iDreamPost

చంద్రబాబు అవినీతి, అక్రమాలపై విచారణ జరగాల్సిందే

చంద్రబాబు అవినీతి, అక్రమాలపై విచారణ జరగాల్సిందే

కేంద్ర ఆర్ధికశాఖ మంత్రి నిర్మల సీతారామన్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఏపి బిజెపి శాఖ ఏర్పాటు చేసిన జనసంవాద్ ర్యాలీని ఉద్దేశించి నిర్మల వీడియో కాన్ఫరెన్సు ద్వారా మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎవరైనా అధికారంలోకి వస్తే తాము ఏమి చేస్తామనే విషయంలో ప్రజలకు ఎన్నో హామీలిస్తారని చెప్పారు. వారు వేసే ఓట్ల ఆధారంగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని గుర్తుచేశారు. అవినీతి, అక్రమాల విషయంలో గత ప్రభుత్వం చర్యలపై దర్యాప్తు చేస్తామని హామీ ఇచ్చినపుడు ఆపని చేయాల్సిందే అంటూ నిర్మల బల్లగుద్ది చెప్పారు.

అయితే ఇదే విషయంలో ఏపి బిజెపి శాఖ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణతో పాటు మరికొందరు నేతల వాదనలు భిన్నంగా ఉంటున్నాయి. ఎందుకంటే చంద్రబాబునాయుడు హయాంలో జరిగిన అవినీతి, అక్రమాలపై జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విచారణలు చేయిస్తోంది. కొన్ని ఘటనలపై చర్యలకు కూడా దిగింది. ఇఎస్ఐ కుంభకోణంలో మాజీమంత్రి అచ్చెన్నాయుడు అరెస్టు, రవాణాశాఖను మోసం చేసిన వ్యవహారాల్లో సాక్ష్యాధారాలతో సహా దొరికిన జేసి ప్రభాకర్ రెడ్డి అరెస్టయిన విషయం తెలిసిందే.

ఎన్నికల సమయంలో జగన్ ప్రజలకు ఇచ్చిన హామీని అమలు చేసే దిశగా చర్యలు తీసుకుంటుంటే కన్నా అండ్ కో మాత్రం కక్షసాధింపు చర్యలంటూ నానా గోల చేస్తున్న విషయం అందరు చూస్తున్నదే. ఒకవైపు కేంద్రమంత్రి నిర్మల ఏమో అవినీతి, అక్రమాలపై విచారణలు జరిపించి చర్యలు తీసుకోవాల్సిందే అని చెబుతుంటే ఆమె మాటలకు విరుద్ధంగా కన్నా తదితరులు యాగీ చేస్తున్నారు. మరి వీళ్ళ గోల విషయంలో నిర్మల ఏమని సమాధానం చెబుతారో.

వీళ్ళ గోల ఒకలాగుంటే వీళ్ళ పార్టనర్ జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా కన్నా తదితరులకు మద్దతుగానే మాట్లాడుతున్నాడు. గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి, అక్రమాలపై వైసిపి ప్రభుత్వం ఎటువంటి విచారణలు చేయించకూడదని, చర్యలు తీసుకోకూడదన్నట్లే మాట్లాడుతున్నాడు. జగన్ చర్యల విషయంలో కేంద్రమంత్రి చెప్పిన మాటలకు, రాష్ట్రంలోని బిజెపిలోని కొందరు నేతలు+పవన్ గోల మాత్రం పూర్తి విరుద్ధంగా ఉంటోంది. ఇంతకీ చంద్రబాబు హయాంలో జరిగిన అవినీతి, అక్రమాలపై విచారణ చేయించాల్సిందే అని నిర్మల ఇంత హఠాత్తుగా ఎందుకు చెప్పిందబ్బా ?

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి