iDreamPost

దేశంలో పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య…..

దేశంలో పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య…..

దేశంలో కరోనా వైరస్ మరణాల సంఖ్య ఆరుకు చేరింది.తాజాగా బీహార్‌ రాజధాని పాట్నాలో కిడ్నీ ఫెయిలై బాధ పడుతున్న 38 ఏళ్ల వ్యక్తి కరోనా వైరస్ సోకడంతో చనిపోయినట్లు ప్రకటించారు.కోల్‌కతా నుంచీ రెండ్రోజులు కిందటే పాట్నా వచ్చిన అతను ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయినట్లు డాక్టర్లు తెలిపారు.ముంబైకి చెందిన 63 ఏళ్ల ఒక వృద్ధుడు కోవిడ్-19 వైరస్ వల్ల మృతి చెందాడు. కరోనా వైరస్ సోకిన వృద్ధుడు మార్చి 19న ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతూ మార్చి 21న రాత్రి 11.03 గంటలకు మరణించినట్లు ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారికంగా ప్రకటించింది. మృతుడు డయాబెటిస్,హైబీపీ వ్యాధులతో పాటు గుండె సంబంధిత ఇస్కెమిక్ వ్యాధి బాధపడుతున్న పేషెంట్ అని తెలిపింది.

ఈరోజు ఉదయం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు దేశంలోని ప్రజలంతా మొత్తం జనతా కర్ఫ్యూలో పాల్గొంటున్నారు.అయితే ఆరోగ్యశాఖ తాజా లెక్కల ప్రకారం కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతూ 336కి చేరింది.

మహారాష్ట్రలో 74 కోవిడ్-19 పాజిటివ్ కేసులతో మొదటి స్థానంలో ఉండగా,కేరళ 52 కేసులతో రెండో స్థానంలో ఉంది. ఈ రాష్ట్రాలతోపాటు ఢిల్లీలో 27, యూపీలో 26, రాజస్థాన్‌లో 23 కరోనా వైరస్ బాధిత కేసులు నమోదయ్యాయి. పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమై ఈ నెల 31 వరకు పూర్తిస్థాయి లాక్ డౌన్ ప్రకటించింది.ఇప్పటికే రాజస్థాన్‌లో అత్యవసర సేవలు మినహా పూర్తిస్థాయి లాక్ డౌన్ ఆంక్ష లు అశోక్ గెహ్లోట్ ప్రభుత్వం ప్రకటించింది. మహారాష్ట్రలో ఇవాళ ఒక్క రోజే కొత్తగా 10 కోవిడ్-19 కేసులు ఇప్పటివరకు నమోదయ్యాయి. దీంతో కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి లాక్ డౌన్ ప్రకటించే ఆలోచనలో ఉద్ధవ్ థాక్రే ప్రభుత్వం ఉన్నట్లు వార్తలు వెలువడుతున్నాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి