iDreamPost

ఐదేళ్ల క్రితం రిలీజ్ అయిన హిట్ మూవీ.. ఇప్పుడు ఓటీటీలోకి

  • Published Feb 29, 2024 | 11:53 AMUpdated Feb 29, 2024 | 11:53 AM

కోలీవుడ్ స్టార్ కమెడియన్ సంతానం హీరోగా ఓ సినిమాలో నటించారు. అయితే ఇప్పుడు ఆ సినిమా దాదాపు ఇన్నేళ్ల తర్వాత ఓటీటీలోని తెలుగులో రిలీజ్ అయ్యింది. ఇంతకి ఎక్కడంటే..

కోలీవుడ్ స్టార్ కమెడియన్ సంతానం హీరోగా ఓ సినిమాలో నటించారు. అయితే ఇప్పుడు ఆ సినిమా దాదాపు ఇన్నేళ్ల తర్వాత ఓటీటీలోని తెలుగులో రిలీజ్ అయ్యింది. ఇంతకి ఎక్కడంటే..

  • Published Feb 29, 2024 | 11:53 AMUpdated Feb 29, 2024 | 11:53 AM
ఐదేళ్ల క్రితం రిలీజ్ అయిన హిట్ మూవీ.. ఇప్పుడు ఓటీటీలోకి

ఎన్నో ఏళ్లుగా సినిమాల్లో కమెడియన్ గా అలరిస్తున్న వారు వెండితెర పై హీరోగా కనిపించడం కొత్తమీ కాదు. గతంలో చాలామంది కమెడియన్ లు సినిమాల్లో సహాయక పాత్రల్లోను,హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ లోనూ నటించి హీరోలుగా వెండితెర పై మెరిసారు. ఇక ఇప్పటికే టాలీవుడ్ లో ఎంతోమంది కమెడియన్ లు హీరోలుగా పరిచయం అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అటూ కోలీవుడ్ లో కూడా చాలామంది కమెడియన్ లు వెండితెర పై హీరోగా పరిచయమయ్యారు. అందులో స్టార్ కమెడియన్ అయిన ‘సంతానం’ కూడా ఒకరు. అయితే కమెడియన్ సంతానం అంటే తెలుగు ప్రేక్షకులు అంతగా గుర్తు పట్టకపోవచ్చు కానీ రాజా రాణి సినిమాలో హీరో జాన్ ఫ్రెండ్ అంటే అందరూ టక్కున గుర్తుపడతారు. ఇదిలా ఉంటే.. సంతనం హరోగా ఓ సినిమాలో నటించారు. కాగా, ఈ మూవీ క‌మ‌ర్షియ‌ల్‌గా భారీ విజ‌యాన్ని సాధించింది. అయితే ఈ సినిమా తమిళంలో విడుదలై ఐదేళ్ల తర్వాత ఇప్పడు తెలుగులోకి వచ్చింది. అది కూడా డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ అయ్యింది. ఇంతకి ఎక్కడంటే..

తమిళ్ స్టార్ కమెడియన్ సంతానం ‘A1’ అనే సినిమాలో హీరోగా నటించారు. రొమాంటిక్ కామెడీ క‌థాంశంతో తెర‌కెక్కిన ఈ మూవీని జాన్స‌న్ కే ద‌ర్శ‌కుడిగా కోలీవుడ్‌లోకి పరిచయమయ్యాడు. అయితే ఏ1 సినిమా ఎలాంటి అంచ‌నాలు లేకుండా థియేట‌ర్ల‌లో రిలీజైన ఈ మూవీ చ‌క్క‌టి వ‌సూళ్ల‌ను రాబట్టింది.అలాగే ఈ మూవీలో సంతానం కామెడీ టైమింగ్ అభిమానులను బాగా ఆకట్టుకుంది. కాగా, ఏ1 సినిమా స్టార్ హీరోలకు పోటీగా రిలీజై బాక్సాఫీస్ విన్నర్ గా నిలిచింది. అయితే ఏ1 మూవీ ఇప్పుడు తెలుగు వెర్ష‌న్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. కానీ ఫ్రీగా మాత్రం కాకుండా రెంటల్ విధానంలో ఏ1 మూవీని రిలీజ్ చేశారు. కానీ, ఫ్రీగా కాకుండా రెంట‌ల్ విధానంలో ఏ1 మూవీని రిలీజ్ చేశారు.అయితే ఏ1 సినిమా చూడాలంటే అమెజాన్ ప్రైమ్ స‌బ్‌స్క్రిప్ష‌న్‌తో పాటు  79 రూపాయ‌లు చెల్లించాల్సిందే.ఇక ఈ సినిమాకు ద‌స‌రా ఫేమ్ సంతోష్ నారాయ‌ణ‌న్ సంగీతాన్ని అందించాడు.ఇందులో హీరోయిన్ గా తార‌ అలీషా బెర్రీ హీరోయిన్‌గా న‌టించింది.

అయితే,  ఏ1 కథ విషయానికోస్తే.. శ‌ర‌వ‌ణ‌న్ (సంతానం) ఓ బ‌ట్ట‌ల‌షాప్ న‌డుపుతుంటాడు. అలా దివ్య (తార అలీషా) అనే అమ్మాయిని తొలిచూపులోనే ప్రేమిస్తాడు. కానీ, దివ్య మాత్రం తాను ఓ రౌడిని పెళ్లిచేసుకోవాల‌న్న‌ది ఆమె క‌ల‌. పైగా అత‌డు త‌న కులం వాడై ఉండాల‌ని కండీష‌న్ పెడుతుంది. అయితే తాను ప్రేమించిన అమ్మాయి కోసం తాను రౌడీ అని శ‌ర‌వ‌ణ‌న్ అబ‌ద్ధం ఆడుతాడు? ఆ త‌ర్వాత ఏమైంది. దివ్య ప్రేమ కోసం శ‌ర‌వ‌ణ‌న్ రౌడీగా మారాడా? లేదా? అన్న‌దే ఏ1 మూవీ క‌థ‌. మరి, ఈ విషయాలన్నిటికి సమాధానం తెలియాలంటే ఏ1 మూవీ అమెజాన్ ప్రైమ్ లో చూసేయాల్సిందే.

ఇక  కోలీవుడ్ లో.. లెజండరీ కమెడియన్స్ అయిన వడివేలు, వివేక్ తర్వాత.. అంతటి గొప్ప పేరును సంతానం సంపాదించుకున్నారు. ఈ క్రమంలోనే ఈయన సినిమాల్లో హీరోలతో సమానంగా రెమ్యునరేషన్ తీసుకున్నా స్థాయికి చెరుకున్నారు.కాగా, సంతానం గతంలో హీరోగా ‘దిల్లుకుదుడ్డు’, ‘డీడీ రిట‌ర్న్స్’ వంటి సినిమాల్లో నటించగా.. ఆ రెండు క‌మ‌ర్షియ‌ల్ హిట్స్‌గా నిలిచాయి.ప్రస్తుతం ఈయన ‘డ‌క్కుప‌ట్టి రామ‌స్వామి’ అనే సినిమా చేస్తున్నారు. ఇందులో మేఘ ఆకాష్ హీరోయిన్ గా నటిస్తోంది. పైగా ఈ సినిమాలో సంతానం ఓ పాటను కూడా పాడారు. వీటితో పాటు సంతానం మరో మూడు సినిమాల్లో హీరోగా నటిస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి