iDreamPost

లోకేష్ – అనిరుధ్.. పూర్తిగా అదే ఫాలో అయితే ఎలా?

  • Author ajaykrishna Published - 10:02 AM, Fri - 29 September 23
  • Author ajaykrishna Published - 10:02 AM, Fri - 29 September 23
లోకేష్ – అనిరుధ్.. పూర్తిగా అదే ఫాలో అయితే ఎలా?

ఇండస్ట్రీలో లోకేష్ కనగరాజ్, అనిరుధ్ రవిచందర్ లది సెన్సేషనల్ కాంబినేషన్. ఒకరు డైరెక్టర్ గా ఒక్కో మెట్టు ఎక్కుతుంటే.. ఒకరు మ్యూజిక్ డైరెక్టర్ సినిమాలను ఒక్కో మెట్టు ఎక్కిస్తున్నారు. వీరిద్దరూ కలిసి ఇండస్ట్రీలో సంచలనాలు సృష్టిస్తున్నారు. మాస్టర్, విక్రమ్ సినిమాలు మొదలుకొని.. ఇప్పుడు లియో.. నెక్స్ట్ సూపర్ స్టార్ రజినీకాంత్ 171 మూవీ వరకు ప్రతీ సినిమాతో అంచనాలు పెంచేస్తున్నారు. ఖైదీ, విక్రమ్ సినిమాలతో సినిమాటిక్ యూనివర్స్ క్రియేట్ చేసిన లోకేష్ కనగరాజ్.. దాదాపు తన సినిమాలకు హాలీవుడ్ మూవీస్ ట్రీట్మెంట్ ఇస్తుంటాడు. మీరు బాగా గమనిస్తే.. లోకేష్ కూడా ఎక్కువగా హాలీవుడ్ నుండి స్ఫూర్తి పొందుతానని చెప్పేశాడు.

లోకేష్ అంటే దర్శకుడు కాబట్టి.. స్క్రిప్ట్, సన్నివేశాలు.. యాక్షన్ బ్లాక్ లకు హాలీవుడ్ టచ్ ఇవ్వగలడేమో అనుకోవచ్చు. కానీ.. లోకేష్ సినిమాలకు హాలీవుడ్ టచ్ ఇచ్చినట్లుగా.. సినిమాలో మ్యూజిక్ కి కూడా ఇంగ్లీష్ టచ్ ఇచ్చేస్తున్నాడు. అదే ఇప్పుడు చర్చనీయంశంగా మారింది. మరోవైపు అనిరుధ్.. అన్ని రకాల ట్యూన్స్ అందించగలడు. ఆల్రెడీ చాలా సినిమాలతో ప్రూవ్ చేసుకున్నాడు. అయితే.. ఏ డైరెక్టర్ కి ఎలాంటి సంగీతం అందించినా.. లోకేష్ విషయంలో పూర్తిగా పంథా మార్చేస్తున్నాడు. సరే.. స్క్రిప్ట్ కి అవసరం బట్టి.. డైరెక్టర్ టేస్ట్ బట్టి మ్యూజిక్ అందిస్తున్నాడని అనుకోవచ్చు.

ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఒకటుంది. ఇండస్ట్రీలో సినిమాల మేకింగ్ పరంగా రోజులు మారాయి.. ట్రెండ్ మారింది కావచ్చు. కానీ.. ఎన్ని మారినా మ్యూజిక్ లవర్స్ మారరు. సినిమాలు ఎలా ఉన్నా.. సంగీతం ఎలా ఉందనేది గమనించే ప్రేక్షకులు, సంగీత ప్రియులు ఇంకా ఉన్నారు. లోకేష్, అనిరుధ్.. సినిమాలకు స్క్రిప్ట్ పరంగా ఇంగ్లీష్ వెస్టర్న్ టచ్ ఇస్తే ఓకే. కానీ.. సాంగ్స్ కూడా అలాగే అంటే.. ఒక వర్గం ప్రేక్షకులు థియేటర్స్ కి రాకుండా అయిపోతుందనేది ప్రస్తుతం వినిపిస్తున్న వాదన. అదెలాగంటే.. సినిమాలు ట్రెండ్ కి తగ్గట్టుగా ఉన్నా.. మ్యూజిక్ పూర్తిగా వెస్టర్న్ టచ్ తో ఇంగ్లీష్ లిరిక్స్ ఉన్నా యూత్ వరకు సినిమా చూసేందుకు వస్తారేమో. కానీ.. కాస్త మధ్య వయసు దాటిన వారి నుండి పెద్దవాళ్ళ వరకు థియేటర్స్ కి రావడంలో సాంగ్స్ చాలా ముఖ్యపాత్ర పోషిస్తున్నాయి. తాజాగా లియో నుండి ‘బ్యాడ్ యాస్’ సాంగ్ వచ్చింది. మరి యూత్ ని ఊపేస్తున్న ఈ పాట.. కామన్ ఆడియన్స్ ని థియేటర్స్ కి రప్పించడంలో ఎలాంటి పాత్ర పోషిస్తుందో చూడాలి. మరి అనిరుధ్, లోకేష్ కాంబినేషన్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి