iDreamPost

‘యానిమల్’ OTT రిలీజ్ కు కొత్త చిక్కులు.. సమన్లు జారీ చేసిన కోర్టు!

animal OTT release: నెట్ ఫ్లిక్స్ లో ఈ నెల 26న యానిమల్ మూవీని స్ట్రీమింగ్ చేద్దామని మేకర్స్ ప్లాన్ చేశారు. కానీ ఇప్పుడు కొత్త చిక్కులు వచ్చి పడ్డాయి. కోర్టు నెట్ ఫ్లిక్స్ తో పాటు చిత్ర నిర్మాణ సంస్థలకు సమన్లు జారీ చేసింది.

animal OTT release: నెట్ ఫ్లిక్స్ లో ఈ నెల 26న యానిమల్ మూవీని స్ట్రీమింగ్ చేద్దామని మేకర్స్ ప్లాన్ చేశారు. కానీ ఇప్పుడు కొత్త చిక్కులు వచ్చి పడ్డాయి. కోర్టు నెట్ ఫ్లిక్స్ తో పాటు చిత్ర నిర్మాణ సంస్థలకు సమన్లు జారీ చేసింది.

‘యానిమల్’ OTT రిలీజ్ కు కొత్త చిక్కులు.. సమన్లు జారీ చేసిన కోర్టు!

‘యానిమల్’ బాలీవుడ్ హీరో రణ్ బీర్ కపూర్-రష్మిక మందన్న జంటగా నటించిన చిత్రం. డిసెంబర్ 1న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ. 900 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టినట్లు సమాచారం. సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తన మార్క్ డైరెక్షన్ తో మరోసారి థియేటర్లను షేక్ చేశాడు. ఇక ఈ మూవీ ఓటీటీలోకి ఎప్పుడెప్పుడు వస్తుందా అని సినీ లవర్స్ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అయితే గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన నెట్ ఫ్లిక్స్ లో ఈ నెల 26న స్ట్రీమింగ్ చేద్దామని మేకర్స్ ప్లాన్ చేశారు. కానీ ఇప్పుడు యానిమల్ కు కొత్త చిక్కులు వచ్చి పడ్డాయి. కోర్టు నెట్ ఫ్లిక్స్ తో పాటు చిత్ర నిర్మాణ సంస్థలకు సమన్లు జారీ చేసింది.

యానిమల్ ఓటీటీ రిలీజ్ కోసం మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ మూవీని రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26న నెట్ ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ చేయడానికి సిద్దమైంది చిత్ర యూనిట్. కానీ అనూహ్యంగా ఓటీటీ రిలీజ్ కు కొత్త చిక్కులు వచ్చాయి. యానిమల్ చిత్రాన్ని టి-సిరీస్, భద్రకాళి పిక్చర్స్ తో పాటుగా సినీ వన్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించాయి. కాగా.. ఈ మూవీ ఓటీటీ రిలీజ్ ను నిలిపివేయాలని ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది నిర్మాణ సంస్థల్లో ఒకటైన సినీ వన్ స్టూడియోస్. దానికి కారణం ఏంటంటే?

New implications for OTT release

యానిమల్ శాటిలైట్ హక్కుల విషయంలో క్లూవర్ మ్యాక్స్ ఎంటర్ టైన్ మెంట్ సంస్థతో పాటు సూపర్ క్యాసెట్స్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలతో ఒప్పందం జరిగిందని, అయితే ఇప్పటి వరకు వారి నుంచి ఒక్క పైసా కూడా తమకు చెందలేదన్నది సినీ వన్ స్టూడియోస్ ప్రధాన ఆరోపణ. ఇదే విషయంపై కోర్టులో కేసు వేసింది సదరు నిర్మాణ సంస్థ. దీంతో నిర్మాణ సంస్థతో పాటుగా నెట్ ఫ్లిక్స్ కు సమన్లు జారీ చేసింది కోర్టు. ఇక ఈ విషయంపై నేడు(జనవరి 20)న వివరణ ఇవ్వాల్సిందిగా కోర్టు సదరు సంస్థలను కోరింది. జనవరి 22న ఈ వివాదంపై విచారణ జరగనుంది. కాక.. ముందుగా అనుకున్న స్ట్రీమింగ్ డేట్ దగ్గరపడుతుండటం.. కోర్టు సమన్లు జారీ చేయడంతో.. యానిమల్ ఓటీటీ రిలీజ్ పై సందిగ్ధత ఏర్పడింది. చూడాలి మరి ఈ వివాదం ఎప్పుడు సద్దుమనుగుతుందో? యానిమల్ ఓటీటీ రిలీజ్ ఎప్పుడు అవుతుందో.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి