iDreamPost

YSR చేయూత ద్వారా ఒక్కో మహిళకి రూ.75 వేలు ఇచ్చాం: CM జగన్

YS Jagan: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. మహిళల సంక్షేమ, అభివృద్ధి కోసం అనేక పథకాలను తీసుకొచ్చారు. వారి ఆర్థిక స్వాలంభనం కోసం ఎంతో కృషి చేశారు. తాజాగా వైఎస్సార్ చేయూత నాలుగో విడత నిధులను సీఎం జగన్ విడుదల చేశారు.

YS Jagan: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. మహిళల సంక్షేమ, అభివృద్ధి కోసం అనేక పథకాలను తీసుకొచ్చారు. వారి ఆర్థిక స్వాలంభనం కోసం ఎంతో కృషి చేశారు. తాజాగా వైఎస్సార్ చేయూత నాలుగో విడత నిధులను సీఎం జగన్ విడుదల చేశారు.

YSR చేయూత ద్వారా ఒక్కో మహిళకి రూ.75 వేలు ఇచ్చాం: CM జగన్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి  అనేక సంక్షేమ పథకాలను ప్రారంభించి.. ప్రజల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించారు. ముఖ్యంగా పేద, బడుగు, బలహీన వర్గాల అభివృద్ధి , సంక్షేమమే ధ్యేయంగా సీఎం జగన్ పాలన సాగించారు. అన్ని వర్గాల ప్రజలకు వివిధ పథకాల ద్వారా డబ్బులను అందిస్తూ వారి ఆర్థిక భరోసాకు చేయూత నిస్తున్నారు.  మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే ఆశయంతో వైఎస్సార్ చేయూతను తీసుకొచ్చి.. ఏటావారి అకౌంట్లో డీబీటీ ద్వారా డబ్బులు జమ చేస్తున్నారు. తాజాగా అనకపల్లి పర్యటనలో ఉన్న సీఎం జగన్..వైఎస్సార్ చేయూత నాలుగో విడత నిధులను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన కీలక ప్రసంగం చేశారు.

గురువారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అనకాపల్లి జిల్లాలో పర్యచింటారు. ఈ సందర్భంగా వైఎస్సార్ చేయుత నాలుగో విడత నిధులను బటన్ నొక్కి సీఎం జగన్ విడుదల చేశారు.  రాష్ట్ర వ్యాప్తంగా 45 నుంచి 60 ఏళ్ల మధ్య వయసు గల 26,98,931 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ,మైనార్టీ మహిళలకు ఈ పథకం కింద రూ.18,750 చొప్పున నగదు అందుకోనున్నారు.ఎస్సీ, ఎస్టీ,బీసీ మైనార్టీ కుటుంబాలు శాశ్వత జీవనోపాధి పొందేలా ప్రతి నెలా స్థిర ఆదాయం లభించేలా సీఎం జగన్ 2020 ఆగష్టు12 ఈ పథకాన్ని ప్రారంభించారు. ఇప్పటికే మూడు విడతల్లో ఈ  నిధులను మహిళలకు అందించగా..తాజాగా అనకాపల్లి పర్యటన సందర్భంగా నాలుగో విడుత నిధులను బటన్ నొక్కి విడుదల చేశారు.

ఇక ఈ సందర్భంగా పిసినికాడ ప్రాంతంలో ఏర్పాటు చేసిన సభలో సీఎం జగన్ కీలక ప్రసంగం చేశారు. ఆయన మాట్లాడుతూ..”మహిళా దినోత్సవం ముందు రోజు అక్కచెల్లెమ్మలకు ఆర్థిక సాయం చేయడం సంతోషంగా ఉంది. 58 నెలల పరిపాలనలో అక్కచెల్లెమ్మల ఆర్థిక సాధికారతే లక్ష్యంగా మన ప్రభుత్వం ముందడుగు వేసింది. మహిళల సాధికారతకు దేశంలో మరే రాష్ట్రం చేయని విధంగా  మన ప్రభుత్వం చేయూత అందించాం. ఈ వైఎస్సార్  చేయూత పథకం ద్వారా ప్రతీ మహిళకు ఆర్థిక స్వావలంబనం చేకూరింది. అక్క చెల్లెమ్మలకు ఆర్థిక బరోసా కల్పించినందుకు గర్వపడుతున్నాను. చేయూత ద్వారా అక్కచెల్లెమ్మలకు రూ.75 వేలు ఇస్తున్నాం. నామినేటెడ్ పోస్టుల్లోనూ మహిళా రిజర్వేషన్లు కల్పించాం. ఈ వైఎస్సార్ ఆసరాతో పొదుపు సంఘాలకు ఊపిరి పోశాం. మహిళల రక్షణ కోసం దిశా యాప్ తీసుకొచ్చాం. మేనిఫెస్టోలో చెప్పిన హామీలన్నింటినీ అమలు చేశాం. మన పాలనలో ఎన్ని నిధులు జమ అయ్యోయో గమనించండి” అని మహిళలను ఉద్దేశించి సీఎం జగన్ తెలిపారు.

ఇక ఇదే సభపై నుంచి టీడీపీ, జనసేన కూటమిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ పై  సీఎం జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “చంద్రబాబు పేరు చెబితే మోసాలు, వంచనలే గుర్తొస్తాయి. చంద్రబాబు పేరుచెబితే పొదుపు సంఘాలకు చేసిన దగా గుర్తొస్తుంది. దత్తపుడ్రుతికి పేరు చేబితే వివాహ వ్యవస్థకే మచ్చగా గుర్తొస్తాడు. కార్లను మార్చినట్లు భార్యలను మార్చేస్తాడు. వీరద్దరూ కలిసి 2014లో వాగ్ధానాలు ఇచ్చిన మోసం చేశారు. బ్యాంకుల్లో పెట్టిన బంగారం విడిపిస్తానంటూ దగా చేశారు” చంద్రబాబు పవన్ లపై సీఎం జగన్ నిప్పులు చెరిగారు. మరి.. అనకాపల్లి సభలో సీఎం చేసిన ప్రసంగంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి