iDreamPost

బాబు 650 హామిలిచ్చి.. 10 కూడా నెరవేర్చలేదు: CM జగన్

YS Jagan, Ongole: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 'నవరత్నాలు-పేదలకు ఇళ్లు' అనే కార్యక్రమంలో భాగంగా ఒంగోలులో పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం జగన్..చంద్రబాబుపై హాట్ కామెంట్స్ చేశారు.

YS Jagan, Ongole: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 'నవరత్నాలు-పేదలకు ఇళ్లు' అనే కార్యక్రమంలో భాగంగా ఒంగోలులో పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం జగన్..చంద్రబాబుపై హాట్ కామెంట్స్ చేశారు.

బాబు 650 హామిలిచ్చి.. 10 కూడా నెరవేర్చలేదు: CM జగన్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజల సంక్షేమం కోసం ఎంతో కృషి చేస్తున్నారు. ముఖ్యంగా పేదల సొంతిటి కలను నెరవేరుస్తూ..31.19 లక్షల ఇళ్ల పట్టాలను సీఎం జగన్ అందించారు. తాజాగా జగన్ మోహన్ రెడ్డి సర్కార్  మరో చారిత్రాత్మక ఘట్టానికి శ్రీకారం చుట్టింది. దేశంలోనే తొలిసారి పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలపై సర్వహక్కులు కల్పించింది. శుక్రవారం సీఎం జగన్ మోహన్ రెడ్డి ఒంగోలులో పర్యటించారు. ‘నవరత్నాలు-పేదలకు ఇళ్లు’ అనే కార్యక్రమంలో పాల్గొన్న ఆయన. 21,840 మంది మహిళలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో చంద్రబాబుపై సీఎం జగన్ ఫైర్ అయ్యారు.

ఒంగోలు సభలో సీఎం జగన్ మాట్లాడుతూ.. “దేశ చరిత్రలోనే ఇది ఓ చారిత్రాత్మక ఘట్టం. ఇప్పటికే ఎంతో మందికి అక్కచెల్లెమ్మలకు ఇళ్ల పట్టాలు పంపీణీ చేశాం. ఇప్పుడు ఒంగోలులోఈ  20 వేలమంది అక్కచెల్లమ్మకు నేడు అందిస్తున్నాం. మన ప్రభుత్వం మహిళలకు, పేదల అభివృద్ధి కోసం కృష్టి చేస్తుంది. మన ప్రభుత్వంలో అక్క చెల్లెమ్మల ఆర్థిక సాధికారత పెరిగింది. అక్కచెల్లెమ్మల కోసం అనేక సంక్షేమా, అభివృద్ధి పథకాలు తెచ్చాము. మన ప్రభుత్వంలో అక్కచెల్లెమ్మల ఆర్థిక సాధికారత పెరిగింది. డీబీడీ ద్వారా ఏకంగా 2.55 కోట్ల రూపాయలు నేరుగా లబ్ధిదారులకు అందించాము. అలానే ఈ డబ్బులు 75 శాతం ఈ పేద వర్గాలకు అందించగలిగాము. అదే విధంగా నామినేటేడ్ పోస్టుల విషయంలోనూ మన ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల పెద్ద పీట వేసింది. గతంలో ఎప్పుడు జరగని విధంగా, నామినేటేడ్ పదవులను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల వారికి ఇచ్చాము.

అదే గతంలో  పెత్తందారులు మాత్రమే నామినేటెడ్ పదవులు అనుభవించేవారు. చంద్రబాబు తన హాయంలో పేదలకు సెంటు స్థలం కూడా ఇవ్వలేదు.  మన ప్రభుత్వం పేదలకు ఇళ్లు ఇస్తుంటే కోర్టులకెళ్లి అడ్డుకుంటున్నాడు. ఇళ్ల  పట్టాల పంపిణీ చేస్తుంటే 1191 కేసులు వేయించాడు. అమరావతిలో ఇళ్ల పట్టాలు ఇస్తే..కులాల మధ్య సమతుల్యత దెబ్బతింటుందన్నారు. చంద్రబాబు కుట్రలు అధిగమించి ఇళ్ల పట్టాలు పంపిణీ చేశాం. చంద్రబాబు లాంటి వారితో రాజకీయాలు భ్రష్టు పట్టాయి. ఇక చంద్రబాబు దుర్మార్గం ఎంత ఎక్కువ అంటే వంద సినిమాల్లో ఉండే విలన్ల దుర్మార్గం కంటే ఎక్కువైంది.  మనం సిద్ధం అంటుంటే.. చంద్రబాబు సతీమణి సిద్ధంగా లేం అంటున్నారు.

కుప్పం నుంచే బైబై బాబు అంటున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలోనే కాదు కుప్పం ప్రజలు కూడా చంద్రబాబును నమ్మట్లేదు. చంద్రబాబు 650 హామిలిచ్చి..10 కూడా నెరవేర్చలేదు. నిస్సిగ్గుగా ఇప్పుడు కొత్త మేనిఫోస్టోతో మీ ముందుకు వస్తున్నాడు. గెలవడం కోసం ఎన్ని అబద్ధాలు ఆడటానికైన చంద్రబాబు ఆలోచించరు. చంద్రబాబు ఓ రాజకీయ రాక్షసుడు. ఆయనలా నాన్ రెసిడెంట్ ఆంధ్రాస్ మద్దతు నాకు అవసరం లేదు. ఆయన మాదిరి దళారులను, బ్రోకర్లను నేను నమ్ముకోలేదు. నేను నమ్ముకుంది దేవుడిని, రాష్ట్ర ప్రజల్ని. నా స్టార్ క్యాంపెయినర్లు మీరే.  మీ ఇంట్లో మంచి జరిగితే మీ బిడ్డకు తోడుగా నిలబడండి” అని ప్రజలను ఉద్దేశించి సీఎం జగన్ ప్రసంగించారు. మరి..చంద్రబాబుపై సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి