iDreamPost

యూపీ చరిత్రలో తొలిసారి.. అయోధ్యలో కేబినెట్ భేటీ!

ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో అరుదైన ఘటన చోటుచేసుకుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చొరవతో ఈ అపూర్వమైన ఘటన ఆవిష్కృతమైంది

ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో అరుదైన ఘటన చోటుచేసుకుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చొరవతో ఈ అపూర్వమైన ఘటన ఆవిష్కృతమైంది

యూపీ చరిత్రలో తొలిసారి.. అయోధ్యలో కేబినెట్ భేటీ!

ఉత్తర్ ప్రదేశ్ లో అరుదైన ఘటన చోటుచేసుకుంది.. ఆ రాష్ట్ర చరిత్రలోనే  మరపురాని ఘటన గురువారం చోటుచేసుకుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చొరవతో ఈ అపూర్వమైన ఘటన ఆవిష్కృతమైంది. సీఎం యోగి ఆదిత్యనాథ్ అధ్యక్షతన మంత్రి వర్గం ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అయోధ్యలో సమావేశం అయింది. సాధారణంగా యూపీ రాజధాని లఖ్నవూలో రాష్ట్ర కేబినేట్ భేటీలు జరుగుతుంటాయి. కానీ ఇలా అయోధ్యలో జరగడం రాష్ట్ర చరిత్రలోనే ఇదే ప్రథమం. రామ మందిర నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్న అయోధ్యలో యూపీ మంత్రివర్గం సమావేశమవడం ప్రాధాన్యం సంతరించుకుంది.

గురువారం ఉదయం అయోధ్యకు సీఎం యోగి ఆదిత్యనాథ్, ఇతర మంత్రులు చేరుకున్నారు. అక్కడ ముందుగా హనుమాన్‌ గర్హి ఆలయాన్ని  సీఎంతో సహా అందరు సందర్శించారు. అక్కడ ప్రత్యేక పూజలు కూడా చేశారు. అనంతరం అక్కడే ఉన్న రామ్‌లల్లా ఆలయాన్ని కూడా యోగి ఆదిత్యనాథ్ దర్శించుకున్నారు. ఆ తర్వాత శ్రీ రామజన్మభూమి మందిర నిర్మాణం జరుగుతున్న స్థలానికి చేరుకున్నారు. అక్కడ జరుగుతున్న రామ మందిర నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం రామకథ మ్యూజియంలో ఉత్తర్‌ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలో ఆ రాష్ట్ర మంత్రి వర్గ భేటీ నిర్వహించారు. అయితే ఈ కేబినేట్ సమావేశంలో కీలక ప్రకటనలు వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

కాగా.. నవంబరు 9న అయోధ్యలో కేబినెట్‌ సమావేశం నిర్వహించడానికి మరో ప్రత్యేకత కూడా ఉందని ఉత్తర్ ప్రదేశ్ బీజేపీ  వర్గాలు చెబుతున్నాయి. 1989లో సరిగ్గా ఇదే రోజున అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి విశ్వ హిందూ పరిషత్‌ శంకుస్థాపన చేసినట్లు తెలిపాయి. అదేవిధంగా 2019 నవంబరు 9న బాబ్రీ మసీదు-రామ జన్మభూమి కేసులో సుప్రీంకోర్టు చారిత్రక తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. ఈ తీర్పుతోనే అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి మార్గం సుగమమైంది. రాష్ట కేబినేట్ భేటీ నేపథ్యంలో అయోధ్యలో భారీగా భద్రతను ఏర్పాటు చేశారు. అడుగడున పోలీసులతో భద్రతను కట్టుదిట్టం చేశారు. నగరమంతటా ఏటీఎస్‌ బృందాలు మోహరించారు. ఇదిలా ఉండగా..గతంలో 2019లోనూ యోగి ప్రభుత్వం లఖ్‌నవూలో కాకుండా ప్రయాగ్‌రాజ్‌లో మంత్రివర్గ సమవేశం నిర్వహించింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి