iDreamPost

ఆ లేఖ బయటే తయారైంది…!!నిమ్మగడ్డ రాసిన లేఖపై సీఐడీ క్లారిటీ

ఆ లేఖ బయటే తయారైంది…!!నిమ్మగడ్డ రాసిన లేఖపై సీఐడీ క్లారిటీ

తనకు వ్యక్తిగత రక్షణ కల్పించాలంటూ రాష్ట్ర మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కేంద్రానికి రాసిన లేఖ ఆయన ఆఫీసులో రాసింది కాదని,బయట వేరేవారు ఏఆసిన లేఖ మీద ఆయన సంతకం చేసారని తేలింది. ఈ విషయం మీద కొంతకాలంగా చర్చ నడుస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆ లేఖలో న్న సంతకం తేడాగా ఉండడంతో దానిమీద విచారణకు ఏపీ సర్కారు అదేశించగా సీఐడీ విభాగపు అదనపు డీజీ సునీల్ కుమార్ దర్యాప్తు మొదలెట్టారు. లేఖ అనుపానులు చూడాలని ఫోరెన్సిక్ విభాగాన్ని కోరగా వారు ఈరోజు నివేదిక ఇచ్చారు.

ఫోరెన్సిక్ నివేదిక ప్రకారం ఈ లేఖ ఎన్నికల కమిషన్ కార్యాలయంలో తయారు కాలేదని సునీల్ కుమార్ వివరించారు. నిమ్మగడ్డ మాజీ పిఎ సాంబమూర్తి తన వాంగ్మూలంలో అన్నీ అసత్యాలే చెప్పారని కూడా ఆయన వెల్లడించారు. ఎన్నికల కమిషనర్ తనకు లేఖను డిక్టేట్ చేశారని,పెన్ డ్రైవ్ ఇచ్చారని చెప్పారని, కాని కమిషన్ ఆఫీస్ లో ఉన్న లాప్ టాప్ లో కాని, డెస్క్ టాప్ లో కాని ఈ లేఖ తయారుచేసిన ఆధారాలు లేవని, బయట తయారైన లేఖ పెన్ డ్రైవ్ ద్వారా మాజీ ఎన్నికల కమిషనర్ కు చేరిందని వెల్లడించారు.

వచ్చిన లేఖ ఎక్కడ రూపొందిందన్న దానిపై విచారణ చేస్తున్నామని ఆయన అన్నారు.రహస్య లేఖ అయితే ఎలా బయటకు వచ్చిందన్నదానికి కూడా సమాధానం రావల్సి ఉందని ఆయన అన్నారు. సాంబమూర్తి పరిపరి విధాలుగా సమాధానాలు ఇస్తున్నారని అన్నారు. వాస్తవానికి ఆ లేఖ ఎక్కడ తయారైంది, ఎవరు రాశారు అన్నదాని మీద దర్యాప్తు ముమ్మరం చేస్తున్నామన్నారు..

మొత్తానికి ఈ వ్యవహారంలో నడిచేది రమేష్ కుమారే అయినప్పటికీ నడిపించేది వేరే ఎవరో ఉన్నారన్న విషయం స్పష్టమయింది ఇక సీఐడీ విచారణ ముమ్మరం అయితే ఎవరు దొరుకుతారో చూడాలి..

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి