iDreamPost

చంద్రబాబు కన్నా పవన్ మిన్న …

చంద్రబాబు కన్నా పవన్ మిన్న …

బాబు ఇచ్చింది పది లక్షలు. . .పవన్ ఇచ్చింది 50 లక్షలు..

ఆపత్కాలంలోనే ఆపన్నుల గుణం తెలుస్తుంది…కరోనా మహమ్మారి ప్రపంచాన్ని కుదిపేస్తున్న ఈ తరుణంలో ఎవరు ఎలా స్పందిస్తున్నారన్నది లోకం యావత్తూ చూస్తుంది. ఇలాంటి రోజుల్లోనే ఎవరు పరమ పిసినారులో, ఎవరిది విశాల మనస్తత్వమో అవగతమవుతుంది.తాను ఈ కష్టకాలములో హైదరాబాద్ లో ఇరుక్కున్నానని కానీ తన మనసంతా ఆంధ్రప్రదేశ్, అమరావతిలోనే ఉందని సన్నాయినొక్కులు నొక్కే చంద్రబాబు తన నిజరూపం మాత్రం ఎలాంటిదో చెప్పకనే చెప్పారు. పదిహేనేళ్ళ పాటు ముఖ్యమంత్రి గా నలభయ్యేళ్లపాటు రాజకీయాల్లో ఉన్నచంద్రబాబు నాయుడు ఈ కష్ట కాలంలో ముఖ్యమంత్రి సహాయనిధికి ఇచ్చిన విరాళం రూ. పది లక్షలు.చిన్నచిన్న వ్యాపారులు ,నాయకులే ఐదారు లక్షలతోబాటు పలు వస్తువులు, కూరగాయలుబియ్యం వంటివి విరాళంగా ఇస్తూ ప్రజలకు,ప్రభుత్వానికి అండగా ఉంటున్న తరుణంలో చంద్రబాబు ఇచ్చిన పదిలక్షలుచూసి జనం ముక్కున వేలేసుకుంటున్నారు. నలభయ్యేళ్ళపాటు ఆయన్ను మోసిన ప్రజానీకానికి సొంతంగా ఆయన ఇస్తున్నది పది లక్షలేనా అని ప్రశ్నిస్తున్నారు. ఇదిలా ఉండగా టిడిపి నాయకులు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఒక నెల జీతాన్నివిరాళంగా ప్రభుత్వానికి ఇచ్చారు.

ఇవన్నీ ఒకెత్తు అయితే చంద్రబాబు చేతిలో మనిషి, చెప్పినట్లు ఆడతాడు అని అందరూ ఎగతాళి చేసే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాత్రం ఈ విరాళం విషయంలో ఉదారంగా వ్యవహరించారు. ప్రధానమంత్రి సహాయనిధికి ఒక కోటి ఇస్తూనే ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలకు రూ.50 లక్షలు చొప్పున విరాళం ప్రకటించడమే కాకుండా శుక్రవారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి 50 లక్షలు బ్యాంక్ నుంచి బదిలీ చేసేసారు. ఇప్పటివరకు ఎలాంటి రాజకీయ పదవులుచేపట్టకున్నా పవక్ కళ్యాణ్ కు ఉన్నంత ఔదార్యం చంద్రబాబుకు లేకపోవడం దారుణమని టిడిపి అభిమానులు, కార్యకర్తలు అనుకుంటున్నారు. ఇదిలా ఉండగా శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు రూ.70లక్షలు, విజయవాడ ఎంపీ కేశినేని నాని రూ.5 కోట్లను ఆయా జిల్లాల కలెక్టర్లకు తమ ఎంపిల్యాడ్స్ నిధుల నుంచి ఇస్తామని ప్రకటించారు. సమాజం నుంచి తీసుకోవడమే తప్ప తిరిగి ఇచ్చేబుద్ధి చంద్రబాబుకు లేదని మరోమారు ప్రజలకు అర్థం అయింది అన్నమాట

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి