iDreamPost

త్వరలో ‘జగనన్న చేదోడు’ పధకం ప్రారంభం

త్వరలో ‘జగనన్న చేదోడు’ పధకం ప్రారంభం

ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్నా ప్రజలకు అందించే సంక్షేమ పథకాల విషయంలో మాత్రం వెనకడుగు వేయడంలేదు. ముఖ్యమంత్రి జగన్ తాను ప్రజా సంకల్ప యాత్రలో ఇచ్చిన హామీ ప్రకారం రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల వారికి ఆర్ధిక భరోసా అందించే లక్ష్యంతో ఇప్పటికే అనేక మందికి వివిద పధకాల ద్వారా నేరుగా లబ్ది చేకూర్చారు. అయితే ఇప్పుడు తాజాగా తాను మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు మరో పధకాన్ని అమలు చేసేందుకు రంగం సిద్దం చేసినట్టు తెలుస్తుంది.

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నాయీ బ్రహ్మణులకు, టైలర్లకు, రజకులకు ప్రతీ ఏడాది రూ. 10వేల చొప్పున ఐదేళ్లపాటు ఆర్థిక సాయం అందించాలనే ఉద్దేశ్యంతో రూపకల్పన చేసిన ‘జగనన్న చేదోడు’ కార్యక్రమాన్ని త్వరలో ప్రారంభించబోతునట్టు తెలుస్తుంది. ఇప్పటికే ఈ మేరకు బి.సి కార్పొరేషన్ ఏర్పాట్లు పూర్తిచేసింది. ఈ పధకానికి అర్హులుగా రాష్ట్రవ్యాప్తంగా 2,50,015 మందిని గుర్తించినట్టు, ఈ అర్హుల జాబితాని గ్రామవార్డు సచివాలయాల్లో ప్రదర్శించి అభ్యంతరాలను పరిశీలించి తుది జాబితాను విడుదల చేసే విధంగా చర్యలు తీసుకునట్టు తెలుస్తుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి