iDreamPost

రైతు బంధు నిలిపివేయాలని ఈసీకి ఫిర్యాదు చేశాం: ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి

  • Published Oct 26, 2023 | 11:06 AMUpdated Oct 26, 2023 | 11:06 AM

బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రైతులను ఆదుకోవడం కోసం అందజేస్తోన్న పెట్టుబడి సాయం రైతు బంధును నిలిపివేయాలంటూ కాంగ్రెస్‌ పార్టీ ఫిర్యాదు చేసింది. దీనిపై పెద్ద ఎత్తున​ ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ఆ వివరాలు..

బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రైతులను ఆదుకోవడం కోసం అందజేస్తోన్న పెట్టుబడి సాయం రైతు బంధును నిలిపివేయాలంటూ కాంగ్రెస్‌ పార్టీ ఫిర్యాదు చేసింది. దీనిపై పెద్ద ఎత్తున​ ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ఆ వివరాలు..

  • Published Oct 26, 2023 | 11:06 AMUpdated Oct 26, 2023 | 11:06 AM
రైతు బంధు నిలిపివేయాలని ఈసీకి ఫిర్యాదు చేశాం: ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి

తెలంగాణలో ఎన్నికల నగరా మోగింది. నంబర్‌ 30న పోలింగ్‌ జరగనుండగ.. డిసెంబర్‌ 3న పార్టీల భవితవ్యం తేలనుంది. ఇక ఎన్నికల్లో గెలుపు కోసం పార్టీలన్ని తీవ్రంగా కృషి చేస్తున్నాయి. ప్రజలను ఆకట్టుకునేలా మేనిఫెస్టో విడుదల చేశాయి అన్ని పార్టీలు. ప్రస్తుతం అభ్యర్థుల జాబితా విడుదల, ప్రచార కార్యక్రమాలతో బిజీగా ఉన్నాయి. ఇక తెలంగాణలో కారుకు బ్రేకులు వేయడం కోసం కాంగ్రెస్‌ పార్టీ తీవ్రంగా కృషి చేస్తోంది. ఎన్నికల కదనంలో అధికార పార్టీకి గట్టి పోటీ ఇచ్చేందుకు రెడీ అవుతోంది. ఇంకా పోలింగ్‌ జరగనేలేదు. అప్పుడే ఆ పార్టీలో ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంపై గట్టి పోటీ నడుస్తోంది. సీఎం క్యాండెట్‌ నేనంటే నేనని ఆ పార్టీ నేతలు ఇప్పటి నుంచే ప్రకటనలు చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. తాజాగా కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి చేసిన పనిపై పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు జనాలు. ఇంతకు ఏం జరిగింది అంటే..

తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్‌ఎస్‌ పార్టీ.. రైతు సంక్షేమం కోసం రైతు బంధు పేరుతో ఏటా రెండు దఫాలుగా పెట్టుబడి సాయం అందిస్తోన్న సంగతి తెలిసిందే. జూన్‌లో, నవంబర్‌లో ఈ మొత్తాన్ని రైతుల ఖాతాలో జమ చేస్తారు. వచ్చే నెల అనగా నవంబర్‌లో రైతు బంధు నిధులు విడుదల కావాల్సి ఉంది. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికల కోడ్‌ అమల్లో ఉండటం వల్ల రైతు బంధు నిధులు విడుదల నిలిపివేయాలని కోరుతూ కాంగ్రెస్‌ నేత ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ఈసీకి ఫిర్యాదు చేశారు. పోలీంగ్‌ రోజున రైతు బంధు నిధులను రైతులకు పంపిణీ చేయకుండా, వారిని ప్రలోభపెట్టకుండా కేసీఆర్‌ సర్కార్‌ను అడ్డుకోవాలని ఎన్నికల కమిషన్‌ను కోరారు. ఈ మేరకు ప్రధాన ఎన్నికల కమిషనర్‌కు లేఖ రాశారు.

కాంగ్రెస్‌ తీరుపై విమర్శలు..

అయితే ఉత్తమ్‌ తీరుపై బీఆర్‌ఎస్‌ నేతలతో పాటు.. సామాన్యులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైతులను ఆదుకోవడం కోసం తెచ్చిన పథకాన్ని ఇలా మీ స్వార్థం కోసం నిలిపివేయాలని కోరడం సమంజసమా అని ప్రశ్నిస్తున్నారు. ఇక కాంగ్రెస్‌ ఫిర్యాదు ఇవ్వండపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అంటేనే రైతు విరోధి అని మరోసారి రుజువైపోయిందన్నారు. అన్నదాత పాలిట నంబర్ వన్ విలన్ కాంగ్రెస్ అని ఇంకోసారి తేలిపోయిందని విమర్శించారు. పెట్టుబడి సాయాన్ని అడ్డుకునే కపట కాంగ్రెస్ పార్టీ కుట్రను తెలంగాణ రైతులు సహించరు.. అన్నదాతల పొట్టకొట్టే కుటిల కాంగ్రెస్ కుతంత్రాలను ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలంగాణ రైతులు భరించరు అంటూ ట్విట్టర్‌ వేదికగా కేటీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి