iDreamPost
android-app
ios-app

ఇండస్ట్రీలోకి మరో వారసుడు.. హీరోగా ఎంట్రీ ఇస్తున్న కమెడియన్ కొడుకు!

  • Author Soma Sekhar Updated - 04:41 PM, Sat - 16 September 23
  • Author Soma Sekhar Updated - 04:41 PM, Sat - 16 September 23
ఇండస్ట్రీలోకి మరో వారసుడు.. హీరోగా ఎంట్రీ ఇస్తున్న కమెడియన్ కొడుకు!

సినిమా ఇండస్ట్రీలోకి మరో వారసుడు రాబోతున్నాడు. ఇక ఇప్పటికే ఎంతో మంది నటీ, నటుల వారసులు పరిశ్రమలోకి అడుగుపెట్టారు. అయితే అందులో కొందరు హిట్టైతే.. మరి కొందరు ఫట్టైయ్యారు. తాజాగా ఓ స్టార్ కమెడియన్ కొడుకు ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. అతడు నటించిన చిత్రం ఈ నెల 22న ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్దమైంది. ఇక ఈ సినిమాను తెలుగు, తమిళ్ భాషల్లో రిలీజ్ చేయడానికి సన్నాహకాలు చేస్తున్నట్లు నిర్మాత తెలిపారు. మరి హీరోగా ఎంట్రీ ఇస్తున్న ఆ కమెడియన్ వారసుడు ఎవరో? ఇప్పుడు తెలుసుకుందాం.

తంబి రామయ్య.. కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ కమెడియన్ గా ఎంతో గుర్తింపు పొందాడు. తనదైనా హావభావాలతో హాస్యం పండించడంలో తంబి రామయ్య సిద్దహస్తుడు. డబ్బింగ్ మూవీస్ ద్వారా తెలుగు వారికి కూడా తంబి రామయ్య పరిచయమే. ఇక తంబి రామయ్య తన వారసుడిని ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నారు. తన కొడుకు ఉమాపతి తంబిరామయ్య హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. అతడు నటించిన చిత్రం ‘పిత్తల మాత్తి’. ఈ చిత్రానికి మాణిక్య విద్య దర్శకత్వం వహిస్తుండగా.. శ్రీ శరవణ ఫిలిం ఆర్ట్స్ పతాకంపై జి. శరవణన్ నిర్మించారు. ఇక ఈ మూవీలో హీరోయిన్ గా సంస్కృతి నటించారు.

పిత్తల మాత్తి చిత్రానికి మోసన్ సంగీతం, ఎస్ ఎన్ వెంకట్ కెమెరామెన్ గా వ్యవహరిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ ఈనెల 22న ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్దంగా ఉంది. ఈ చిత్రాన్ని తెలుగులో కూడా రిలీజ్ చేయడానికి సన్నాహకాలు చేస్తున్నట్లు నిర్మాత తెలిపారు. కాగా.. ఇప్పటికే ఎంతో మంది నట వారసులుగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు. మరి ఈ కమెడియన్ కొడుకు ఇండస్ట్రీలో ఏ మేరకు రాణిస్తాడో తెలియాలంటే.. సినిమా విడుదల వరకు వేచి చూడాల్సిందే.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetjojobetcasibomJojobetcasibomjojobetjojobetcratosroyalbetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabet