడి నుంచి వెళ్లిపోయింది. దాంతో.. పాండ్యాతో విభేదాలు, త్వరలో విడాకుల వార్తలు నిజమే అయి ఉంటాయని అంతా ఫిక్స్‌ అయిపోయారు. అయితే.. హార్ధిక్‌ పాండ్యా-నటాషా మధ్య విభేదాలు రావడానికి వివాహేతర సంబంధం అని కూడా వార్తలు వస్తున్నాయి. హార్ధిక్‌కు తెలియకుండా నటాషా తన స్నేహితుడు అలెగ్జాండర్ అలెక్స్ ఇలిక్‌తో సీక్రెట్ ఎఫైర్ నడిపిస్తున్నట్లు సమాచారం. బాలీవుడ్ గాసిప్స్ చెప్పే ఉమైర్ సంధూ సైతం ఇదే విషయాన్ని పేర్కొన్నాడు. దుబాయ్‌లో ఓ హోటల్లో నటాషా.. మరో వ్యక్తితో హార్దిక్ పాండ్యాకు రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిందని అతను తెలిపాడు. సెర్బియా వంటి పేద దేశం నుంచి వచ్చిన నటాషాకు డ్రగ్స్‌ తీసుకోవడంతో పాటు వివాహేతర సంబంధాలు పెట్టుకోవడం అలువాటని అన్నాడు.

ఇలాంటి పనుల వల్లే ఆమెను హార్ధిక్‌ పాండ్యా వదిలేస్తున్నాడని తెలుస్తోంది. అయితే.. ఇంతకాలం ఈ బాధను తన మనసులో దాచుకున్న హార్ధిక్‌ పాండ్యా ఎంత నరకం అనుభవించాడో అంటూ ఇన్ని రోజులు అతన్ని ట్రోల్‌ చేసిన వాళ్లే ఇప్పుడు బాధపడుతున్నారు. మనసులో ఇంత బాధ పెట్టుకుని, అనవసరంగా ట్రోల్‌కి గురవుతున్నా.. ముఖంగా నవ్వును మాత్రం చెరిగిపోన్విలేదు.. నువ్వు గొప్పొడివి పాండ్యా అంటూ అతనికి పూర్తి మద్దతు తెలుపుతున్నారు. వ్యక్తిగత జీవితంలో, వివాహ బంధంలో ఎవరికి రాకూడని సమస్య వచ్చినా.. ఆట కోసం ఎంతటి బాధనైనా భరించిన పాండ్యాకు క్రికెట్‌ అభిమానులు హ్యాట్సాఫ్‌ చెబుతున్నారు. పాండ్యాకు లభిస్తున్న మద్దతు చూసి.. ఇది కడా ఇండియన్స్‌ అభిమానం అంటున్నారు నెటిజన్లు. రాబోయే టీ20 వరల్డ్‌ కప్‌ 2024లో పాండ్యా అద్భుతంగా రాణించాలని కోరుకుంటున్నారు. మరి వ్యక్తిగత జీవితంలో వచ్చిన ఒడిదుడుకుల్లో పాండ్యాకు లభిస్తున్న మద్దుతుపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి