iDreamPost

జనంలోకి KCR.. 16 రోజుల షెడ్యూల్‌ ఖారారు!

జనంలోకి KCR.. 16 రోజుల షెడ్యూల్‌ ఖారారు!

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. రాష్ట్రంలో శాసన సభ ఎన్నికల షెడ్యూల్ ని కేంద్ర ఎన్నికల సంఘం రిలీజ్ చేసింది. తెలంగాణలో నవంబర్ 3న ఎన్నికల నోటిఫికేషన్ విడుద కానున్నట్లు తెలిపారు. నవంబర్ 30న ఎన్నికలు, డిసెంబర్ 3న కౌంటింగ్ నిర్వహించనున్నట్లు సీఈసీ వెల్లడించిన విషయం తెలిసిందే. తెలంగాణలో ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇక ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ కావడంతో తెలంగాణలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కిపోయాయి. ప్రధాన పార్టీ నేతల్లో గుబులు మొదలైంది. ఈ క్రమంలోనే అధికార, ప్రతిపక్ష నేతలు తమ వ్యూహాలతో ప్రజల్లోకి వెళ్తున్నారు. ముచ్చటగా మూడోసారి అధికారం చేపట్టాలని బీఆర్ఎస్ గట్టి పట్టుమీదే ఉంది. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. వివరాల్లోకి వెళితే..

తెలంగాణ లో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో అన్ని పార్టీలు ప్రచార పర్వానికి సిద్దం అవుతున్నారు. ఇప్పటికే అధికార పార్టీ బీఆర్ఎస్ అన్ని పార్టీల కంటే ముందుగానే అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక మిగిలింది ప్రజల్లోకి వెళ్లి ప్రచారం చేయడమే. ఈ నేపథ్యంలో తెలంగాణలో మూడోసారి అధికార పగ్గాలు చేపట్టేందుకు బీఆర్ఎస్ నేత, సీఎం కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగుతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజల్లోకి వెళ్లి తొమ్మిదేళ్లలో తాము చేపట్టిన అభివృద్ది సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించే ప్రయత్నం చేయబోతున్నట్లు తెలుస్తుంది. టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ గా పార్టీ ఎందుకు మారింది.. రాష్ట్రాన్ని బంగారు తెలంగాణా ఎలా మార్చబోతున్నారు అన్న విషయాల గురించి ప్రజలకు స్వయంగా తెలపబోతున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచారానికి సంబంధించిన షెడ్యూల్ ఖరారైంది.

ఈ నెల 15 నుంచి నవంబర్ 8 వరకు కేసీఆర్ ప్రచారానికి సంబంధించిన షెడ్యూల్ ఫిక్స్ అయ్యింది. ఆయన మొదటి ప్రచారం హుస్నాబాద్ నుంచి మొదలు అవుతుందని పార్టీ శ్రేణులు అంటున్నారు. నవంబర్ 9న గజ్వేల్, కామారెడ్డి లో నామినేషన్ దాఖలు చేయబోతున్నట్లు సమాచారం. నామినేషన్ అనంతరం కామారెడ్డిలో భారీ బహిరంగ సభలో పాల్గొని మాట్లాడుతారు. ఇదిల ఉంటే కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించిన రోజు నుంచే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఇదిలా ఉంటే ఇప్పటి వరకు బీజేపీ, కాంగ్రెస్ లు అభ్యర్థులను ఖారారు చేయకపోవడం గమనార్హం. ఇఖ 2024 జనవరి 16న రాష్ట్ర అసెంబ్లీ గడువు ముగియనుంది. ఈ క్రమంలోనే తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని సీఈసీ నిర్ణయించింది.

సీఎం కేసీఆర్‌ ప్రచార షెడ్యూల్‌ ఇదీ.. అక్టోబర్‌ 15 హుస్నాబాద్‌, అక్టోబర్‌ 16 జనగాం, భువనగిరి, అక్టోబర్‌ 17 సిరిసిల్ల, సిద్దిపేట, అక్టోబర్‌ 18 జడ్చర్ల, మేడ్చల్‌, అక్టోబర్‌ 26 అచ్చంపేట, మునుగోడు, నాగర్‌ కర్నూలు,  అక్టోబర్‌ 27 పాలేరు, స్టేషన్‌ ఘన్‌పూర్, అక్టోబర్‌ 29 కోదాడ, ఆలేరు, తుంగతుర్తి, అక్టోబర్‌ 30 జుక్కల్‌, నారాయణ్‌ఖేడ్‌, బాన్సువాడ,  అక్టోబర్‌ 31 హుజూర్‌నగర్‌, దేవరకొండ, మిర్యాలగూడ, నవంబర్‌ 01 ఇల్లెందు, సత్తుపల్లి, నవంబర్‌ 02 నిర్మల్‌, ధర్మపురి, బాల్కొండ, నవంబర్‌ 03 భైంసా(ముధోల్‌), కోరుట్ల, ఆర్మూర్‌, నవంబర్‌ 05 కొత్తగూడెం, ఖమ్మం. నవంబర్‌ 06 గద్వాల్‌,  నారాయణపేట, మఖ్తల్‌, నవంబర్‌ 07 చెన్నూరు, మంథని, పెద్దపల్లి, నవంబర్‌ 08 సిర్పూర్‌, ఆసిఫాబాద్‌, బెల్లంపల్లి, నవంబర్ 9 గజ్వేల్, కామారెడ్డి నిర్విరామ ప్రచారం కొనసాగించేందుకు సిద్దమయ్యారు ముఖ్యమంత్రి కేసీఆర్.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి