iDreamPost

మార్ఫింగ్‌ ఫలితం.. దేవినేని ఉమాకు సీఐడీ తాఖీదులు

మార్ఫింగ్‌ ఫలితం.. దేవినేని ఉమాకు సీఐడీ తాఖీదులు

చేసుకున్నవాడికి చేసుకున్నంత.. చిక్కులు కొని తెచ్చుకోవడం.. ఈ మాటలు మాజీ మంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావుకు అతికినట్లు సరిపోతున్నాయి. ప్రభుత్వ నిర్ణయాలలో లోపాలు ఉంటే విమర్శలు చేయడం, పాలకులు అక్రమాలు, అవినీతికి పాల్పడితే ఆరోపణలు చేయడం ప్రతిపక్షాల బాధ్యత. కానీ పనిగట్టుకుని, ప్రభుత్వాన్ని, ప్రభుత్వ అధినేతను అప్రదిష్టపాలుచేయాలని ప్రయత్నిస్తే.. చిక్కులు తప్పవు. ఇప్పుడు దేవినేని ఉమా కూడా ఇలాంటి చిక్కులనే కొని తెచ్చుకున్నారు.

సీఎం వైఎస్‌ జగన్‌ అన్నారంటూ.. ఓ వీడియోను ఈ నెల7వ తేదీన తిరుపతిలో దేవినేని ఉమా మీడియా ముందు బయట పెట్టారు. ఇప్పుడు అదే దేవినేని మెడకు చుట్టుకుంది. ఏదో పరిపాటిగా ఆరోపణలు చేసి పాలకులపై బురదజల్లితే వారే కడుక్కుంటారులే అనుకున్న దేవినేనికి.. ఊహించని షాక్‌ తగలింది. జగన్‌ మాట్లాడారంటూ… చూపిన వీడియో మార్ఫింగ్‌ అంటూ ఏపీ ఫ్యాక్ట్‌ చెక్‌ ఆ వెంటనే బయటపెట్టింది. దేవినేని ఉమా చేసిన తప్పిదం బటయపడింది. దీనిపై ఓ న్యాయవాది సీఐడీ అధికారులకు ఫిర్యాదు చేశారు.

న్యాయవాది ఫిర్యాదు మేరకు ప్రాథమిక విచారణ చేసిన సీఐడీ నేరం జరిగిందని నిర్థారించుకున్న తర్వాత దేవినేని ఉమాపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసింది. విచారణకు హాజరుకావాలని ఈ రోజు నోటీ సులు జారీ చేసింది. కర్నూలులోని సీఐడీ ప్రాంతీయ కార్యాలయానికి రావాలని ఆ నోటీసుల్లో పేర్కొంది. మీడియా సమావేశంలో ప్రదర్శించిన వీడియోలను కూడా తీసుకురావాలని స్పష్టం చేసింది.

ప్రస్తుతం తిరుపతి లోక్‌షభ ఉప ఎన్నికల ప్రచారంలో దేవినేని ఉన్నారు. నెల్లూరు జిల్లాలో ఆయన ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ సమయంలో దేవినేనికి సీఐడీ నోటీసులు జారీ చేసింది. ఈ పరిణామంపై టీడీపీ అధినేత చంద్రబాబు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌లు ఎలా స్పందిస్తారు..? అన్న అంశంపై ఆసక్తి నెలకొంది. ఎప్పటిలాగే తమ పార్టీ నేతలను వైసీపీ ప్రభుత్వం వేధిస్తుంది..? అక్రమ కేసులు పెడుతోంది..?అంటూ పాత పాటే పాడుతారా..? లేక మౌనంగా ఉంటారా..? చూడాలి.

Also Read : అచ్చెన్న మీద చర్యలు తీసుకుంటారా ?

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి