iDreamPost

దేశంలో 20 వేలకు చేరువలో కరోనా పాజిటివ్ కేసులు

దేశంలో 20 వేలకు చేరువలో కరోనా పాజిటివ్ కేసులు

కరోనా పాజిటివ్ కేసులు దేశవ్యాప్తంగా క్రమక్రమంగా పెరుగుతున్నాయి. ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా 19,984 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవగా 640 మంది ప్రాణాలు కోల్పోగా, కరోనా వైరస్ బారినుండి 3870 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. 

అత్యధిక మరణాలు, అత్యధిక పాజిటివ్ కేసులు మహారాష్ట్రలో నమోదవుతున్నాయి.ఇప్పటికే మహారాష్ట్రలో 5218 మందికి కరోనా సోకినట్లు నిర్దారణ కాగా 251 మంది మృత్యువాత పడ్డారు.

తెలుగురాష్ట్రాల విషయానికి వస్తే తెలంగాణలో 928 పాజిటివ్ కేసులు నమోదవగా, 23 మంది మృతిచెందారు.గడచిన 24 గంటల్లో 56 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 194 మంది వైరస్ బారినుండి కోలుకున్నారు. ఆంధ్రప్రదేశ్ లో గడిచిన 24 గంటల్లో జరిగిన కొవిడ్‌-19 పరీక్షల్లో 56 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు వైద్యారోగ్యశాఖ అధికారులు తెలిపారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 813కి చేరింది .కాగా 22 మంది మృతిచెందారు. 96 మంది వైరస్ బారినుండి కోలుకున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి