iDreamPost

కరోనా వైరస్ కట్టడికి జగన్ సంచలనం నిర్ణయం

కరోనా వైరస్ కట్టడికి జగన్ సంచలనం నిర్ణయం

రాష్ట్రంలో కరోనా వైరస్‌ నియంత్రణపై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం సమీక్ష నిర్వహించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఈ సమావేశానికి పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కరోనా వ్యాప్తిని నివారించేలా పటిష్ట చర్యలు చేపట్టాలని సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు. ఈ క్రమంలో ప్రజలను ఆందోళనకు గురిచేయవద్దని సూచించారు. సీఎం వైఎస్‌ జగన్‌తో భేటీ అనంతరం విద్యాసంస్థలన్నింటికీ సెలవులు ఇవ్వాలని ఏపీ ప్రభుత్వ ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నారు.

దేశవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తూ ప్రమాద ఘంటికలు మోగిస్తున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. గురువారం నుండి ఏపీ లో విద్యాసంస్థలన్నింటిని మూసివేయాలని రాష్ట్ర ప్రభుత్వం తాజాగా తీసుకున్నా ఈ నిర్ణయంతో రాప్తినుండి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్నీ ప్రభుత్వ, ప్రయివేట్ స్కూళ్ళు , కాలేజీలు, యూనివర్సిటీలు, కోచింగ్ సెంటర్లు మూతపడనున్నాయి. అయితే 10 వ తరగతి పరీక్షలు మాత్రం నిర్ణిత షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని రాష్ట్రప్రభుత్వం ప్రకటించింది.

ఇందుకు సంబంధించి విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ మీడియాతో మాట్లాడుతూ గురువారం నుంచి రాష్ట్రంలోని విద్యా సంస్థలకు సెలవులు ఇస్తున్నట్టు తెలిపారు. పదవ తరగతి పరీక్షలు మాత్రం యథాతథంగా జరుగుతాయని అన్నారు. హాస్టల్‌లో ఉన్న విద్యార్థులందరిని ప్రత్యేక బస్సుల ద్వారా దగ్గరుండి ఇళ్లకు పంపిస్తామని, ఆర్టీసీ అధికారులతో మాట్లాడి విద్యార్థులను ఇళ్లకు చేర్చేదానికి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసేలా ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి తెలిపారు.

క్యాంపు ఆఫీస్ లో బుధవారం మధ్యాహ్నం వైద్య, ఆరోగ్య శాఖ అధికారులతో నిర్వహించిన అత్యున్నత స్థాయి రివ్యూ మీటింగు లో రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన నివారణ చర్యలపై వైద్యా ఆరోగ్య శాఖ అధికారులతో కూలంకుషంగా చర్చించడం జరిగింది. రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి ని అడ్డుకోవడానకి తక్షణమే అన్ని ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని, వైరస్ ని ఎదుర్కొనే అంశంలో ప్రజలకు సరైన అవగాహన కల్పించి, ప్రజల్లో నెలకొన్న భయాందోళనలను తొలగించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి