iDreamPost

ప్రధాని మోదీ కి సీఎం జగన్ లేఖ.. ఎందుకంటే..?

ప్రధాని మోదీ కి సీఎం జగన్ లేఖ.. ఎందుకంటే..?

కరోనా వైరస్ కట్టడికి విధించిన లాక్ డౌన్ వల్ల కార్యకలాపాలు పూర్తిగా స్తంభించడంతో తలెత్తిన ఆర్థిక ఇబ్బందుల నుంచి ఆదుకోవాలంటూ ప్రధాని నరేంద్ర మోడీ కి సీఎం జగన్ మోహన్ రెడ్డి లేఖ రాశారు. వివిధ అంశాలపై సవివరంగా పది పేజీల 10 పేజీల లేఖను సీఎం జగన్ ప్రధానికి రాశారు. ఆర్థిక రంగానికి ఊతం ఇచ్చేలా పారిశ్రామిక రంగాన్ని ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు రాయితీలు ఇవ్వాలని కోరారు. ఏపీలో పారిశ్రామికోత్పత్తి 72, 523 కోట్ల రూపాయలు ఉందని రాష్ట్ర స్థూల విలువ 11.3 శాతం లేఖలో వివరించారు.

ఏపీ ఫార్మసీ ఇంజనీరింగ్ ఉత్పత్తులు, ఎలక్ట్రానిక్ పరికరాలు చేనేత వస్త్ర పరిశ్రమ లో కీలక భూమిక పోషిస్తున్నాయని సీఎం జగన్మోహన్ రెడ్డి ఆ లేఖలో వివరించారు. 2018 -19 ఆర్థిక సంవత్సరంలో ఏపీ నుంచి 98,983 వేల కోట్ల రూపాయల ఎగుమతులు జరిగాయని, నిర్వహణ ఖర్చులు వర్కింగ్ క్యాపిటల్ విషయంలో సహాయం చేయాలని కోరారు.

వస్త్ర పరిశ్రమకు సంబంధించి బ్యాంకు వడ్డీలను తగ్గించాలని సీఎం జగన్ కోరారు. కాటన్ ఫ్యాబ్రిక్స్ కు సంబంధించి కేంద్ర పన్నుల్లో రిబేట్ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. చెల్లించాల్సిన రుణ వాయిదాలను మరో మూడు నెలలు నిలిపివేయాలని కోరారు. ప్రభుత్వం నుంచి రుణ అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఎంఎస్ఎంఈల బకాయిలను తక్షణం చెల్లించేందుకు అవకాశం కల్పించాలని కోరారు. విద్యుత్ చార్జీలను మాఫీ చేయాలని కోరారు.

ప్రధానితో ఇటీవల జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో కూడా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు తమ రాష్ట్రాలను ఆర్థికంగా ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. పారిశ్రామికంగా పలు రాయితీలు ఇవ్వాలని కోరారు. ఇలాంటి నేపథ్యంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పది పేజీల లేఖ రాయడం విశేషం. ఈ అంశంపై ప్రధాని నరేంద్ర మోడీ ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి