iDreamPost

చిత్తూరు డెయిరీ ప్రారంభోత్సవ సభలో సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు!

చిత్తూరు డెయిరీ ప్రారంభోత్సవ సభలో సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు!

రెండు  దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న ఏపీ పాడి రైతులకు శుభ గడియా రానేవచ్చింది. దేశంలోనే రెండో అతి పెద్దదైన చిత్తూరు డెయిరీ పునరుద్దరణ ఏర్పాట్లు పూర్తయ్యాయి. రూ.385 కోట్లతో చేపడుతున్న ఈ పునరుద్ధరణ పనులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం భూమి పూజ చేశారు. దీని ద్వారా ఎన్నికల ముందు పాదయాత్రలో ఇచ్చిన మరో కీలకమైన హామీ ఆచరణకు నోచుకోబోతుంది. పాలవెలువ లో భాగంగా చిత్తూరు డెయిరీ వద్ద అమూల్ ప్రాజెక్ట్ కు సీఎం జగన్ భూమి పూజ చేశారు. అనంతరం చిత్తూరు పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన ఫోటో సెషన్, ఎగ్జిబిషన్ ను పరిశీలించారు. అలానే అక్కడే ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో సీఎం ప్రసగించారు.

హెరిటేజ్ డెయిరీ కోసం చిత్తూరు డెయిరీని కుట్రపూరితంగా మూసేశారంటూ సీఎం జగన్ మోహన్ రెడ్డి కీలక ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలాంటి నోటీస్ ఇవ్వకుండానే ఈడెయిరీని మూసేశారని, చంద్రబాబు.. తన స్వార్థం కోసం సొంత జిల్లా రైతులను నిలువునా ముంచేశారంటూ సీఎం జగన్ సంచనల కామెంట్స్ చేశారు. ఇంకా సీఎం మాట్లాడుతూ…”చిత్తూరు డెయిరీ నష్టాల్లో ఉంటే హెరిటేజ్ లాభాల్లోకి వెళ్లడం ఆశ్చర్యమేసింది. చంద్రబాబు హయాంలో అతి పెద్ద సంస్థగా ఉన్న చిత్తూరు డెయిరీ దారుణంగా దోపిడికి గురైంది.  నేను పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం హామీ నిరవేర్చాను.  రూ.182 కోట్ల బకాయిలను చెల్లించి చిత్తూరు డెయిరీని తిరిగి ప్రారంభిస్తున్నాం. అమూల్ సంస్థ కూడా రూ.325 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. చంద్రబాబు స్వార్థం కారణంగా మూతపడిన ఈ డెయిరీని తెరిపిస్తున్నాము” అని సీఎం అన్నారు.

ఈ చిత్తూరు డెయిరీ ద్వారా పాలు, పెరుగు, వెన్న, పన్నీర్, మజ్జిగను ఉత్పత్తి చేయనున్నారు. మలిదశలో రూ.150 కోట్లతో దేశంలోనే అతి పెద్ద ఐస్ క్రీమ్ ప్లాంట్ ను ఏర్పాటు చేస్తారు.  ఆ తరువాత దశల వారీగా పాల కర్మాగారం, వెన్న, పాలపొడి,చీజ్,పన్నీర్, యోగర్ట్, స్వీట్లు తయారీ విభాగాలను ఏర్పాటు చేయనున్నారు. ఈ డెయిరీ పునరుద్దరణ ద్వారా ప్రత్యక్షంగా 5 వేల మందికి, పరోక్షంగా రూ.2 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. అలాగే 25 లక్షల మంది పాడి రైతులకు లబ్ధి చేకూరనుంది. మరి.. చిత్తూరు డెయిరీ పునరుద్దరణ సభలో సీఎం మాట్లాడిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి