iDreamPost

ఉప్పల్ హెరిటేజ్ సిబ్బందికి కరోనా ??

ఉప్పల్ హెరిటేజ్ సిబ్బందికి కరోనా ??

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం కరోనా కట్టడి విషయంలో సరైన విధానం పాటించడంలేదని, ఆదే మా చంద్రబాబు అయితే కరోనాని కట్టడి చేసేవారని విపరీతమైన ప్రచారం చేస్తున్న తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు షాక్ కి గురయ్యే వార్త ఒకటి వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్ లోని బాబు గారి కుటుంబ సంస్థ అయిన ఉప్పల్ హెరిటేజ్ ప్లాంట్ లో కరోనా కలకలం రేగింది. ప్లాంట్ లో పని చేస్తున్న సెక్యురిటి గార్డ్ తో పాటు వారి తల్లి తండ్రులకి కూడా కరోనా సోకినట్టు తెలుస్తుంది. కరోనా సోకిన సెక్యురిటి గార్డుతో పాటు మరో 7గురిని హోం క్వారంటైన్ స్టాంపు వేసి పర్యవేక్షణలో ఉంచినట్టు తెలుస్తుంది. తమ సిబ్బందికి కరోనా పాజిటివ్ వచ్చినా ఏ మాత్రం లెక్కచేయకుండా ఆ విషయం గోప్యంగా ఉంచుతూ, హెరిటేజ్ యాజమాన్యం ప్లాంట్ నడుపుతు ప్రభుత్వ అధికారులకు చెప్పవద్దంటు సిబ్బందికి ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తుంది.

ఒక పక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం దేశంలోనే అత్యధికంగా టెస్టులు చేస్తు కరోనా ని కట్టడి చేస్తుంటే, తెలుగుదేశం నేతలు కార్యకర్తలు పని గట్టుకుని మరీ జగన్ ప్రభుత్వం విఫలం అయిందని అదే చంద్రబాబు అయితే కరోనాని కట్టడి చేసేవాళ్ళని ఒక పక్క విపరీతమైన ప్రచారం అనుకున్న వాళ్ళకి ఇది మింగుడుపడని విషయం. సొంత సంస్థలో కరోనాని కట్టడి చేయలేని వ్యక్తి ఓక రాష్ట్రాన్ని కరోనా నుండి ఎలా రక్షిస్తారు అని రేపటి రోజున వీరికే ప్రశ్నలు ఎదురవుతాయి. ఏది ఏమైనా రాజకీయల్లో పాలనలో తనకు ఎంతో అనుభవం ఉందని చెప్పుకునే తెలుగుదేశం నేత చంద్రబాబు తన కుటుంబ సంస్థ హెరిటేజ్ లో కరోనా సోకకుండా సరైన జాగ్రత్తలు పాటించలేదని ఈ ఉదంతంతో స్పష్టం అవుతుంది.
కరోనా పట్ల ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం చంద్రబాబు లాంటి వ్యక్తులకే చెల్లింది, ప్రజలందరు ప్రాణాలు కోసం పోరాడుతుంటే బాబు గారు తన వ్యాపారం కోసం పాకులాడటం శోచనీయం, ప్రజలకు కాకపోయినా కనీసం తెలుగుదేశం కార్యకర్తలకైన ఇటువంటి విపత్కర సమయంలో ఎలాంటి సందేశం ఇస్తున్నారో బాబు గారు పునరాలోచించుకోవాలి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి