iDreamPost

చిత్ర విచిత్రాల భలే హాస్యం – Nostalgia

చిత్ర విచిత్రాల భలే హాస్యం – Nostalgia

ఏదో ఓ రెండు మూడు సీన్లు లేదా కాసేపు ఆడవేషంలో హీరోలు సినిమాల్లో నటించడం అందరూ చేసిందే. కానీ సెకండ్ హాఫ్ మొత్తం చీరకట్టుకుని ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తూ మెప్పించడం మాత్రం కత్తి మీద సామనే చెప్పాలి. దాన్ని సమర్ధవంతంగా చేసి చూపించిన చిత్రంగా చిత్రం భళారే విచిత్రం ఎప్పటికీ ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంటుంది. ఆ విశేషాలు చూద్దాం. 1988లో మరాఠిలో ‘ఆశీ హీ బన్వా బన్వీ’ అనే కామెడీ మూవీ అక్కడ బ్లాక్ బస్టర్ అయ్యింది. దీనికి 1966లో వచ్చిన బాలీవుడ్ సినిమా ‘బివి ఔర్ మకాన్’ స్ఫూర్తి అయినప్పటికీ తగినన్ని మార్పులతో డైరెక్టర్ సచిన్ పిల్గొంకర్ తీర్చిదిదిన తీరు అల్ టైం కామెడీ క్లాసిక్ గా నిలిపింది. ఇది దర్శకుడు పిఎన్ రామచంద్రరావు గారి దృష్టిని ఆకర్షించింది.

వెంటనే రచయిత తోటపల్లి మధుతో కలిసి తెలుగు ఆడియన్స్ అభిరుచులకు అనుగుణంగా మెయిన్ పాయింట్ ని మాత్రమే తీసుకుని నిర్మాత శ్రీ సాయిరామ్ ఫిలిం యూనిట్ తో కలిసి కొత్త స్క్రిప్ట్ ని సిద్ధం చేశారు. సంగీతం విద్యాసాగర్ అందించారు. చర్చల దశలోనే ఇది నరేష్ తోనే చేయించాలని నిర్ణయం తీసుకున్నారు. ఆయనేమో అప్పుడు మంచి ఫామ్ లో ఉన్నారు. ఒప్పుకుంటారో లేదో అన్న సంశయం. సరే ఏదైతే అదయ్యిందని ధైర్యం చేసి కలిశారు. వింటున్నంత పొట్ట చెక్కలయ్యేలా నవ్వుతూనే ఉన్న నరేష్ ఇది వదులుకుంటే జరిగే నష్టం కళ్ళముందు కనిపించింది. ఎస్ అనేశారు. అంతే ఆలస్యం చేయకుండా షూటింగ్ మొదలుపెట్టారు. అద్దె ఇల్లు కోసం నలుగురు యువకులు తమలో ఒకరిని మహిళగా మార్చేసి ఓ పెద్దావిడకు అబద్దాలు చెప్పి చేరతారు. దానికి ముందు తర్వాత జరిగే సంఘటనల మాలికే ఈ సినిమా. నవ్వు రాని సన్నివేశాలు ఇందులో లేవంటే అతిశయోక్తి కాదు.

నరేష్ ఫ్రెండ్స్ గా బ్రహ్మానందం, రాఘవ, శుభలేఖ సుధాకర్ లకు తోడుగా ఇంటి ఓనర్ గా కోట శ్రీనివాసరావు, సూపర్ మార్కెట్ నడిపే క్యారెక్టర్ లో గిరిబాబు తదితరులు ఒకరిని మించి మరొకరు తమ టైమింగ్ తో చెడుగుడు ఆడేశారు. ముఖ్యంగా దేవుడి బొమ్మ కనిపిస్తే ముద్దులు పెడుతూ చిత్ర విచిత్ర హావభావాలు పలికే పాత్రలో బ్రహ్మానందం కామెడీని ఏళ్ళ పాటు ప్రేక్షకులు మర్చిపోలేకపోయారు. అమ్మాయిగా నరేష్ అందాన్ని చూసి అమ్మాయిలే కుళ్ళుకొనేవారని అప్పట్లో థియేటర్ల వద్ద కామెంట్లు వినిపించేవి. 1991 జూన్ 7న నాగార్జున ‘చైతన్య’తో పాటుగా ఒకే రోజు విడుదలైన ‘చిత్రం భళారే విచిత్రం’ బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టి వంద రోజులు ఆడింది. నవ్వుకోవాలి అనిపిస్తే చాలు ఈ సినిమా ఆడుతున్న హాళ్లకు వెళ్లడం అప్పట్లో ఓ కామన్ సీన్

Also Read : బామ్మా మనవళ్ల వెండితెర వినోదం – Nostalgia

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి