iDreamPost

45 మందితో కాంగ్రెస్ అభ్యర్థుల రెండో జాబితా విడుదల! గద్దర్ కూతురికి..

  • Author Soma Sekhar Published - 09:47 PM, Fri - 27 October 23

ఎట్టకేలకు కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థుల లిస్ట్ ను విడుదల చేసింది. 45 మందితో కూడిన జాబితాను రిలీజ్ చేయగా.. మళ్లీ ముఖ్యనేతలకు మెుండిచేయే ఎదురైంది. మరి ఎవరెవరికి సీట్లు కేటాయించారో ఇప్పుడు తెలుసుకుందాం.

ఎట్టకేలకు కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థుల లిస్ట్ ను విడుదల చేసింది. 45 మందితో కూడిన జాబితాను రిలీజ్ చేయగా.. మళ్లీ ముఖ్యనేతలకు మెుండిచేయే ఎదురైంది. మరి ఎవరెవరికి సీట్లు కేటాయించారో ఇప్పుడు తెలుసుకుందాం.

  • Author Soma Sekhar Published - 09:47 PM, Fri - 27 October 23
45 మందితో కాంగ్రెస్ అభ్యర్థుల రెండో జాబితా విడుదల! గద్దర్ కూతురికి..

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగడంతో.. ఒక్కోపార్టీ తమ అభ్యర్థులను ప్రకటిస్తూ.. వస్తోంది. అందరికంటే ముందుగా బీఆర్ఎస్ పార్టీ తమ అభ్యర్థులను ప్రకటించి.. ప్రతిపక్ష పార్టీలను ఇరకాటంలో పడేసింది. అదీకాక ప్రచారంలో దూసుకుపోతున్నారు సీఎం కేసీఆర్. ఇప్పటికే వరుస సభల ద్వారా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. అయితే ప్రతిపక్షాలు మాత్రం ఇంకా సీట్ల పంపకాల దగ్గరే ఆగిపోయాయి. ఇక ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల లిస్ట్ తాజాగా విడుదల చేసింది అధిష్టానం. తొలి విడతలో 55 మందితో జాబితాను రిలీజ్ చేసిన ఢిల్లీ అధిష్టానం.. రెండో లిస్ట్ లో 45 మందితో కూడిన జాబితాను రిలీజ్ చేసింది. మరి ఎవరెవరికి సీట్లు దక్కాయో ఇప్పుడు తెలుసుకుందాం.

45 మంది అభ్యర్థులతో కూడిన రెండో జాబితాను కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది. దీంతో తొలి లిస్ట్ తో కలిపి అభ్యర్థుల సంఖ్య 100కు చేరుకుంది. ఇంకా 19 స్థానాలను పెండింగ్ లో ఉంచింది ఢిల్లీ అధిష్టానం. ఇదిలా ఉండగా.. గద్దర్ కుమార్తె జీవీ వెన్నెలకు సికింద్రాబాద్ కంటోన్మెంట్ సీటును కేటాయించింది. మిగతా సీనియర్ నాయకులకు సంబంధించి.. ఇటీవల కాంగ్రెస్ లో చేరిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మునుగోడు టికెట్ ను కేటాయించింది. ఇక రాష్ట్ర రాజకీయాల్లోనే హాట్ టాపిక్ గా మారిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి పాలేరు, తుమ్మల నాగేశ్వరరావుకు ఖమ్మం టికెట్లను కేటాయించారు. మిగతా అభ్యర్థులకు ఏఏ నియోజకవర్గాలను కేటాయించారో చూద్దాం.

  • పినపాక(ఎస్టీ) – పాయం వెంకటేశ్వర్లు
  • వర్ధన్నపేట(ఎస్సీ) -కేఆర్ నాగరాజు
  • ఆదిలాబాద్‌- కంది శ్రీనివాస్‌ రెడ్డి
  • ఆసిఫాబాద్- అజ్మీరా శ్యాం నాయక్
  • సిర్పూర్‌ – రావి శ్రీనివాస్‌
  • బోథ్‌ (ఎస్టీ) – వెన్నెల అశోక్‌
  • మహబూబ్‌నగర్‌ – యెన్నం శ్రీనివాస్‌ రెడ్డి
  • నారాయణపేట్‌- డా. పర్ణిక చిట్టెం రెడ్డి
  • జడ్చర్ల – జె. అనిరుధ్‌ రెడ్డి
  • దేవరకద్ర – గావినోళ్ల మధుసూధన్‌ రెడ్డి
  • వనపర్తి- డా. జిల్లెల చిన్నారెడ్డి
  • మక్తల్‌- వాకిటి శ్రీహరి
  • మునుగోడు – కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి
  • భువనగిరి – కుంభం అనిల్‌ కుమార్‌ రెడ్డి
  • దేవరకొండ (ఎస్టీ)- నేనావత్‌ బాలూ నాయక్‌
  • పాలకుర్తి – యశశ్విని మేమిడాల
  • జనగామ- కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి
  • పరకాల – రేవూరి ప్రకాశ్ రెడ్డి
  • మహబూబాబాద్‌ (ఎస్టీ)- డా. మురళీ నాయక్‌
  • ఖానాపూర్‌ (ఎస్టీ) – వెద్మర బొజ్జు
  • ముథోల్‌ – బోస్లె నారాయణరావు పాటిల్‌
  • నిజామాబాద్‌ రూరల్‌ – డాక్టర్‌ రేకులపల్లి భూపతి రెడ్డి
  • కోరుట్ల – జువ్వాది నర్సింగరావు
  • ఎల్లారెడ్డి – కె.మదన్‌ మోహన్‌ రావు
  • హుజురాబాద్‌ – వడితెల ప్రణవ్‌
  • చొప్పదండి (ఎస్సీ) – మేడిపల్లి సత్యం
  • హుస్నాబాద్‌ – పొన్నం ప్రభాకర్‌
  • సిద్ధిపేట- పూజల హరికృష్ణ
  • దుబ్బాక- చెరుకు శ్రీనివాస్‌రెడ్డి
  • నర్సాపూర్‌- ఆవుల రాజిరెడ్డి
  • వరంగల్‌ తూర్పు – కొండా సురేఖ
  • వరంగల్‌ పశ్చిమ – నాయిని రాజేందర్‌ రెడ్డి
  • కూకట్‌పల్లి- బండి రమేష్‌
  • ఎల్బీనగర్‌- మధు యాష్కి గౌడ్‌
  • అంబర్‌పేట్‌- రోహిన్‌ రెడ్డి
  • ఖైరతాబాద్‌- పి.విజయారెడ్డి
  • జూబ్లీహిల్స్‌- మహ్మద్‌ అజహరుద్దీన్‌
  • సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ (ఎస్సీ)- డాక్టర్‌ జీవీ వెన్నెల
  • ఇబ్రహీంపట్నం- మల్‌రెడ్డి రంగారెడ్డి
  • రాజేంద్రనగర్‌- కస్తూరి నరేందర్‌
  • మహేశ్వరం- కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి
  • తాండూర్‌- బయ్యని మనోహర్‌రెడ్డి
  • శేరిలింగంపల్లి- వి.జగదీశ్వర్‌ గౌడ్‌

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి