iDreamPost

Telangana: రైతు భరోసాపై CM రేవంత్ రెడ్డి కీలక ప్రకటన! ఇక నుంచి..

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలన 100 రోజులు పూర్తి అయిన సందర్భంగా ఆదివారం మీట్ ది మీడియా అనే ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి రైతు భరోసా గురించి కీలక ప్రకటన చేశారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలన 100 రోజులు పూర్తి అయిన సందర్భంగా ఆదివారం మీట్ ది మీడియా అనే ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి రైతు భరోసా గురించి కీలక ప్రకటన చేశారు.

Telangana: రైతు భరోసాపై CM రేవంత్ రెడ్డి కీలక ప్రకటన! ఇక నుంచి..

రైతు భరోసాపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలన 100 రోజులు పూర్తి అయిన సందర్భంగా ఆదివారం మీట్ ది మీడియా అనే ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆయన రైతు భరోసా గురించి కీలక ప్రకటన చేశారు. దాంతో పాటుగా బీఆర్ఎస్ పార్టీపై, మాజీ సీఎం కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు. తెలంగాణ కేసీఆర్ పాలనలో నిర్భందానికి గురైందని సీఎం రేవంత్ దుయ్యబట్టారు.

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆదివారం మీట్ ది మీడియా అనే ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి రైతు భరోసాపై కీలక ప్రకటన చేశారు. సీఎం రేవంత్ మాట్లాడుతూ..”భవిష్యత్ లో రైతు భరోసా గుట్టలు, చెట్లు, లే ఔట్లకు ఇవ్వడం కుదరదు. ఇదంతా గత ప్రభుత్వంలో సాగుబాటు అయ్యింది. కానీ భవిష్యత్ లో నడవదు. ఇప్పటి వరకు 5 ఎకరాలలోపు ఉన్న దాదాపు 62 లక్షల మంది రైతులకు ఈ పథకం ద్వారా లబ్దిచేకూరింది. అయితే రైతు భరోసా అందనివారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. త్వరలోనే అర్హులైన వారందరికీ అందేలా చూస్తాం. తాము అధికారంలోకి వచ్చాక వంద రోజుల్లో ప్రజాపాలన అందించాం. ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వస్తున్నాం” అని సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు.

ఈ కార్యక్రమంలో భాగంగా మాజీ సీఎం కేసీఆర్ ను తీవ్రంగా విమర్శించారు. అభివృద్ధి, సంక్షేమం పేరుతో కేసీఆర్ రాచరిక పాలన చేశారని, దీంతో తెలంగాణ నిర్భంధానికి గురైందని సీఎం రేవంత్ దుయ్యబట్టారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఒక్కో గ్యారంటీని అమలు చేసుకుంటూ వస్తున్నమని రేవంత్ తెలిపారు. ఇప్పటి వరకు ఉచిత బస్సు ప్రయాణం ద్వారా 26 కోట్ల మంది మహిళలు ప్రయాణం చేశారని, 8 లక్షల కుటుంబాలు రూ. 500 కే సిలిండర్ అందుకున్నారని, 42 లక్షల కుటుంబాలు 200 యూనిట్ల విద్యుత్ పథకాన్ని పొందాయని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

ఇదికూడా చదవండి: HYD జూలో 125 ఏళ్ల వయసున్న గాలాపాగోస్ తాబేలు మృతి

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి