iDreamPost

ఏడాది పాలనపై ప్రమాణం చేసిన సీఎం జగన్‌

ఏడాది పాలనపై ప్రమాణం చేసిన సీఎం జగన్‌

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి తన ఏడాది పాలన సందర్భంగా ప్రమాణం చేశారు. గత ఏడాది ఇదే రోజు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన సీఎం జగన్‌ ఎన్నికల మేనిఫెస్టోను 100 శాతం అమలు చేస్తామని ప్రమాణం చేశారు. ఈ నేపథ్యంలో గడచిన ఏడాదిలో అనేక పథకాల ద్వారా మేనిఫెస్టోలోని దాదాపు 90 శాతం హామీలు అమలు చేశామని సీఎం వైఎస్‌ జగన్‌ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన హామీల అమలుపై కూడా ప్రమాణం చేశారు.

‘‘అవ్వాతాతల పట్ల ప్రేమ, రైతుల పట్ల బాధ్యత, అట్టడుగువర్గాల పట్ల అభిమానంతో, మీ పిల్లల భవిష్యత్‌ పట్ల దూరదృష్టితో, మీ అందరి ఆరోగ్యం పట్ల శ్రద్ధతో మీరు ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించి 6 కోట్ల ప్రజల సంక్షేమం పట్ల నిర్ణయాలు తీసుకున్నానని వైఎస్‌ జగన్‌ అనే నేను.. ఏడాది కాలంగా మీ కుటుంబ సభ్యుడిగా, మీ ముఖ్యమంత్రిగా నేను ఇచ్చిన మాటను, చేసిన ప్రమాణాన్ని తప్పకుండా అమలు చేస్తున్నానని దైవసాక్షిగా, ప్రజల సాక్షిగా మరోసారి స్పష్టం చేస్తున్నాను’’ అని సీఎం జగన్‌ అన్నారు.

తన మేనిఫెస్టో సీఎం కార్యాలయం నుంచి మంత్రులు, జిల్లా కలెక్టర్‌ కార్యాలయాలు, ప్రతి ప్రభుత్వ కార్యాలయాల్లోనూ ఉంటుందని చెప్పారు. తాను భావించినట్లే మేనిఫెస్టోను బైబిల్‌గా, ఖురాన్‌గా, భగవద్గీతగా అందరూ భావిస్తున్నారని తెలిపారు. ఐదేళ్ల కాలానికి మెనిఫెస్టో ప్రకటిస్తే.. ఏడాదిలోనే 90 శాతం హామీలను అమలు చేశామని చెప్పారు. ఏడాదిలోనే పథకాల ద్వారా నేరుగా 3.58 కోట్ల మందికి లబ్ధి చేకూర్చామని చెప్పారు. అవినీతి లేకుండా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి 40,627 కోట్ల రూపాయలు అందించామని సీఎం జగన్‌ గర్వంగా చెప్పారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి