iDreamPost

ఎన్నికల్లో ప్రత్యర్థులుగా భార్యభర్తలు! వీరి కథ కామెడీ కాదు! వెరీ సీరియస్!

  • Published Apr 03, 2024 | 7:37 PMUpdated Apr 03, 2024 | 7:37 PM

సాధారణంగా రాజకీయలు అంటేనే వివదాలు, విమర్శలతో ముడిపడి ఉంటుదన్న విషయం అందరికి తెలిసిందే. అయితే ఈ వివదాలు అనేవి ముఖ్యంగా ప్రతి పక్ష పార్టీల్లోనూ.. సొంత ఇంట్లో ఉండే తండ్రి, కొడుకులు, అన్నదమ్ముల మధ్య, అలాగే బావ బామ్మర్దుల మధ్య ఎక్కువగా జరుగుతుండటం చూస్తుంటాం. కానీ, తొలిసారిగా ఈ రాజకీయం అనేది ఇద్దరి భర్యాభర్తల మధ్య కలహాలకు కారణమయ్యాయి. దీంతో భార్యభర్తలిద్దరి మధ్య ఉప్పు, నిప్పులా పరిస్థితి ఏర్పడింది. ఇంతకి ఎక్కడంటే..

సాధారణంగా రాజకీయలు అంటేనే వివదాలు, విమర్శలతో ముడిపడి ఉంటుదన్న విషయం అందరికి తెలిసిందే. అయితే ఈ వివదాలు అనేవి ముఖ్యంగా ప్రతి పక్ష పార్టీల్లోనూ.. సొంత ఇంట్లో ఉండే తండ్రి, కొడుకులు, అన్నదమ్ముల మధ్య, అలాగే బావ బామ్మర్దుల మధ్య ఎక్కువగా జరుగుతుండటం చూస్తుంటాం. కానీ, తొలిసారిగా ఈ రాజకీయం అనేది ఇద్దరి భర్యాభర్తల మధ్య కలహాలకు కారణమయ్యాయి. దీంతో భార్యభర్తలిద్దరి మధ్య ఉప్పు, నిప్పులా పరిస్థితి ఏర్పడింది. ఇంతకి ఎక్కడంటే..

  • Published Apr 03, 2024 | 7:37 PMUpdated Apr 03, 2024 | 7:37 PM
ఎన్నికల్లో ప్రత్యర్థులుగా భార్యభర్తలు! వీరి కథ కామెడీ కాదు! వెరీ సీరియస్!

సాధారణంగా రాజకీయలు అంటేనే వివదాలు, విమర్శలతో ముడిపడి ఉంటుదన్న విషయం అందరికి తెలిసిందే. అయితే ఈ వివదాలు అనేవి ముఖ్యంగా ప్రతి పక్ష పార్టీల్లోనూ.. సొంత ఇంట్లో ఉండే తండ్రి, కొడుకులు, అన్నదమ్ముల మధ్య, అలాగే బావ బామ్మర్దుల మధ్య ఎక్కువగా జరుగుతుండటం చూస్తుంటాం. అంతేకాకుండా.. ఆ రాజకీయ వివదాలనేవి ఒక్కోక్కసారి.. కొన్ని కొట్టుకున్న స్థాయి నుంచి దాడులు, హత్యలు చేసుకోనే స్థాయికి చేరుతుంటాయి. కానీ, తొలిసారిగా ఈ రాజకీయం అనేది ఇద్దరి భర్యాభర్తల మధ్య కలహాలకు కారణమయ్యాయి. దీంతో ఆ  భార్యభర్తలిద్దరి మధ్య ఉప్పు, నిప్పులా పరిస్థితి ఏర్పడింది. అయితే వీరి రాజకీయ వివాదం ఎంతకు దారి తీసింది.. అసలు ఎందుకు మొదలయ్యిందో ఇప్పుడు తెలుసుకుందాం.

తాజాగా ఈ రాజకీయం అనేది పచ్చని సంసారాల్లో చిచ్చు తీసుకొచ్చింది. అప్పటి వరకు అన్యోన్యంగా ఉన్న ఆ భార్య భర్తల మధ్య నిప్పులు కక్కింది. దీంతో ఇద్దరి మధ్య రాజుకున్న ఆ రగడ చివరికి ఇంట్లో ఎవరో ఒక్కరే ఉండే పరిస్థితికి తీసుకొచ్చింది. అయితే ఈ విచిత్ర పరిస్థితి మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని బాలా ఘాట్ ప్రాంతంలో చోటుచేసుకుంది. ఆ వివరాళ్లోకి వెళ్తే.. మధ్యప్రదేశ్ లోని బాలా ఘూట్ పార్లమెంట్ నియోజకవర్గానికి త్వరలోనే ఎన్నికలు జరగబోతున్నాయి. అయితే ఈ ఎన్నికల్లో ఒకే కుటుంబంలో ఉన్న భార్యభర్తలు మధ్య వివాదానికి కారణమయ్యాయి. కాగా, ఈ ఎన్నికల్లో ఆ పార్లమెంటు స్థానంలో బహుజన్ సమాజ్ వాదీ పార్టీ అభ్యర్థిగా..మాజీ ఎంపీ కంకర్ ముంజరే ఎన్నికల బరిలో ఉన్నారు.

ఇక అతని భార్య అనుభా ముంజర్ కూడా కాంగ్రెస్ పార్టీ తరుపున రాజకీయాల్లో ఉన్నారు. అంతేకాకుండా.. గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే ప్రస్తుతం ఆమె కాంగ్రెస్ తరపున బరిలో ఉన్న సామ్రాట్ సరస్వర్ తరపున ప్రచారంలో పాల్గొంటున్నారు. దీంతో ఈ భార్య, భర్తలు ఇద్దరూ ఒకే ఇంట్లో ఉండటం ఇప్పుడు పార్టీ ప్రచారాలకు పెద్ద సమస్యగా మారింది. దీంతో కంకర్.. తన భార్య తరుపున ప్రచారం చేస్తారా? లేక కాంగ్రెస్ అభ్యర్థి తరఫున ప్రచారం చేస్తారా? అంటూ పలువురు ప్రశ్నలు తెరపైకి తెస్తున్నారు. ఇక ఈ ప్రశ్నల నేపథ్యంలోనే కంకర్ ముంజరే ఓ నిర్ణయం తీసుకున్నారు. కాగా, ఏప్రిల్ 19 న పార్లమెంట్ ఎన్నికల ఓటింగ్ ముగిసే వరకు.. తాము నివసిస్తున్న ఇంట్లో అయితే తానైనా, తన భార్య అయిన ఎవరో ఒక్కరే ఉండాలని, ఇంట్లో ఇద్దరూ ఒకే చోట కలిసి ఉండటం కుదరదని తన భార్య అనుభా ముంజరేకు కోరారు. అలాగే ఈ పరిస్థితిలో తనతో వివాదం వద్దు ఇది పార్టీకి సంబంధించిన విషయమని, ఈ నిర్ణయంలో నేను ఏమాత్రం వెనుక్కి తగ్గేది లేదని.. తన భార్యతో కంకర్ స్పష్టం చేశాడు.

దీంతో భర్త నిర్ణయం విన్న అనుభా ముంజరే ఒక్కసారిగా ఖంగు తిన్నది. అసలు తన భర్త నిర్ణయానికి ఏం చేయాలో తెలియని స్థితిలో పడిపోయింది. పైగా రాజకీయాల కోసం తనను ఇంట్లో నుంచి వెళ్లిపొమ్మనని చెబుతున్న భర్త తీరుతో ఆమె ఆవేదన చెందుతోంది. అంతేకాకుండా.. ఇలా భార్య భర్తలు వేరు వేరు పార్టీల్లో ఉన్నంత మాత్రాన సంసారాల్లో చిచ్చులు పెట్టుకుంటారా.. ఇలా విభేదాలు కలిగించే రాజకీయాలు అవసరమా అంటూ పలువురు రాజకీయ విశ్లేషకులు వాపోతున్నారు. మరి, రాజకీయ పార్టీల వలన ఇద్దరి భార్య భర్తలపై మధ్య వైరం తలెత్తిన ఈ ఘటన పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి