iDreamPost

గ్రామాల్లో కార్యకర్తలు లేరు.. నియోజక వర్గాల్లో నాయకులు లేరు.. పవన్‌పై CM జగన్ సెటైర్లు

గ్రామాల్లో కార్యకర్తలు లేరు.. నియోజక వర్గాల్లో నాయకులు లేరు.. పవన్‌పై CM జగన్ సెటైర్లు

ఆంధ్రప్రదేశ్ లో మరికొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న వేళ రాజకీయం మరింత వేడెక్కుతోంది. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ప్రధాన రాజకీయ పార్టీల మధ్య యుద్ధవాతావరణం కనిపిస్తోంది. వినూత్నమైన సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి పేదల జీవితాల్లో వెలుగులు నింపిన సీఎం జగన్ 175కు 175 స్థానాలను గెలుచుకుని మరోసారి విజయదుందుభి మోగించేందుకు సన్నద్ధమవుతున్నారు. చేసిన మంచి పనులే మనకు ధైర్యం అంటూ వైనాట్ 175 అంటూ ప్రజల్లోకి వెళ్తేన్నారు. కాగా వైఎస్సార్సీపీ ప్రతినిధుల సభలో మాట్లాడిన సీఎం జగన్ బాబు దత్తపుత్రుడు పవన్ పై సెటైర్లు వేశారు. పొలిటికల్ పొత్తులపై పంచులు వేశారు.

స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో చంద్రబాబు నాయుడు అరెస్టై రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే. కాగా బాబుకు మద్దతు తెలిపేందుకు జైల్లో ములాఖత్ అయిన పవన్ కళ్యాన్ అనంతరం రాబోయే ఎన్నికల్లో టీడీపీ, జనసేనా కలిసే పోటీచేస్తాయని అధికారికంగా ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే నేడు వైసీపీ ప్రతినిధుల సభలో మాట్లాడిన సీఎం జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల పొత్తులు, పవన్ కళ్యాణ్ పై సెటైర్లు వేస్తూ పంచులు విసిరారు.

రెండు సున్నాలు కలిసినా, నాలుగు సున్నాలు కలిసినా వచ్చేది సున్నానే అంటూ సీఎం జగన్ ఎద్దేవా చేశారు. ప్యాకేజీ స్టార్ పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టి 15 ఏళ్లు అవుతోందని, ఇప్పటికీ గ్రామాల్లో జెండా మోసే కార్యకర్తలు లేరు.. నియోజక వర్గాల్లో పోటీచేసేందుకు నాయకులు లేరంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పవన్ జీవితమంతా చంద్రబాబును భుజాలపై మోయటానికే సరిపోతుందంటూ దుయ్యబట్టారు. చంద్రబాబు భజన చేశారు. బాబు, పవన్ ఆలోచన అంతా మోసాలపైనే ఉంటుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబును చూస్తే.. వెన్నుపోట్లు, మోసాలు, వంచనలు కనిపిస్తాయంటూ వ్యాఖ్యానించారు. బాబు మోసాల్లో పవన్ భాగస్వామయ్యాడంటూ సీఎం జగన్ తెలిపారు. రాజకీయం అంటే చనిపోయిన తర్వాత కూడా బతికుండడం అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం జగన్.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి