iDreamPost

రాజమౌళి ఏదో ఒకటి తేల్చాల్సిందే

రాజమౌళి ఏదో ఒకటి తేల్చాల్సిందే

అక్టోబర్ విడుదల వాయిదా పడ్డాక ఆర్ఆర్ఆర్ కు కొత్త తేదీని సెట్ చేసుకోవడం పెద్ద సమస్యగా మారింది. ఇది ఈ నెలలో వస్తుందనే భరోసాతో భీమ్లా నాయక్, సర్కారు వారి పాట, రాధే శ్యామ్ లు సంక్రాంతి సీజన్ ని లాక్ చేసుకున్నాయి. ఇప్పుడు చూస్తేనేమో జక్కన్న ఈ సీజనే బెస్ట్ అని ఫీలవుతున్నాడని ఇన్ సైడ్ టాక్. ఈ కారణంగానే రాజమౌళి ప్రభాస్ ని ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేశాడని, అయితే యువి సంస్థ దానికి సుముఖంగా లేకపోవడంతో పాటు పోటీ పడినా తమకేమి ఇబ్బందేమీ తేల్చి చెప్పినట్టుగా తెలిసింది. అందుకే ఇవాళ కృష్ణాష్టమి సందర్భంగా కొత్త పోస్టర్ విడుదల చేసి అందులో రిలీజ్ డేట్ ని జనవరి 14ని మరోసారి కన్ఫర్మ్ చేశారు.

వాళ్ళ సంగతి ఎలా ఉన్నా రాధే శ్యామ్ తో నేరుగా పోటీ పడేందుకు నిర్మాత దానయ్య టీమ్ సుముఖంగా లేదు. రెండు పాన్ ఇండియా సినిమాలే కావడంతో ఫేస్ టు ఫేస్ పోటీ పడితే నార్త్ లో కలెక్షన్ల మీద తీవ్ర ప్రభావం ఉంటుంది. ఎవరు నష్టపోతారు అనేది ఇప్పుడు చెప్పలేకపోయినా ఇమేజ్ లెక్కల్లో చూసుకుంటే ప్రభాస్ ఇమేజ్ రాధే శ్యామ్ కు అడ్వాంటేజ్ గా మారుతుంది. ఇక థియేటర్ల కౌంట్, వసూళ్ల లెక్కలు వగైరాల సంగతి చెప్పనక్కర్లేదు. డిసెంబర్ లో క్రిస్మస్ ని టార్గెట్ చేద్దామంటే ఆల్రెడీ అల్లు అర్జున్ పుష్ప ముందే చెప్పేసింది. ఆచార్య కూడా అదే నెలవైపే కన్నేసిందని ఇప్పటికే టాక్ ఉంది. సో ఆ అవకాశం లేనట్టే.

ఇదంతా ఎందుకు ఆర్ఆర్ఆర్ ఉగాదికి వెళ్లొచ్చు కాదనే కామెంట్లు లేకపోలేదు. అప్పటికి చాలా ఆలస్యమవుతుంది. డిస్ట్రిబ్యూటర్ల నుంచి ఇతర బాషల హక్కులు కొన్న ప్రొడ్యూసర్ల నుంచి ఒత్తిడి ఎక్కువవుతుంది. అందులోనూ ఆ టైంకి పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పలేం. బ్రహ్మాస్త్ర లాంటి బాలీవుడ్ మల్టీ స్టారర్లు ఆ టైంకే ప్లాన్ చేసుకున్నాయి. సో చాలా ప్లాన్డ్ గా అనుకూలమైన డేట్ ని ఎంచుకోవాలి. ఏ మాత్రం పొరపాటు జరిగినా కలిగే నష్టం పదుల కోట్లలో ఉంటుంది. అందుకే ఆర్ఆర్ఆర్ క్లియర్ గా ఫలానా తేదీ అని చెప్పేస్తే మిగిలిన నిర్మాతలు తమ డేట్లు ప్లాన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. కానీ ఇది జరిగే పనేనా

Also Read : “మోస‌గాళ్ల‌కి మోస‌గాడు”కి 50 ఏళ్లు

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి