iDreamPost

కల్నల్‌ సంతోష్‌ కుంటుబానికి పరిహారం.. వివేకం చూపిన సీఎం కేసీఆర్‌

కల్నల్‌ సంతోష్‌ కుంటుబానికి పరిహారం.. వివేకం చూపిన సీఎం కేసీఆర్‌

దేశ సరిహద్దుల్లో చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో వీర మరణం పొందిన సూర్యాపేటకు చెందని కల్నల్‌ సంతోష్‌ కుటుంబాన్ని తెలంగాణ సీఎం కేసీఆర్‌ కొద్దిసేపటి క్రితం పరామర్శించారు. హైదరాబాద్‌ నుంచి సూర్యపేటలోని సంతోష్‌ ఇంటికి వెళ్లిన కేసీఆర్‌.. మొదట సంతోష్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం సంతోష్‌ భార్య సంతోషి, తల్లిదండ్రులు, పిల్లలతో మాట్లాడి ధైర్యం చెప్పారు. ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

ముందుగా ప్రకటించినట్లు సీఎం కేసీఆర్‌.. సంతోష్‌ భార్యకు గ్రూప్‌–1 ఉద్యోగం ఇచ్చారు. ఇందుకు సంబంధించిన నియామక పత్రాన్ని ఆమెకు అందించారు. హైదరాబాద్‌లో అత్యంత ఖరీదైన ప్రాంతమైన జూబ్లిహిల్స్‌లో 711 గజాల ఇంటి స్థలానికి సంబంధించిన పత్రాలు ఇచ్చారు. ఐదు కోట్ల రూపాయల నగదు ఇవ్వడంలో సీఎం కేసీఆర్‌ తన వివేకాన్ని చూపారు. 5 కోట్ల రూపాయలను రెండుగా విభజించారు. రూ.4 కోట్ల రూపాయలు సంతోష్‌ భార్యకు, కోటి రూపాయలు ఆయన తల్లిదండ్రులకు ఇచ్చేలా రెండు చెక్‌లను సిద్ధం చేశారు. భార్యకు నాలుగు కోట్ల రూపాయల చెక్, తల్లిదండ్రులకు కోటి రూపాయల చెక్‌ను అందజేశారు.

కాగా, కల్నల్‌ సంతోష్‌ పోరాటం అసమానమని మంత్రి జగదీశ్‌రెడ్డి కొనియాడారు. దేశ సేవలో ఆయన వీరమరణం అందరికీ స్పూర్తినిస్తోందన్నారు. సంతోష్‌బాబు క్యాంస విగ్రహాన్ని సూర్యపేట సర్కిల్‌లో ఏర్పాటు చేస్తామని తెలిపారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి