iDreamPost

పూనమ్ పాండే మృతికి కారణమైన వ్యాధి ఏంటి? అంత డేంజరా?

వివాదాస్పద నటి, మోడల్ పూనమ్ పాండే మృతి చెందారన్న వార్త బయటకు వచ్చింది. ఈ విషయాన్ని ఆమె టీం సోషల్ మీడియా వేదికగా ఎనౌన్స్ చేసింది. తీవ్ర అనారోగ్య సమస్యలతో ఆమె కన్నుమూసిందని ఆ పోస్టులో పేర్కొనబడి ఉంది. ఇంతకు ఆ వ్యాధి ఏంటీ.. అంత డేంజరా..?

వివాదాస్పద నటి, మోడల్ పూనమ్ పాండే మృతి చెందారన్న వార్త బయటకు వచ్చింది. ఈ విషయాన్ని ఆమె టీం సోషల్ మీడియా వేదికగా ఎనౌన్స్ చేసింది. తీవ్ర అనారోగ్య సమస్యలతో ఆమె కన్నుమూసిందని ఆ పోస్టులో పేర్కొనబడి ఉంది. ఇంతకు ఆ వ్యాధి ఏంటీ.. అంత డేంజరా..?

పూనమ్ పాండే మృతికి కారణమైన వ్యాధి ఏంటి? అంత డేంజరా?

2011 వరల్డ్ కప్ జరుగుతున్న సమయంలో దేశాన్ని కుదిపేసిన పేరు పూనమ్ పాండే. ఇండియా ప్రపంచకప్ కొడితే.. నగ్నంగా మైదానంలో చక్కర్లు కొడతానంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచింది. 2021లో ఐసీసీ టెస్ట్ చాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్నప్పుడు కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేసింది. అంతేనా.. తన హాట్ అందాలతో సోషల్ మీడియాను షేక్ చేసేసింది. బికినీ, సెమీ న్యూడ్ ఫోటోలు షేర్ చేస్తూ సెన్సేషనల్ సృష్టించింది. కరోనా సమయంలో తన ప్రియుడు, దర్శకుడు సామ్ బాంబేను వివాహం చేసుకుని.. నెల తిరగకుండానే అతడిపై గృహ హింస కేసు పెట్టింది. తనను మోసం చేశారంటూ బాలీవుడ్ ఒకప్పటి స్టార్ నటి శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రాపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.

మోడల్ నుండి నటిగా కెరీర్ మొదలైన నాటి నుండి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ కాంట్రవర్సీ క్వీన్‌గా ముద్ర పడ్డ పూనమ్ పాండే.. అత్యంత చిన్న వయస్సులో ఈ లోకాన్ని విడిచి పెట్టి వెళ్లిపోయిందంటూ వార్తలు వచ్చాయి. ఈ మరణవార్తను పూనమ్ పాండే అఫిషియల్ ఇన్ స్టా అకౌంట్ ద్వారా వెల్లడించింది ఆమె టీం. గర్భాశయ క్యాన్సర్‌తో మృతి చెందినట్లు ఆ పోస్టు తెలిపింది. దీంతో ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు ఆమె అభిమానులు. నషా అనే చిత్రంతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ బోల్డ్ బ్యూటీ.. చేసినవి కొన్ని సినిమాలే అయినా తన మాటలతో, చేష్టలతో గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో మాలిని అండ్ కో అనే చిత్రంలో నటించింది. చివరిగా.. 2018లో ద జర్నీ ఆఫ్ కర్మ అనే హిందీ చిత్రంలో యాక్ట్ చేసింది.

32 ఏళ్ల వయస్సులో ఆమెను గర్భాశయ క్యాన్సర్ బలి తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. అసలు సర్వికల్ క్యాన్సర్ ఏంటీ.. ఇది వస్తే మరణం తప్పదా.. మహిళకు శాపంగా మారిన ఈ క్యాన్సర్ లక్షణాలు, చికిత్స అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం వివరాలు అందిస్తున్నాం. గర్భాశయ క్యాన్సర్ అనేది గర్భాశయ కణాలలో సంభవించే ఒక రకమైన క్యాన్సర్. ఇది ప్రారంభ దశల్లో ఉన్నప్పుడు నిర్దారణ కాదూ. వ్యాధి లక్షణాలు ముదురుతున్న కొద్దీ బయటపడుతుంది. హ్యుమన్ పాపిల్లోమా వైరస్ (హెచ్‌‌పీవీ) వైరస్ సర్వికల్ క్యాన్సర్‌కు దారి తీస్తుంది. శృంగారం తర్వాత మహిళ జన నేంద్రియాల నుండి రక్త స్రావం కావడం, తీవ్రమైన కడుపు నొప్పి, దుర్వాసన, తెల్లటి డిశార్జ్ ఎక్కువ కావడం, పీరియడ్స్‌లో లోపాలు, మూత్ర విసర్జన సమయంలో నొప్పి వీటి లక్షణాలు. వీటిల్లో ఏ లక్షణాలు కనిపించినా వెంటనే వైద్యుణ్ని సంప్రదించాలి.

2018 లెక్కల ప్రకారం ఇండియాలో ఈ సర్వికల్ క్యాన్సర్ వల్ల ఏటా 60 వేల మంది మహిళలు చనిపోతున్నారంటే.. దీని తీవత్ర ఎలా ఉందో ఈ గణాంకాలు చెప్పకనే చెబుతున్నాయి. 30 నుండి 60 సంవత్సరాల మధ్య గల మహిళల్లో ఈ వ్యాధి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు. సర్వికల్ క్యాన్సర్‌ను ముందస్తుగా గుర్తించడం వల్ల ఈ ప్రాణాంతక ఈ వ్యాధి నుండి మహిళలు బయటపడొచ్చు. ఈ వ్యాధిని నిర్దారించేందుకు ముందస్తు పరీక్షలు ఉన్నాయి. గైనకాలజీ వైద్యుల్ని సంప్రదించి.. కొన్ని పరీక్షలు చేయించుకోవడం మంచిది. ముందస్తు పరీక్షల వల్ల గర్భాశయ వ్యాధిని నిర్దారించడమే కాకుండా.. తగ్గించేందుకు అవకాశాలు ఉంటాయి.

మాలిక్యులర్ పరీక్షలు, పాప్ స్మియర్ పరీక్షలతో క్యాన్సర్ నున ముందుగానే గుర్తించే అవకాశాలు ఉంటాయి. వైద్యుల సూచన మేరకు జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. దీనికి చికిత్స కూడా ఉందని చెబుతున్నారు వైద్యులు. ఎక్స్‌టర్నల్-బీమ్ రేడియేషన్ థెరపీ & ఇంటర్నల్-బీమ్ రేడియేషన్ థెరపీ, కీమో థెరపీ, టార్గెటెడ్ థెరపీ వంటివి చికిత్స ద్వారా తగ్గించుకోవచ్చు. అలాగే ఈ వ్యాధిపై కేంద్రం దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఈ క్యాన్సర్ నిర్మూలను లక్ష్యంగా టీకా కార్యక్రమాలను చేపట్టనున్నట్లు తెలిపింది. 9 నుండి 14 ఏళ్ల లోపు బాలికలకు టీకాలు ఇస్తామని వెల్లడించడం గమనార్హం.

 

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి